No products in the cart.
మార్చి 26 – పొందుకొనిన విజయమును ప్రకటించుడి!
“అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండగ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱెపిల్లను ఎత్తికొని పోవుచుండగ; నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని” (1. సమూ. 17:34,35).
మీరు విజయమును పొందుకొనుటకై వెంబడింపవలసిన దేవుని యొక్క స్పష్టమైన మార్గములు కలవు. మొదటిగా, చిరు ప్రాయమునుండి ప్రభువు మీ యొక్క జీవితమునందు చేసిన మేళులను తలంచుకొని ప్రభువును స్తోత్రించుడి. ప్రభువు ముందుగానే మీకు అనుగ్రహించియున్న విజయములను తలంచి, విశ్వాసపు ఒప్పుకోలు చేయుచున్నప్పుడు, మీ యొక్క అంతరంగమునందు ఒక నూతన నమ్మిక వచ్చును. ఇక ఎట్టి సమస్యనైనను సులువుగా జయించవచ్చును అను నమ్మిక ఏర్పడును. ఇన్ని అద్భుతములను చేసినవాడు, ఇక మీదటను అద్భుతములను చేయును అను నమ్మిక ఏర్పడును.
దావీదును ఎదుర్కొని ఒకసారి సింహమును, ఒకసారి ఎలుగుబంటియును వచ్చెను. దైవ బలముతో వాటిని ఎదిరించి చంపివేసెను. ప్రభువు అనుగ్రహించిన పూర్వపు విజయములంనతటిని తలంచినప్పుడు, ఆయన ప్రభువునందు అత్యధికముగా బలపరచబడెను. కావున గోలియాతును జయించుటకు ఆయనకు బహు సులువైన కార్యమాయెను.
ప్రభువు మీయొక్క జీవితమునందు చేసిన అద్భుతములను మాత్రమే తలంచి స్తోత్రించక, బైబులు గ్రంథము అంతటను ఎలాగున పరిశుద్ధుల కొరకు యుద్ధము చేసెను అను సంగతిని గూర్చియు, దేవుని బిడ్డల ఎదుట శత్రువులు ఎలాగు వెన్ను చూపి పారిపోవునట్లు చేసెను అను సంగతిని గూర్చియు, ధ్యానించి స్తోత్రించుడి. దావీదు సెలవిచ్చుచున్నాడు, “నా గుండె నాలో మండుచుండెను; నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను; అప్పుడు నేను ఈ మాట నోరార పలికి విజ్ఞాపన చేసితిని” (కీర్తన. 39:3). “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము; ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” (కీర్తన. 103:2).
కొన్ని సమయములయందు, బలమైన శత్రువులను చూచినట్లయితే, మీయొక్క అంతరంగమునందు కలతయు, భయమును ఏర్పడుచుండును. సమస్యలు లేనటువంటి మనుష్యుడు ఎవరు లేదు. దావీదునకు కలతలును మనస్సునందు వేదనలును వచ్చినప్పుడు, ప్రభువు చేసిన మేళ్లను తలంచుకొనెను. “యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను పర్వతమునుండియు, మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను” (కీర్తన 42:6) అని చెప్పెను.
భక్తుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఇలాగున ఆలోచనను చెప్పెను: “నీవు కన్నులార చూచినవాటిని మరువక యుండునట్లును, అవి నీ జీవితకాల మంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీవు జాగ్రత్తపడుము; నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని (నేర్పి) తెలియజేయుము” (ద్వితి. 4:9).
పస్కాపండుగ మీకు జ్ఞాపకార్థ మైనదగును (నిర్గమ. 12:14). దేవుడు మీకు పంపించి ఇచ్చిన మన్నాను జ్ఞాపకమునందు ఉంచుకొనుడి (నిర్గమ. 16:32). యోర్ధాను ఒడ్డున నిలబెట్టిన పండ్రెండు రాళ్ళను జ్ఞాపకమునందు ఉంచుకొనుడి (యెహోషువ. 4:3). క్రొత్త నిబంధనయందు క్రీస్తు యొక్క శ్రమలను, మరణమును జ్ఞాపకము చేసుకొనునట్లు ప్రభువు మనకు ఆజ్ఞాపించియున్నాడు (లూకా. 22:19; 1. కొరింథీ. 11:26). దేవుని బిడ్డలారా, మీరు అలాగున జ్ఞాపకము చేసుకొనుచున్నప్పుడు, నిశ్చయముగానే ఓటమిని విజయముగా చేసుకొందురు.
నేటి ధ్యానమునకై: 📖”విశ్వాసముద్వారా వారు రాజ్యములను జయించిరి” (హెబ్రీ. 11:33).