No products in the cart.
మే 28 – జ్ఞానమునైయున్న సంపద
“బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి” (కొలస్సీ. 2:3).”
యేసుక్రీస్తు నందున జ్ఞానము, బుద్ధి మొదలగు సకల అమూల్యమైన సంపదలను ఆయన తనకు చిత్తమైన వారికి ఇచ్చును. ప్రభువు ఒక్కడు మాత్రమే మనుష్యుల యొక్క తలంపులను, ఊహలను, ఆలోచనలను, క్రియలను అను సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏదియు లేదు.
అపోస్తులుడైన పౌలు, ప్రభువు యొక్క బుద్ధి, జ్ఞానముల బాహుళ్యయత ఎంతో గొప్పదని చెప్పి మిగుల ఆశ్చర్యపడెను (రోమీ. 11:33). మీరు దాహముతో ఉండినట్లైతే, ప్రభువు మీకు కావలసిన జ్ఞానమును నిశ్చయముగా దయచేయును.
నేడు మనుష్యుని యొక్క జ్ఞానము బహుగా విస్తరించెను (దాని 12:4). విమానములును, రాకెట్లను, అంతరిక్ష ప్రయాణములును, కంప్యూటర్ గూర్చిన జ్ఞానమును, లోకమును నివ్వరపోవునట్లు చేయుచున్నది. అదే సమయము నందు, కొంత కీడైన జ్ఞానములు మనుష్యుని అపాయకరమైన, నాశనపు మార్గము నందు తీసుకుని వెళ్లి నిలబెట్టు చున్నది.
అయితే ప్రభువు, తన యొక్క బిడ్డలకు ఆత్మ సంబంధమైన జ్ఞానమును దయచేయుచున్నాడు. నిత్యత్వమును గూర్చిన, పరలోకపు జ్ఞానమును దయచేయుచున్నాడు. ఇట్టి అజ్ఞానమును లోకజ్ఞానలు ఎవరును ఎరుగనే ఎరగరు. ప్రభువు ఇచ్చుచున్న ఇట్టి జ్ఞానమను సంపద ఆరు విధముల యందు మీకు ప్రయోజన కరముగా ఉండును.
మొదటిగా, ప్రభువును గూర్చిన జ్ఞానము. రెండవది, లేఖన గ్రంథము యొక్క లోతులను, రహస్యములను ఎరుగుచున్న జ్ఞానము. మూడవది, మిమ్ములను మీరు ఎరుగుచున్న జ్ఞానము. నాల్గవది, ఆత్మీయ స్థితిగతులను గూర్చిన జ్ఞానము. ఐదవది, ఒక మనిష్యుని గూర్చిన, స్థలమును గూర్చిన, ఒక పరిస్థితిని గూర్చిన, జ్ఞానము. ఆరవది, పరలోకమును గూర్చియు, పాతాళమును గూర్చియు, ఆత్మలయొక్క లోకమును గూర్చియు ఎరుగుచున్న జ్ఞానము. ఇట్టి జ్ఞానములన్నియు గొప్ప అమూల్యమైన సంపదలు కావా?
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు” (సామెతలు. 28:5). గొప్ప సువార్త కూటములు యందు, సమస్యలను, వ్యాధులను పేరు పెట్టి పిలుచుటయు, వారికి ఉండేటువంటి సమస్యలను, వ్యాధులను గూర్చి ప్రవచనముగా చెప్పి ప్రార్ధించుటయు ఈ పరలోకపు యొక్క జ్ఞానమే.
దేవుని బిడ్డలారా పలు విధములైన ప్రజలను మీ జీవితమునందు మీరు సంధించ వచ్చును. ఈయన ఎటువంటివాడు, ఎట్టి ఉద్దేశముతో వచ్చియున్నాడు, లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడుచుండు వాడా, మంచి వారివలె నటిస్తూ మనస్సునందు వంచనను పెట్టుకుని ఉన్నవాడా అను సంగతి నంతటిని, ఇట్టి జ్ఞానమునైయున్న సంపద మీకు గ్రహింప జేయును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “యేసు……..మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు” (యోహాను. 2:24,25).
నేటి ధ్యానమునకై: “……వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునైయున్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును; అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది” (దానియేలు. 2:21,22).