Appam, AppamAppam - Telugu

మే 27 – శ్రేష్టమైన సృష్టి!

“సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై, ఆయన చేసిన పనియైయున్నాము”     (ఎఫేసి. 2:10).

మీరు శ్రేష్టమైనవారు. ప్రభువు యొక్క హస్తమునందు శ్రేష్టమైన సృష్టియైయున్నారు. దేవుడు మిమ్ములను సృష్టించినప్పుడు, తన పోలికగాను, తన స్వరూపమునందు సృష్టించెను. మీరు లోక ప్రకారముగాను, ఆత్మ సంబంధమైన వారిగాను ఎదుగుటకును, విజయవంతమైన జీవితమును జీవించుటకును కావలసిన వాటినంతటిని చేసి ముగించెను.

మీ యొక్క ఆత్మ శ్రేష్టమైనది. పరలోకముతోను, పరిశుద్ధాత్మునితోను సత్సంబంధమును కలిగియుండేది. మీ యొక్క ప్రాణము శ్రేష్టమైనది. మీరు ప్రభువును స్తుతించుచున్నప్పుడు, మీయొక్క ప్రాణమునందు ఆనందించుట జరుగుచున్నది. ప్రభువును ప్రేమతో పాడి ఆరాధిస్తున్నప్పుడు, దేవుడి ప్రసన్నతయు, సముఖమును వరదవలె దిగివచ్చి, మిమ్ములను ఆవరించుచున్నది.

మీరు శ్రేష్టమైనవారు. ఎందుకనగా మిమ్ములను విమోచించుటకు దేవాది దేవుడు పరలోకపు వీధులను, మహిమను విడిచిపెట్టి దాసునివలె తన్నుతాను తగ్గించుకొనెను. మీ కొరకు సిలువను మోసి తన యొక్క అమూల్యమైన రక్తమును కార్చి ఇచ్చెను కదా. ఆయన ఎంతటి ఔనత్యముగా మిమ్ములను చూచియున్నాడు! ఆయన యొక్క సాత్వికము మిమ్ములను గొప్ప చేయును (కీర్తనలు.18: 35).

మిమ్ములను గూర్చి ప్రభువునకు ఒక ప్రణాళికయు, స్పష్టమైన ఉద్దేశము కలదు. మీరు ప్రభువు యొక్క క్రియయైయున్నారు. శ్రేష్టమైన సృష్టియైయున్నారు. దేవుని యొక్క శ్రేష్టమైన పాటయైయున్నారు. కావున ఎన్నడు మిమ్ములను చులకనగా ఎంచుకొని,  చులకన భావమునకు చోటు ఇవ్వకుడి. మీరు అద్భుతమైనవారు, ప్రత్యేకమైనవారు.

మందలో ఏదో ఒక, సాధారణమైన ఒక గొర్రెగా ఉండేటువంటి స్థితిని విడచిపెట్టుడి. మందయందు గల ఒక గొర్రెకు ఎదుట ఒక చేతి కర్రను చాపినట్లైతే, మొదటిగా ఒక గొర్రె దాటి వెళ్ళును. ఆ తరువాత దానిని చూసి మిగతా గొర్రెలు కూడాను ఒకదాని వెనుక ఒకటి దాటుటకు ప్రారంభించును. ఆ చేతి కర్రను తీసివేసిన తర్వాత కూడాను, గొర్రెలు మందలోనిగల స్వభావము చొప్పున గ్రూడ్డితనముగా దాటి వెళ్ళచ్చునే ఉండును. ఎందుకని దాటుచున్నాము, దేనికొరకు దాటుచున్నాము అని అవి తలంచి చూడవు. నేడు అనేకులు అలాగునే  జీవితమునందు గల ఉద్దేశమును ఎరగనివారై జీవించుచున్నారు.

ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యెజబెలును వెంబడించి, మందలు మందలుగా విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయిరి. తాము ప్రభువునకు శ్రేష్టమైన ప్రజలము అను సంగతిని మరచిపోయిరి. ప్రభువు యొక్క శాశ్వతమైన ప్రేమను మరచిపోయిరి. అయితే ఏలియా, తాను శ్రేష్టమైనవాడు అను సంగతిని గ్రహించెను. కావున ఆకాశము నుండి అగ్నిని దించి యెహోవాయే దేవుడని నిరూపించి చూపించెను.

దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను ప్రత్యేకమైన వారిగా సృష్టించి, గొప్ప ఔనత్యమైన అంశములను కాంక్షించుచున్నాడు. ప్రభువు కొరకు మీరు వైరాగ్యముతో నిలబడుడి. ఆయన సర్వశక్తిమంతుడు. నీ కొరకు బహు బలమైన కార్యములను జరిగించును. ఆయన మహిమగల రాజు. మిమ్ములను మహిమ నుండి అత్యధిక మహిమను పొందుకొనునట్లు చేయును.

నేటి ధ్యానమునకై: “యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులైయున్నారు”     (గలతి. 3:26).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.