No products in the cart.
మార్చి 30 – ప్రేమ కోపపడదు!
“ప్రేమ …. త్వరగా కోపపడదు” (1. కొరింథీ. 13:5).
కోపము అనగా, ఓటమి యొక్క సూచన. కోపమును అధికమించువాడే జయించువాడు. ఒక్కనిపై ఇతరులు నేరము మోపి నిందించుచున్నప్పుడు, అతనిని పరిహసము చేయుచున్నప్పుడు అతడు కోపమునకు చోటివ్వక దైవీక ప్రేమతో నడుచుకున్నట్లయితే, అతడే శోధనను జయించిన వాడైయుండును. ఏ మనుష్యుడైతే కోపమును ప్రేమ చేత జయించుచున్నాడో, అతడే ఎల్లప్పుడును ప్రతి పరిస్థితి యందును జయించుచున్న వాడైయుండును.
ఒక మంచి సహోదరుని వివాహము చేసుకున్నవాడు, మృగస్వభావము గలవాడైయుండెను. ఆమె ధనము కొరకే ఆమెను వివాహము చేసుకొనియుండెను. ఒక దినమున ఉదయాన చిన్న సమస్యను నిమిత్తము అతడు ఆమెను కొట్టి తన్నెసి బయటకు వెళ్ళిపోయెను. మధ్యాహ్నము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బల్ల మీద భార్య తన కొరకు ఆహారమును పెట్టి ఉండుటను చూచి నివ్వరపోయెను. అతని భార్య అతనిని ప్రేమతో పిలిచి భోజనమును వడ్డించుటకు కూర్చుండెను.
అప్పుడు ఆ భర్త నేను నిన్ను ఉదయమున అత్యధికముగా గాయపరిచానా అని అడిగినప్పుడు, అతని భార్య చెప్పిన జవాబు అతని హృదయమును తాకెను. ఆమె చెప్పిన మాట: ‘మీరు నన్ను కొట్టనే లేదు, మిమ్మలనే కొట్టుకున్నారు. ఆనాడు ఆలయమునందు దేవుని సముఖములో నా చెయ్యిని మీ చెయ్యిలో పెట్టినప్పుడు నా శరీరము అంతయు మీకు సొంతమైపోయింది. బైబిలు గ్రంథము: 1. కొరింథీ. 7:4 ‘వ వచనములో నా శరీరమునకు మీరే అధికారి అని స్పష్టముగా చెప్పియున్నాడు చూడండి. దేవుడు నాకు దయచేసిన శిరస్సు మీరే, నేను మీకు సొంతము. నన్ను కొట్టుటకు గాని తొక్కుటకు గాని మీకు హక్కు ఉన్నది. మీరు నాకు ఏమి చేసినాను నాకు ఈ లోకమునందు ప్రేమించుటకు మీరు తప్ప వేరే ఎవరిని దేవుడు నాకు ఇవ్వలేదే’ అని చెప్పెను. ఇట్టి మాటలను చెప్పి ఆమె అతని వైపు చూచెను. అయితే అతడు హృదయము బద్దలైనట్లుగా మనస్సునందు నొచ్చుకొనుచు ఏడ్చుచుండెను. ఆ దినము మొదలుకొని ఆ కుటుంబము లోతైన ప్రేమచేత కట్టబడి లేవనెత్తబడెను.
యేసును సిలువలో తేరిచూడుడి; ఎంతటి నిందలు, ఎంతటి అవమానములు, ఎంతటి పరిహాసములు! దానితో పాటు, కొరడాలతోను కర్రతోను కొట్టబడెనే. మేకుల చేత దిక్కొట్టబడెనే, ఆయన కోపపడెనా? లేనేలేదు. దానికి బదులుగా ఆయనను హింసించిన వారి కొరకు, ఆయన తండ్రి వైపు చూచి: “తండ్రి, వీరిని క్షమించుము” అని వేడుకునెను కదా? అదియే కోపమును జయించేటువంటి మార్గము.
ప్రేమ విస్తారమైన పాపములను కప్పును. పాపములు కప్పబడినప్పుడు కోపమునకు గాని, మూర్ఖతకు గాని అక్కడ తావు లేదు. జగడములకు గాని, విభజనలకు గాని అక్కడ మాటలే లేవు. ప్రేమ దైవీక ఏలుబడిని చేయను. ప్రత్యేకముగా యేసు ఈ లోకమును విడచి కొనిపోబడుటకు ముందుగా పలుమార్లు శిష్యులను చూచి: ”ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగియుండుడి” అని చెప్పెను. అందుకు ఆయనే ఆదర్శవంతముగా ఉండెను.
యేసు చెప్పెను: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీరును ఒకరినొకడు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞయైయున్నది” (యోహాను. 15:12). దేవుని బిడ్డలారా, క్రోధమును, కోపమును ప్రేమచేత జయించుచున్నవారై ఉండుటకు మనము ప్రయత్నించవలెను.
నేటి ధ్యానమునకై: “ప్రేమ పొరుగువానికి కీడుచేయదు; గనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే” (రోమీ. 13:10).
