No products in the cart.
మార్చి 28 – అడ్డురాళ్ళును, మెట్లరాళ్లును!
“ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగాపోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు” (మీకా.2:13)
ఓటమిని విజయముగా మార్చుకొనవలెను అంటే, మీరు ఎల్లప్పుడును విజయపు తలంపుగలవారై ఉండవలెను. విజయమును పొందుట ఎలాగు అనుటయందు మీయొక్క పూర్తి ధ్యాసను చెల్లించవలెను. విజయము పొందుటకు అనేక అడ్డురాళ్ళను మీరు దాటుకొని రావలసినదై ఉండును. ఎట్టి అడ్డు రాయినైనను మెట్ల రాయిగా మార్చుకొనుడి. కఠినమైన పరుస్థుతులనైనను, సార్థకమైనదిగా చేసుకొనుడి.
ఒక ఉపన్యాసకుడు, ఒక కూటమునందు మాట్లాడుచు ఉన్నప్పుడు, జన సమూహములో నుండి, ఒక రాయి ఆయన వైపునకు దూసుకొని వచ్చెను. ఆయన అత్యధిక సామర్ద్యముతో ఆ రాయిని తన చేతితో అమాంతముగా పట్టుకున్నవాడై, ‘అయ్యా! నాపై రాయను విసిరివేసిరే’ అని పిరికి వానివలె కేక వేయక, “సామాన్యమైన ప్రజలారా, ఈ రాయి నా పైనను కాదు; మీ ప్రతి ఒక్కరి పైనను వేయబడిన రాయి; ఓటమి పొందినవారు విసిరి వేసిన రాయి.
అయినను ఇది ఒక ఆశీర్వాదకరమైన రాయి. మీరు ఇంటిని కట్టుచున్నప్పుడు ఈ రాయిని వాడినట్లయితే, మీ ఇల్లు ఒక భవనముగా మారును. ఇప్పుడు, అమూల్యమైన ఈ రాయిని నేను వేళము వెయ్యబోవుచున్నాను” అని చెప్పి వేళము వేసెను. అతి గొప్ప మొత్తమునకు అది వేళము పాడబడెను. జ్ఞానము గలవాడు, ఆడ్డురాళ్లను తొలగించి, వాటినే విజయపు మెట్లరాళ్లుగా మలచుకొనును.
మీ యొక్క జీవితమునందు అడ్డుగా ఉన్నది ఏది? విజయమును స్వతంత్రించు కొననివ్వక మీతో పోరాడుచున్న పాతాళము యొక్క శక్తులు ఏవి? అత్యధిక శాతము పాపము ద్వారా కలుగుచున్న నెరారోపణ భావమును, నేరము మోపుచున్న మనస్సాక్షి అనేకులను జయమును పొందనివ్వక, దాసత్వపు చెరయందు ఉంచియున్నది.
అయితే మీరు సిలువ వద్దకు వచ్చి, మీయొక్క పాపములను సిలువుయందు మోసిన వానిని తేరిచూచినట్లయితే, ఇట్టి ఆటంకములు తొలగిపోవును. యేసుక్రీస్తు పాపములను, దోషములను భరించి మనకు విరోధమైన వ్రాతపూర్వకమైన చేతిరాత పత్రమును తుడిచివేసి, మనకు అడ్ఠము లేకుండా మేకులతో సిలువకు కొట్టివేసి, జయము పొందెను (కొలస్సీ. 2:14).
కొందరికి వ్యాధులును బలహీనతయు జీవితమునందు ముందుకు కొనసాగనివ్వక అడ్డురాయిగా ఉండవచ్చును. నిశ్చయముగానే మీరు జీవితమునందు ముందుకు కొనసాగుటకు స్వస్థతయు, బలమును, ఆరోగ్యమును నిత్యమును హేతులైయుండును. ప్రభువు మీకు ఆరోగ్యమును వాగ్దానము చేసియున్నాడు. “నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే” అని తండ్రియైన దేవుడు సెలవిచ్చియున్నాడు (నిర్గమ. 15:26). “ఆయనే(యేసు) మన బలహీనతలను వహించుకొని, మన రోగములను భరించెను” (మత్తయి. 8:17).
పలు శాపములు మీకు ఆటంకముగా ఉన్నాయా? కుటుంబ శాపములు ఆటంకముగా వచ్చుచున్నాయా? ఇట్టి సమయములయందును శాపమును తొలగించి, ఆశీర్వాదమును దయచేయుటకు ప్రభువు ఆసక్తితో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తిచేత ప్రతి అడ్ఠురాళ్లను అధిగమించి జయవీరులుగా ఉండుడి.
నేటి ధ్యానమునకై: 📖”నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తన. 32:8).