No products in the cart.
మార్చి 14 – లోకమునుండి విజయము!
“లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను అనెను” (యోహాను.16: 33)
మనుష్యునితో పోరాడుచున్న మరొక్క బలమైన శక్తి లోకమును, దాని పాపేఛ్చలైయున్నది. అనేకులు లోకమునకు తగిన వేషమును వేసి, దాని యొక్క క్షణికమైన సుఖాలకు ఈడ్వబడి, అంతమునందు పరాజ్యము పొందినవారై తడబడుచున్నారు. లోకమునకు తగిన వేషము వేయుటయు లోక ప్రకారమైన స్నేహితులతో పాప సంతోషములందు పాలు పొందుటయును ఒక మనుష్యుని నాశనమునకు తిన్నగా నడిపించుచున్నది. “ఈ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” (యాకోబు. 4:4) అని భక్తుడైయున్న యాకోబు హెచ్చరించెను.
యేసుక్రీస్తు యొక్క జీవితము, లోకము చేత మలినపరచబడక పరిశుద్ధమైన జీవితమై ఉండెను. అది సాక్షిగల జీవితముగాను, ఆదర్శవంతమైన ఒక జీవితముగాను ఉండెను. యేసుక్రీస్తు యొక్క లోక జీవితము యొక్క అంతమునందు ఆయనను పరిశోధించి ఆయనయందు లోక సంబంధమైన కార్యములు ఏదైనాను ఉన్నదా అని కనుగొనునట్లు సాతాను వచ్చెను. అయితే యేసు, “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు” అని చెప్పెను.
మీరు లోక జీవితమును ముగించుకొని, నిత్యత్వములోనికి వెళ్ళుటకు ముందుగా నిశ్చయముగానే ఈ లోకాధికారి మిమ్ములను దర్శించును. మీరు విద్యావంతులేగాని, విద్య లేనివారేగాని, ధనికిలేగాని, దరిద్రులేగాని, పురుషుడేగాని, స్త్రీయేగాని, ఎవరైనాగానీ మిమ్ములను దర్శించి, శోధించి, ఎందులో నేరము కనుగొనగలము, ఎలా మునుపటి పాపమును మోపాలని కాచుకొని ఉండును.
కావున, “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు, మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” (రోమీ. 12:2).
కొందరు భక్తిపరులవలె వెలుపట వేషమును వేసుకుని ఉందురు. అయితే, అంతరంగమునందు రహస్య పాపములతో సంబంధము కలిగియుందురు. భక్తి యొక్క వేషమును వేసుకుని ఆయన యొక్క శక్తిని తృనీకిరింతురు. అందుచేతనే దావీదు రాజు, “మనుష్యులు వట్టి వేశము వేసుకున్నవారై తిరుగులాడుదురు” అని అంగలార్చుచున్నాడు (కీర్తన. 39:6). మీరు లోకస్థులవలె వేషమును వేసుకొనక, ప్రభువునకై నూటికి నూరు శాతము పరిశుద్ధముగా జీవించుటకు మిమ్ములను సమర్పించుకొనుడి. అప్పుడు మీరు లోకమును జయించెదరు.
పరిశుద్ధులు, ఇట్టి లోకము గుండా అన్యులుగాను, పరదేశులుగాను దాటి వెళ్ళు పోవుచున్నారు. లోకము వారికి తగినదై ఉండలేదు. వారి యొక్క కన్నులు ఈ లోకమును తదేకముగా చూస్తూ ఉండక, పరలోక రాజ్యమునే తేరి చూచుచున్నది. మూలపితరుడైయున్న అబ్రహామువలె పునాదిగల పట్టణము కొరకు వారు కనిపెట్టుకొని ఉండిరి. దేవుని బిడ్డలారా, “మన పౌరస్థితి పరలోకము నందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము” (ఫిలిప్పీ. 3:20) అను వచనమును జ్ఞాపకమునందు ఉంచుకొనుడి .
నేటి ధ్యానమునకై: 📖”ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే, తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తియైయున్నది” (యాకోబు. 1:27).