No products in the cart.
మార్చి 16 – ప్రభువు యొక్క శక్తి!
“ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయన కుండెను” (లూకా. 5:17).
తన యొక్క స్వస్థపరచు శక్తి మన మధ్యలో బయలుపరచబడును అని ప్రభువు మనకు వాగ్దానము చేసియున్నాడు. అన్ని రకములైన స్వస్థతలయందు బహు ప్రాముఖ్యమైనది మన యొక్క ప్రాణములో లభించుచున్న స్వస్థతయైయున్నది. మన యొక్క ప్రాణము సౌఖ్యముగా జీవించుచున్నది అంటే మనము అన్నిట సుఖించి జీవించియుందుము.
దావీదు సెలవిచ్చుచున్నాడు: “యెహోవా, నన్ను కరుణింపుము; నీ దృష్టియెదుట నేను నీకు విరోధముగా పాపము చేసియున్నాను; నా ప్రాణమును స్వస్థపరచుము” (కీర్తనలు. 41:4). అవును పాపము నుండి మారుమనస్సు పొందుతున్నప్పుడు, ప్రభువునకును మనకును మధ్యగల సంబంధము నూతన పరచబడుచున్నది. ప్రాణమునందు సంతోషమును దైవీక స్వస్థతయు కలుగుచున్నది.
ప్రభువు కూడాను ప్రేమతో, “వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారి మీద నున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును” (హోషేయా. 14:4). అని చెప్పి నిబంధన చేసెను. మొదటిగా ప్రాణమునందు స్వస్థత అని చూసాము. ఇక్కడ విశ్వాసఘాతకము నుండి స్వస్థత అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. శరీరపు ఇచ్ఛ, నేత్రాశ, జీవపు ఢంభము మొదలగు వాటిలో పడిపోయి, విశ్వాసఘాతకము వైపు పరుగులు తీయుచున్న వారు తన యొద్దకు తిరిగినట్లయితే, వారి విశ్వాస ఘాతుకమును స్వస్థపరచును అని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు.
ఇంకను ఎవరికి ప్రభువు స్వస్థతను ఇచ్చుచున్నాడు? లూకా. 4:18 ను చదివి చూచినట్లయితే, హృదయము నలీగిన వారిని ఆయన స్వస్థపరచుచున్నాడు అని చూచుచున్నాము. బాధలును, దుఃఖములును, పరాజయములును, ద్రోహములును హృదయమును విరచివేయుచున్నది. దానిని విరిగి నలిగిపోవునట్లు చేయుచున్నది. మనము నమ్మినవారు మనలను ఏమార్చుచున్నప్పుడు, మనస్సునందు కృంగిపోవుచున్నాము. అయితే ప్రభువు, మనలను స్వస్థపరచుటకు శక్తి గలవాడు. ఆయన హృదయము నలిగిన వారిని స్వస్థపరచును. చెరలోయున్న వారిని విడిపించి ఆధరణను సమాధానమును అనుగ్రహించును.
ప్రభువు బైబిలు గ్రంధము అంతటను స్వస్థతకును, ఆరోగ్యమునకును అనుగ్రహించియున్న వాగ్దానములను స్వతంత్రించుకొనుడి. స్వస్థత కొరకైన వాగ్దానములు కలదు. బాగుపడుటకు కావలసిన వాగ్దానములు కలదు. ఆరోగ్యమునకు కావలసిన వాగ్దానములు కలదు. ఆయన ప్రాణమునందు స్వస్థతను రప్పించుచున్నాడు. విశ్వాసఘాతకము నుండి స్వస్థతను తీసుకొని వచ్చుచున్నాడు. విరిగిన హృదయములను సరిచేసి బాగు చేయుచున్నాడు. అంత మాత్రమే కాదు, పట్టించుకోని తృణీకరింపబడిన వారి యొక్క జీవితమునందును ఆరోగ్యమును అనుగ్రహించుచున్నాడు. ఆయన ఎంతటి మంచివాడు!
బైబిలు గ్రంథము సెలవిచ్చుచునచనది: “.వారు ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయ బడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు” (యిర్మియా. 30:17). దేవుని బిడ్డలారా, నిన్న, నేడు, నిరంతరము మారని యేసుక్రీస్తు నేడును మీకు విడుదలను దైవీక స్వస్థతను దయచేయును గాక.
నేటి ధ్యానమునకై: “యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను” (మత్తయి. 4:23).