bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

మే 19 – అప్పు ఇచ్చుటయను, అప్పు చెయ్యకయుండుటయును

“యెహోవా నీ దేశముమీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును; నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు”    (ద్వితి. 28:12) 

అప్పుల సమస్యలయందు చిక్కుకొనక ఉండుడి. ప్రభువు యొక్క వాగ్దానమును విశ్వసించి, అనేక జనములకు అప్పు ఇచ్చేటువంటి ధన్యకరమైన అనుభవములోనికి తరలిరండి. ప్రార్థనతో ఇట్టి వాగ్దానమును అంగీకరించి మెండైన దేవుని ఆశీర్వాదమును స్వతంత్రించుకొనుడి.

ఎటువంటి తండ్రియైయినను, తన యొక్క బిడ్డ ధరిద్రుడుగాను, అప్పులల్లో చిక్కుకొని అలమట్టించుటను కోరుకొనునా? నిశ్చయముగా కోరుకొనడు. మనము ఆరాధించుచున్న మన యొక్క దేవుడు ఐశ్వర్యమునందు సంపన్నుడు. ఆకాశమును అయనది, భూమియు అయనది. బంగారమును ఆయనది, వెండియు ఆయనది.

సముద్రపు అడుగు భాగమునందు గల ముత్యములును, భూమి యొక్క అడుగు భాగమునందు గల అమూల్యమైన మాణిక్యపు రాళ్లును సృష్టించినవాడు ఆయనే.  ఆయన మీయొక్క పరలోకపు తండ్రి. మీరు నిండుతనము గలవారుగాను, సంపూర్ణత గలవారిగాను, ఉండవలెనని ఆయన కోరుచున్నాడు.

అయితే సాతాను, దేవుని ప్రజలను ప్రభువును ఆనుకొని ఉండ నివ్వకుండా, అప్పుల సమస్యలోనికి త్రోసివేయుటకు ప్రయత్నించుచున్నాడు. సులభతరమైన వాయిదాలయందు మీరు కోరుకున్నవన్నియు పొందుకొన వచ్చును అని ప్రకటనను చేయుచున్నాడు. పలు రుణాలను ఇచ్చు సొసైటీలను తరచి ఉంచి మిమ్ములను ఆకర్షించుచున్నాడు. చౌక ధరలకే అమ్మబడుచున్నట్లు, ఒక అబద్ధపు ప్రలోభమును కలుగజేసి, మీకు తెలియకుండానే మిమ్ములను రుణస్తులుగా చేసి యాతనపాలు చేయుచున్నాడు.

అనేకులు ఇది సాతాను విరిచిన వల అనుటను ఎరగకుండానే రుణము అను ఉచ్చులలో చిక్కుకొనుచున్నారు. దీని ద్వారా హృదయము నందుగల సమాధానమును, కుటుంబము నందుగల నెమ్మదిని కోల్పోవుచున్నారు.

యేసుని తట్టు తేరి చూడుడి‌. దైవత్వము యొక్క పరిపూర్ణత అంతయును శరీర ప్రకారముగా ఆయన యందు నివాసమైయున్నది. యేసు పరిపూర్ణుడైయున్నట్లు మీరును ఆయన యందు పరిపూర్ణులైయున్నారు.

అపోస్తులుడైన పౌలు చెప్పుచున్నాడు,   “మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు, మీరు తన ధారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను”     (2. కోరింథీ. 8:9).

పాపపు జీవితము నుండి మీరు విడుదల పొందుకొని, పరిశుద్ధమైన జీవితమును జీవించవలెను అంటే, మీరు ఎంతకెంతకు కోరుకొనుచున్నారో, అంతకంతకు అప్పుల సమస్య నుండి విడిపించబడి, సమృద్ధిగల వారిగా ఉండవలెనని కోరుకొనుడి.  శాపములు బాపి, ఆశీర్వాదములు వచ్చి సమకూర్చబడవలెను అనియు ప్రార్థించుడి. వ్యాధులు తొలగి ఆరోగ్యమును పొందుకొనవలెను  అనియు గోజాడుడి.

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ఆశీర్వాదమే ఐశ్వర్యమును ఇచ్చును; ఆయన దానితోపాటు వేదనను అధికము చేయడు.

నేటి ధ్యానమునకై: 📖”నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను;…..  నేటివలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే”    (ద్వితి. 8:18).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.