No products in the cart.
మే 16 – అరణ్యమును, త్రోవయు
“ఇదిగో, నేనొక నూతనక్రియ చేయుచున్నాను,…..నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను” (యెషయా. 43:19)
నాకు ఒక మార్గము తెరవబడదా, నాకు ఒక త్రోవ పుట్టదా, నాకు ఒక మేలుకరమైన అంశము జరగదా, నా యొక్క కుటుంబమును ప్రభువు గొప్ప ఔన్నత్యముతో హెచ్చింపచేయడా, అనియంతా పలు ప్రశ్నలతో మీరు ఉండవచ్చును. ‘నేను అరణ్యములో త్రోవను, ఎడారులలో నదులను కలుగజేసెదను’ అనుటయే ప్రభువు యొక్క వాగ్దానమైయున్నది.
మనుష్యుల యొక్క ప్రయత్నము వలన పలు మార్గములు మీకు ముయబడవచ్చును, ద్వారములు అడ్డగడియలు వేయబడవచ్చును. ముందంజకు విరోధమైన గుద్దు బండలను తీసుకొని రావచ్చును. ఏరికో ప్రాకారమునకు ఉనట్లుగా ఇత్తడి తలుపులును, ఇనుప గడియలును మీకు సవాలు విడవవచ్చును. అట్టి పరిస్థితులయందు ప్రభువును తేరి చూడుడి. ఎట్టి స్థలములయందు మార్గము తెరవబడదు అని మీరు తలంచుచున్నారో, అది ఎట్టి స్థలమైనను ప్రభువు మీకు మార్గమును తెరవచేయును.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునుండి బయటకు వచ్చినప్పుడు, ఎర్ర సముద్రమును దాటలేకపోవుచు విభ్రాంతిచెంది నిలచిపోయిరి. వెనకవైపున తరుముచు వచ్చుచున్న ఐగుప్తు యొక్క సైన్యము. రెండు వైపులయితే అతిపెద్ద కొండలు. ఐగుప్తు యొక్క చేతిలో పడి చిక్కి చచ్చుటయా లేక ఎర్ర సముద్రమునందు మునిగిపోవుటయా అని తెలియక అంగలార్చిరి. అయితే, ప్రభువు అరణ్యమునందు త్రోవను కలుగజేయువాడు. ఆయన మోషేను చూసి, ‘నీ చేతి కర్రను ఎర్ర సముద్రమునకు తిన్నగా చాపము’ అని చెప్పెను. చేతి కర్రను చాపినప్పుడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీలి మార్గము కలుగజేయబడెను.
అదే విధముగా, యోర్ధాను నది ఒడ్డున అట్టి వరదను చూసిన ఇశ్రాయేలీయులు భయపడిరి. కోతకాలము ముగియుచున్నంత వరకును యోర్థానునందు గొప్ప ప్రవాహము ప్రవహించుచూనే ఉండును. ఎలాగున ఇట్టి గొప్ప నీటి వరదను దాటి పోవుట? ఎలాగున త్రోవ కలుగును?
అవును, నిబంధన మందస పెట్టెను మోయుచున్న యాజకులు యుర్ధాను నదిలో కాలు మోపినప్పుడు అది రెండు పాయలుగా చీలి త్రోవ కలిగెను. ప్రభువు మీ కొరకు మార్గమును తెరుచుటకు తలంచిచినప్పుడు అది ఎవరి వలననైనను ఆపలేరు. ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియల ఆటంకములను తొలగించి వేయువాడు, మీకు ముందుగా వెళ్ళుచున్నాడు (మీకా. 2:13)
షద్రకు, మేషాకు, అబేద్నగోలను అగ్నిగుండము నందు ఎత్తి పడవేసిరి. అక్కడ కూడాను ప్రభువు త్రోవను కలగజేయునా? అవును, అట్టి పరిస్థితులయందు రగులుచు మండుచున్న అగ్ని యొక్క మధ్యలోను ప్రభువే స్వయముగా దిగి సంచరించెను వారికి త్రోవను కలుగజేసెను. వారు అగ్ని గుండమునందు సంతోషముతో సంచరించుచు వచ్చిరి. ప్రభువు అగ్ని యొక్క ఉగ్రతను ఆర్పివేసెను. రాజు యొక్క అంతరంగము నందు మాట్లాడి ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్లెను.
ప్రభువు అరణ్యమునందు త్రోవను. ఎడారులలో నదులను కలుగజేయివాడు దేవుని బిడ్డలారా, మీ యొక్క మార్గములను ప్రభువు సశ్యశామలముగా మార్చును. ప్రభువు నూతన ద్వారములను తెరవజేయును. ఎవరును దానిని మూసివేయలేరు.
నేటి ధ్యానమునకై: “ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును” (యెషయా. 35:6,7)..