bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

మే 30 – జ్ఞానమును తెలివియు

“వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల, అప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును”   (సామెతలు.  2:4,5).”

అన్ని విధములైన సంపదల యందు ‘జ్ఞానము’ బహు ప్రాముఖ్యమైనది. జ్ఞానము తనంతట తానుగా వచ్చుచున్నది కాదు. మీరు జ్ఞానమును రమ్మని గొప్ప శబ్దముతో పిలిచి, దానిని వెండిని వెతికినట్లు, దాచబడిన ధనమును వెదకినట్లు వెదకవలెను (సామెతలు. 2:4,5). ఆ విధముగా వెదుకుచున్నప్పుడే, జ్ఞానమును, తెలివిని మీవల్ల కనుగొనగలరు.

అపోస్తులుడైన యాకోబు,   “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల, అతడు దేవుని అడుగవలెను; అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక, అందరికిని ధారాళముగ దయచేయువాడు”   (యాకోబు. 1:5)  అని వ్రాయుచున్నాడు.

జ్ఞానమును ప్రభువు వద్ద అడుగుడి సొలోమోనునకు ప్రభువు కొలత లేకుండా జ్ఞానమును ఇవ్వలేదా? ఆయన పక్షపాతము లేని దేవుడు, నిశ్ఛయముగానే మీకును దయచేయును.  సోలోమోను జ్ఞానమును అడుగుట దేవునికి బహుప్రీతి కరముగా ఉండెను (1. రాజులు. 3:10). కావున సొలోమోను అడిగిన జ్ఞానముతో పాటు, ఘనతను, ఐశ్వర్యమును కూడా ప్రభువు దయచేసెను (1. రాజులు. 3:13).

మీరు కూడా మొదటిగా ప్రభువు యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెదుకుచున్నప్పుడు, మిగతా వాటినన్నిటిని మీకు దయచేయును. చిన్న అంశమైనను, గొప్ప అంశమైనను, దానిని  చేయుటకై  దైవిక  జ్ఞానము మీకు అవసరమైయున్నది.   “మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని    వాక్కును, జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును”   (లూకా. 21:15)  అని ప్రభువు వాక్కునిచ్చుచున్నాడు.

జ్ఞానమును, తెలివిని కోరుకొనువారు, దాని ధన ఘారమైన లేఖన గ్రంథమును ఆశించి పరిశీలించి  పఠించెదరు. ప్రతి ఒక్క లేఖన వాక్యమందును, జ్ఞానమును, తెలివియు, దేవుని యొక్క ఆత్మయు, జీవమును ఉన్నది. ఇట్టి వాక్యములు బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించుచున్నది (కీర్తన. 19:7). లేఖన వాక్యములద్వారా జ్ఞానము కలుగును అన్న సంగతిని ప్రభువు  యెహోషువకు నేర్పించెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది,   “ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు; దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము, చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు, దివారాత్రము దాని ధ్యానించుచూ ఉండవలెను; అప్పుడు నీవు నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు”    (యెహోషువ. 1:8). ప్రభువు సొలోమోనునకు మాత్రమే గాక, దానియేలునకు కూడా జ్ఞానమును ఇచ్చెను. ఆ అజ్ఞానము బబులోను దేశమునందు గల జ్ఞానుల అందరికీ జ్ఞానము కంటెను, పది రెట్లు అత్యధికముగా ఉండెను. దేవుని బిడ్డలారా, అటువంటి జ్ఞానమును, తెలివిని ప్రభువు మీకును అనుగ్రహించును.

 నేటి ధ్యానమునకై: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము; మూర్ఖులు జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించుదురు”   (సామెతలు. 1:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.