bo togel situs toto musimtogel toto slot musimtogel musimtogel musimtogel masuk musimtogel login musimtogel toto
Appam, Appam - Telugu

మార్చి 19 – పాపమునకు మరణించుటచేత విజయము!

“ఓ మరణమా!  నీ ముల్లెక్కడ?  ఓ పాతాళమా!  నీ విజయమెక్కడ?  మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.   (1. కోరింథీ. 15:55,57) 

యేసుక్రీస్తు మరణమును, పాతాళమును, సాతానును జయించినవాడై విజయ భేరితో పునరుద్థానుడాయెను. అయన యొక్క బిడ్డలమైయున్న మనము,  అట్టి పునరుద్థానపు విజయమును స్వతంత్రించుకొని, మరణము యొక్క వెన్నెముకను తట్టి,    “ఓ మరణమా! నీ ముల్లెక్కడ?  ఓ పాతాళమా! నీ విజయము ఎక్కడ?  అని  విజయపు హర్షద్వానిని చేయుచున్నాము.

“యేసుక్రీస్తు మరణించెను; సమాధి చేయబడెను; మూడవ దినమునందు సజీవముగా తిరిగి లేచెను” అనుట ఒక వాస్తవ సంఘటన. ఆ సంగతిని ఎవరును దాచుటగాని, మరచుటగాని జరుగదు. అలా ఉన్నప్పుడు దానిని కేవలము చరిత్ర సంభవముగా తలంచకూడదు.

మీరు భయ భక్తితో శిలువ యొద్దకు వచ్చి నిలబడి,    “నా కొరకే నీవు మరణించితివి, సమాధి చేయబడితివి, తిరిగి లేచితివి”   అని చెప్పి ఆయనను అంగీకరించుచున్నప్పుడు మాత్రమే మీకు రక్షణ కలుగును.

మిమ్ములను విజయపు పథమునందు నడిపించుటకు మరొక మెట్టు కలదు.   “క్రీస్తుతో కూడా నేను శిలువయందు కొట్టబడితిని;  క్రీస్తుతో కూడా సమాధి చేయబడితిని;  క్రీస్తు యొక్క పునరుద్థానపు శక్తిచేత విజయవంతమైన జీవితమును జీవించెదను”  అని ఒప్పుకోలు చేసి అట్టి విజయమును స్వతంత్రించుకొనుటయే అట్టి మెట్టైయున్నది.

అపోస్తులుడైన పౌలు మొదటిగా,    “నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను”    (గలతి.2: 20)  అని సమర్పించుకొనెను.  రెండవదిగా,   “క్రీస్తుయేసుని సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసియున్నారు”   (గలతి. 5:24)  అని చెప్పెను.  మూడవదిగా,   “ప్రభువైన యేసుక్రీస్తువలన  లోకము నాకు  సిలువ వేయబడియున్నది. నేనును లోకమునకు  సిలువ వేయబడియున్నాను”    (గలతి 6:14).  ఇదియే విజయము యొక్క రహస్యమైయున్నది.

యేసుక్రీస్తు అమర్త్యతగల దేవుడు.  అట్టి అమర్త్యతయే నిత్యాజీవము.   క్షయమగు శరీరమునుగల మనము దేవునితో ఐక్యత కలిగిన జీవితమును జీవించుటయే నిత్యాజీవము. పాపము వేదనను దయచేయును. నిత్యాజీవమైతే సంతోషమును దయచేయును. నిత్యాజీవము మనలను పాపమును జయించునట్లు చేసి విజయవంతమైన జీవితమును దయచేయును.

“క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు”   (రోమీ. 6:3,4)  అని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది.

దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుద్దానమును విశ్వసించి దాని తర్వాత బాప్తీస్మమును పొందియున్నట్లయితే, ఎల్లప్పుడును దానిని ఒప్పుకోలు చేసి విజయవంతమైన జీవితమును జీవించుడి.

నేటి ధ్యానమునకై: 📖”మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము”    (రోమీ. 6:5).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.