No products in the cart.
మార్చి 25 – ప్రేమకు మత్సరము ఉండదు!
“ప్రేమ మత్సరపడదు” (1. కొరింథీ. 13:4).
ప్రేమగల వారి హృదయమునందు మత్సరము నివాసముండదు. ఎందుకంటే, ప్రేమ అన్నిటిని ఓర్చుకొనును. అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును. అటువంటి హృదయమునందు మత్సరమునకు చోటు ఏది? ప్రేమకు మత్సరము లేదు.
ప్రేమకు విరోధమైన మత్సరము ఎముకలకు కుళ్లైయున్నది (సామెతలు. 14:30). లూసిఫర్ యొక్క హృదయమునందే మత్సరము ప్రారంభమైనది. తన్ను తాను దేవునికి సమానముగా హెచ్చించుకొని, దేవునికి తన్ను తాను సమానునిగా చేసుకున్నందున అతడు పరలోకము నుండి క్రిందకు త్రోయబడెను. మత్సరము వలన వచ్చిన తొట్టిల్లు పాటు ఎంతటి భయానకమైన తొట్టిల్లు పాటు అను సంగతిని ఆలోచించి చూడుడి. దేవుని బిడ్డలు ఎన్నడను మత్సరమునకు తావు ఇవ్వకూడదు.
ప్రభువు హేబెలు యొక్క బలిని అంగీకరించినప్పుడు కయీను యొక్క హృదయము సంతోషించలేదు. తన యొక్క సొంత తమ్ముడే కదా, అతడు ప్రభువు చేత ఆశీర్వధింపబడి హెచ్చింపబడవలెను అని తలంచలేదు. అతనికి తమ్ముడు పై మత్సరమే ఏర్పడెను. అట్టి మత్సరము హత్య చేయవలెన్న కసిగా మారెను. తన సొంత సహోదరుడు అని చూడక సహోదనికి విరోధముగా లేచి అతనిని చంపివేసేను (ఆది.కా. 4:3-8) అని బైబిలు గ్రంధమునందు చూచుచున్నాము.
నేడు కూడాను సహోదరుల మధ్యలో మత్సరమును క్రోధముగల కయీను యొక్క ఆత్మ క్రియ చేయుచున్నది. సహోదరుని యొక్క అభివృద్ధిని చూచుచున్నప్పుడు మనము దానిని గూర్చి ప్రభువు సన్నిధిలో స్తోత్రించి ఆనందించువారిగా ఉండవలెను. వారియందు లోపమును చూచునప్పుడు దానిని బహిర్గతము చేసి, వారిని అవమానపరచుటను మాని, ప్రార్థనతో వారిని మన్నించి అట్టి లోపము తొలగించుకొనుటకు వారికి సహాయము చేయవలెను.
చూడుడి; యోసేపు యొక్క సహోదరులు యోసేపు పై మత్సరపడిరి. అట్టి మచ్చరము వలన అతనిని గుంటలో ఎత్తి పడవేసిరి, హత్య చేయుటకును ప్రయత్నించిరి, చివరకు మిధ్యానుల చేతులకు అతనిని అమ్మివేసిరి. చివరకు ఏమైయింది?
ఏ యోసేపు యొక్క సహోదరులు యోసేపుపై మత్సరపడిరో, అట్టి వారే యోసేపునకు నేలమట్టుకు వంగి నమస్కరించునట్లు పరిస్థితిని ప్రభువు తీసుకొని వచ్చెను. అతని యొక్క సహోదరులు నేలమట్టుకు తమ్ము తాము తగ్గించుకొని అతని యొక్క పాదములను నమస్కరించిరి. మీపై మత్సరపడువారు మీ ఎదుట తగ్గించబడుట నిశ్చయము.
దానియేలు పై మచ్చరపడిన బబులోను యొక్క ప్రధానులు దానియేలును గూర్చి రాజు గారి వద్ద డానియలునకు వ్యతిరేకముగా నేరము మోపిరి. చివరకు జరిగింది ఏమిటి? దానియేలును సింహాల గృహలోనుండి పైకి లేవనెత్తిరి. అయితే నేరము మోపిన వారిని సింహాల గృహలో ఎత్తి పడవేసిరి.
ఏ మనుష్యుడైతే తన యొక్క హృదయమునందు దైవిక ప్రేమ చేత నింపబడుటకు సమర్పించుకొనుచున్నాడో, అట్టివాని యొక్క హృదయమునందు మత్సరము సులువుగా చొరబడనే చొరబడదు. కావున దేవుని బిడ్డలారా, కల్వరి ప్రేమ చేత నింపబడుటకు మిమ్ములను సమర్పించుకొనుడి.
నేటి ధ్యానమునకై: “సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి” (1. పేతురు. 2:2,3).
