situs toto musimtogel toto slot musimtogel link musimtogel daftar musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

మే 29 – ఎల్లప్పుడును స్తోత్రించుడి!

“ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము” (1. థెస్స. 5:16,18).

ఒక ఇంటిపైనయున్న చూలను ఒక వ్యక్తి బాగు చేయుచుండెను. నోట కొన్ని మేకులను పెట్టుకుని ఒక్కొక్కటిగా తీసి తన సుత్తిచేత చూలను కొట్టుచున్నవాడు అకస్మాత్తుగా ‘హల్లేలూయా స్తోత్రము’ అని కేక వేసెను.

క్రింద ఉన్నవాడు ఏమి జరిగెనని అడిగినప్పుడు తాను మేకులలో ఒక దానిని మింగివేసెను అని చెప్పెను. ‘దాని కొరకా ఇంతటి ఆర్భాటము? మేకును మ్రింగుటకును హలేలుయాకును సంబంధము ఏమిటి? అని క్రింద నిలబడియున్న వ్యక్తి అడిగెను. ‘మంచిదయింది నేను సుత్తిను మ్రింగలేదు. అలా మ్రింగియున్నట్లయితే ఎంతటి గొప్ప ప్రమాదము. అందుచేత, దేవుని స్తుతించుచున్నాను’ అని పైన ఉన్నవాడు చెప్పెను.

స్తుతించుటకు ఏమీ లేకపోయినను ఏదో ఒక కారణమును కలుగజేసు కొనినవారమై ప్రభువును స్తుతించుడి అని చెప్పెను ఒక భక్తుడు. దావీదు అలాగున స్తుతించుటకు ప్రారంభించి ఒక స్తుతి యోధునిగానే మారిపోయేను. గొర్రెలను మేపుకొనుచు స్తుతించుచు ఉన్న ఆయనను రాజుగా చేసి స్తుతించునట్లు ప్రభువు హెచ్చించెను.

దైవ సేవకుడైన ఒకరు, కష్ట నష్ట సమయములయందు తన యొక్క ప్రార్థన గదికి వెళ్లి తలుపునకు గొల్లము వేసుకుని ఉత్సాహభరితమైన పాటలను పాడి ప్రభువును స్తుతించి నాట్యమాడే వాడట.

“సాతాను నాకు చిన్న కష్టమును కలుగజేసెను. అయితే, ప్రభువు ఆ చిన్న కష్టమును గొప్ప ఆశీర్వాదముగా మార్చబోవుచున్నాడు. కావున ముందుగానే నేను ప్రభువును స్తుతించుచున్నాను” అని ఆయన తన ఆనందమునకు గల కారణమును చెప్పెనట.

బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, దేవుని ప్రేమించువారికి, సమస్తమును మేలుకలుగుటకై సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము” (రోమీ. 8:28).

మీరు దేవుని స్తుతించినట్లయితే, మీకు వచ్చుచున్న ప్రతి ఒక్క శోధనను కూడాను మీరు సాధనముగా మార్చివేయుదురు. అడ్డురాళ్ళు అన్నిటిని మెట్లరాళ్లుగా మార్చివేయదురు. నష్టములన్నిటిని గొప్ప లాభముగా మార్చివేయుదురు. ప్రభువు సమస్తమును మీకు మేలుకలుగుటకై చేయును అను విశ్వాసము దృఢముగా మీయొక్క అంతరంగమునందు ఉండవలెను.

సాతాను ఎన్నో కష్టములను, నష్టములను యోబు భక్తునికి తీసుకొని వచ్చెను. అయితే, యోబు సణుగుకొనలేదు. ఆయన. “నేను నా తల్లిగర్భములో నుండి దిగంబరినై వచ్చితిని; దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను, యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక” (యోబు. 1:21) అని చెప్పి స్తుతించుటకు ప్రారంభించెను.

దేవుని బిడ్డలారా, మీ శోధన యొక్క అంతమునందు మీరు రెండంతలుగా ఆశీర్వాదములను పొందుకొందురుగాక!

నేటి ధ్యానమునకై: “యెహోవా జీవముగలవాడు; నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు; నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక” (2. సమూ. 22:47).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.