No products in the cart.
మార్చి 24 – దీర్ఘ శాంతముగలది!
“ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును” (1. కొరింథీ. 13:4)
ప్రేమ యొక్క గుణాతిశయములను వరుసలో పట్టిక వేసి, ప్రేమ యొక్క పదిహేను చక్కటి స్వభావములను అపో. పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. అవి చక్కటి ఒక తోటలోని సువాసన గల పదిహేను పుష్పములుగా సువాసనను పరిమళించుచున్నాయి. ప్రేమయే ఒక మనుష్యునికి మధురమైన స్వభావములను దయచేసి సుగంధముగా సువాసనను వీచునట్లు చేయుచున్నది.
ప్రేమ యొక్క గుణాతిశయములు బహు విస్తారములైయున్నవి. అందులో, ప్రేమ దీర్ఘ కాలము సహించును అనుటయే ప్రధానమైనది. ప్రేమ ఉంటేనే ఎటువంటి హింసనైనను, కీడునైనను, ఓర్పుతో సహించగలము. ప్రేమ ఉన్నప్పుడు ఒక చంప మీద కొట్టిన వారికి మరో చంపను చూపించగలము. ప్రేమ పగను తీర్చుకొనుటకు కోరుకొనదు. అది ఓర్పుతో సహించును. ఓర్పుతో సహించుట అనుట పిరికితనము కాదు. అది ఒక ఉదారత్వమైన దైవీక గుణమునైయున్ననది.
అబ్రహాము లింకనుకు రాజకీయాలలో ఒక గొప్ప శత్రువు ఉండెను. అతని పేరు స్టాంన్స్టన్. పేరుగాంచిన లింకనును, నీచుడైన తెలివి తక్కువ వాడు అని పిలిచి అతడు హేళనము చేసెను. ఆది మనుషజాతి పెద్దకోతి అని చెప్పి గేలీ చేసెను. లింకును గూర్చి చెడుగా ఎంతగానో మాట్లాడెను మరియు వ్రాసేను. అయితే అబ్రహాము లింకెను ఒక్క మాటైనను ఆయనకు విరోధముగా మాట్లాడలేదు.
యుద్ధ కాలము వచ్చెను, అబ్రహము లింకెను తనను ఎదిరించిన స్టాంన్స్టను యుద్ధ మంత్రిగా నియమించి అతనికున్న సామర్థ్యమును మెచ్చుకొని మాట్లాడెను. అట్టి ప్రేమ గల మాటలు స్టాంన్స్టను యొక్క హృదయమును బద్దలు చేసెను. ఆ దినము మొలుకొని దేశము కొరకును, లింకను కొరకును పూర్ణ బలముతో శ్రమించుటకు మొదలు పెట్టెను.
లింకను మృతి పొందినప్పుడు అతడు బహుగా వెక్కివెక్కి ఏడ్చి, ‘జగతుత్పత్తి మొదలుకొని లింకను వంటి ప్రియమైన, ప్రేమగల ఒక ఏలిక చేయువాడు లేనేలేడు’ అని సాక్ష్యమును ఇచ్చెను. అవును, ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును. ప్రేమకు అమితమైన సహింపును ఓర్పును కలదు.
తనను ప్రేమించుచున్న ప్రియుడ్ని వివాహము చేసుకొనుటకు త్యాగముతో ఒక చిన్నది కనిపెట్టుకొని ఉండును. తన భర్త మారుమనస్సు పొంది తనను ప్రేమించాడా అని భార్య ఆశతో కనిపెట్టుకొని యుండును. విదేశాలకు వెళ్లియున్న తండ్రి త్వరలో తిరిగి రాడా అని పిల్లలు ఆశతో ఎదురుచూచుదురు. ప్రేమ దీర్ఘ కాలము సహించును. కావున కాంక్షతోను సహనముతోను కనిపెట్టుకొని యుండునట్లు చేయుచున్నది.
యాకోబు రాహేళుపై అమితమైన ప్రేమను ఉంచుటచేత ఆమె కొరకు త్యాగముతో బానిస వృత్తిని కూడా చేయుటకు సిద్ధముగా ఉండెను. పద్నాలుగు సంవత్సరములు సహనముతో తన మామకు ఊడిగము చేసెను. “భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱెలు కాచెను” (హోషేయా. 12:12) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
ప్రభువు కూడాను మనలను ప్రేమించి, మన మారుమనస్సు కొరకు దీర్ఘ శాంతముతో కనిపెట్టుకొని ఉండెను. మన కొరకు ప్రాణమును పెట్టినవాడు మనపై అక్కర లేనివాడై యుండునా? మన కొరకు రక్తమును చిందించినవాడు మనలను ప్రేమించకుండా ఉండునా? దేవుని బిడ్డలారా, మన ప్రభువు యొక్క సాత్వికతను, ప్రేమను మనము స్వతంత్రించు కొందుమా?
నేటి ధ్యానమునకై: “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతము గలవాడైయున్నాడు” (2. పేతురు. 3:9).
