No products in the cart.
మే 03 – కృపయు, కనికరమును
“మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని; నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును” (యెషయా.54:8)
బైబిలు గ్రంధము అంతటను వాగ్దానము చేత నిండియున్నది. వాక్కును ఇచ్చుచున్న ప్రభువు మన యొక్క హస్తమును పట్టుకుని, ‘నేను నీకు సహాయము చేసెదను. నేను నీకు కేడమును, మహా గొప్ప బలమునైయున్నాను. నేను నిన్ను విడిచి ఎడబాయను, నేను నిన్ను చేయి విడిచి పెట్టను. నేను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును’. అనియంతా ప్రేమతో వాక్కునిచ్చుచున్నాడు.
“పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోక యుండును” (యెషయా.54:10). ఇక్కడ ఎన్నడను ఎడబాయని కృపను గూర్చి ప్రభువు మాట్లాడుచున్నాడు. ఇట్టి కృపను ప్రభువు ఎవరెవరికి దయచేయును?
మొట్టమొదటిగా, ప్రభువుపై తమ యొక్క నమ్మిక అంతటిని ఉంచి ఆయనను వెంబడించుచున్న వారికి ఆయన కృపను అనుగ్రహించుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది, “యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించుచున్నది” (కీర్తన. 32:10). దావీదు బాల్యపు దినము నుండి తనయందు గల దేవుని కృపను గ్రహించెను. కావున ఆయన అత్యధికముగా ప్రభువు మీద నమ్మికను ఉంచి ప్రభువునే ఆశ్రయించియుండెను. సింహములు గాండ్రించుచు వచ్చినప్పుడును, ఎలుకబండ్లు ఉరుముచున్నప్పుడును, గోలియాతు నిందించినప్పుడును, రాజైన సౌలు తరుముచ్చు వచ్చుచున్నప్పుడు ప్రభువునే నమ్మియుండెను. కావున దావీదును ప్రభువు యొక్క కృప ఆవరించియుండెను.
దావీదు సెలవిచ్చుచున్నాడు, “నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యమునుండి నా (ఆశ్రయము) నమ్మికయైయున్నవాడవు నీవే” (కీర్తన. 71:5). మీరు ప్రభువు మీద మాత్రమే మీ నమ్మికను ఉంచుడి. ఆయనను నమ్మినవారు ఎన్నడును సిగ్గునొందరు. మీరు ఆయనను పరిపూర్ణముగా నమ్మి ఆశ్రయించి ఉన్నట్లయితే, మీరు జీవించు దినములన్నిటను కృపా క్షేమములే మిమ్ములను వెంబడించును.
రెండోవదిగా, ప్రభువు తన యొక్క చిత్తమునకు లోబడి ఆయనను వెంబడించుచున్నవారికి తన కృపను దయచేయుచున్నాడు. దీనికై మంచి ఉదాహరణగా, అబ్రహామును గూర్చి చెప్పవచ్చును. తన బంధువులను, తన తండ్రి ఇంటిని విడచి, లోబడినవాడై దేవుడు తనకు చూపించుచున్న దేశమునకు బయలుదేరి వెళ్ళెను. కావున అబ్రహాము యొక్క జీవిత దినములన్నిటను దేవుని యొక్క కృప ఆవరించియుండెను. ఆ సంగతిని చూచిన అబ్రహాము యొక్క దాసుడైయున్న ఎలియాజరు, ప్రభువు తన యొక్క కృపను, తన యొక్క సత్యమును నా యజమానునికి చూపుట మానలేదు అని చెప్పి ఆనందించెను (ఆది.24: 27).
మూడోవదిగా, నీతిమంతులైయుండి దేవునితో నడుచుచున్న వారికి ఆయన కృపను అనుగ్రహించుచున్నాడు. నోవాహు యొక్క కాలమునందు లోకమంతయు పాపమునకు లోనైయుండెను. అయితే, ప్రభువు యొక్క దృష్టియందు నోవాహుకు మాత్రము కృప లభించుటకు గల రహస్యము ఏమిటి? (ఆది.6: 8). కారణము, నోవాహు తన కాలమునందు గల తన తరమువారిలోనే నీతిపరుడును నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచుచున్నవాడై ఉండెను (ఆది. 6:9). దేవుని బిడ్డలారా, నేడు లోకము అంతటను పాపమును, దోషమును నిండియుండినను, ఇట్టి దోషపూరితమైన తరమువారిలో నుండి మీరు దేవుని ఎదుట నిందారహితులై ఉంటున్నప్పుడు, కృప మిమ్ములను ఆవరించును.
నేటి ధ్యానమునకై: 📖”భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది” (కీర్తన. 103:11).