No products in the cart.
మే 06 – ఏలీయాయు, మోషేయ
“ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట లాడుచుండిరి” (మత్తయి. 17:3
రూపాంతర పర్వతము యొక్క అనుభవము పాతనిబంధన పరిశుద్ధులను, కొత్త నిబంధన పరిశుద్ధులను ఏకముగా జతపరుచుచున్నది. మృతులైన పరిశుద్ధులను, సజీవముగా ఉన్న పరిశుద్ధులను జతపరచుచున్నది. పరమునకు ఎక్కి వెళ్లిన పరిశుద్ధులను, పరిచర్యను చేయుచున్న పరిశుద్ధులను జతపరుచుచున్నది. ఇది ఎంతటి మనోహరమైన ఒక కలయిక!
యేసుక్రీస్తు యొక్క కాలమునకు దరిదాపులు 1500 సంవత్సరములకు పూర్వము జీవించినవాడు మోషే (కీ.పూ. 1571 – 1441). ఏలియా దరిదాపులు 900 సంవత్సరములకు పూర్వము జీవించినవాడు (కీ.పూ. 910 – 886). మోషే ధర్మశాస్త్రము యొక్క చిహ్నమైనవాడు. ఇశ్రాయేలు ప్రజలను మార్గమునందు నడిపించి శినాయి పర్వతము నుండి దేవుని యొక్క ఆజ్ఞలతో నిండిన రెండు రాతి పలకలను పొందుకొని దిగివచ్చెను (నిర్గమ. 31:18).
అయితే ఏలియా, ప్రవక్తలయందు గొప్ప ఔన్నత్యముగలవాడు, ప్రభువు కొరకు భక్తి వైరాగ్యముతో కూడిన మంటగా రగులుకొని మండినవాడు. మోషేను తలంచుచున్నప్పుడల్లా, సినాయి పర్వతమునందు ప్రభువు ఆయనతో మాట్లాడుటను మనము జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఏలియాను తలచుచున్నప్పుడల్లా, హోరేబు పర్వతమునందు ప్రభువు యొక్క మృదువైన స్వరము వినిన వాడిగా ఎరుగుదుము. కర్మేలు పర్వతమునందు బయలు ప్రవక్తల వద్ద ఆయన సవాలు విసిరిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుచున్నాము. వారికి ఉన్నతమైన పర్వతముల యొక్క అనుభవములు ఉండెను.
సినాయి పర్వతమునందు ఉండినవాడును, కర్మేలు పర్వతమునందు ఉండినవాడును ఇప్పుడు ప్రభువుతో కూడా రూపాంతర పర్వతమునందు నిలబడుచున్నారు. ఇందులో మోసే మృతిపొంది ప్రభువుచే సమాధి చేయబడినవాడు. అయితే, ఏలియా మరణము పొందక సజీవముగా పరలోకమునకు కొనిపోబడినవాడు. ధర్మశాస్త్రమును, ప్రవచనమును కృప యొక్క నియమమును తీసుకుని వచ్చి క్రీస్తును సంధించుట ఎంతటి ఆశ్చర్యమైన ఒక అంశము! అవును, క్రీస్తే అన్ని నియమములకు పైనున్న నియమమైనవాడు. ప్రవక్తల అందరిలోను అత్యున్నతమైన ప్రవక్తయైనవాడు.
ప్రభువు యొక్క కుటుంబము పెద్దది. ఆయన కుటుంబమునందు పాత నిబంధన పరిశుద్ధులును కలరు. క్రొత్త నిబంధన పరిశుద్ధులును కలరు. క్రీస్తే వంతెన వంటివాడు. ఒకవైపు మోషేయు ఏలియాయు నిలబడుచున్నారు. మరోవైపున పేతురును యోహానును యాకోబును నిలబడుచున్నారు.
మోషే ఎటువంటి శరీరముతో ఉండియుండును? జీవింప చేయబడిన శరీరమా? ఏలియా ఎటువంటి శరీరముతో ఉండియుండును? రూపాంతర పరచబడిన శరీరమా? లేక, ఇద్దరును భూమియందు ఎటువంటి శరీరముతో జీవించెను అదే శరీరముతోనే ఉండియుందురా? తెలియలేదు.
అయితే పేతురు వారిని చూచిన వెంటనే, ఎవరును పరిచయము చేయకుండానే అది మోషే అనియు, ఏలియా అనియు కనుగొనెను. దేవుని బిడ్డలారా, పరలోకమునందు పేరు రాయబడియున్న జ్యేష్ఠుల సార్వత్రిక సంఘమైయున్న సంఘముతో కూడా ఏకముగా జతపరచబడియున్నాము. మన కుటుంబము పెద్దది! అది నిత్యమైనది! ఆశీర్వాదమైనది!
నేటి ధ్యానమునకై: “పరలోకమందు పేరు వ్రాయబడియున్న సార్వత్రిక జ్యేష్టుల సంఘమునకును …. సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును …. వచ్చియున్నారు” (హెబ్రీ. 12:23).