No products in the cart.
మార్చి 13 – ఆలస్యముచేయడు!
“ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును” (హెబ్రీయులకు. 10:37).
ఆలస్యము అనునది తట్టుకోలేని ఒక అంశమునైయున్నది. ఉద్యోగము దొరుకుటయందు ఆలస్యము అవ్వుచున్నప్పుడు వాస్తమునకు మనస్సు సోమసిలిపోవుచున్నది. ‘నాకు ఉద్యోగము దొరికినట్లయితే కుటుంబమునకు నేను ఆదరణగా ఉందునే; ఎల్లప్పుడును నిందయును అవమానమును నన్ను చుట్టుముట్టియున్నదే’ అని అనేకులు కలత చెందుచున్నారు.
యుక్త వయస్సు దాటిన పిల్లల యొక్క వివాహము ఆలస్యము అవ్వుటను తలంచి తల్లిదండ్రులు కన్నీరు విడుచుచున్నారు, కలత చెందుచున్నారు. గృహము నిర్మించుకొనుటలో ఆలస్యము. సంతానము కలుగుటలో ఆలస్యము, రావలసిన ధనము వచ్చుటలో ఆలస్యము, ఉద్యోగములలో బదిలీలు దొరుకుట ఆలస్యము అని పలురకాల ఆలస్యములు ఉన్నాయి.
అయితే, నేడు ప్రభువు మనకు వాక్కును ఇచ్చి: ‘నేను ఇకను ఆలస్యము చేయను’ అని చెప్పుచున్నాడు. ప్రభువు ప్రతి దానిని దాని దాని కాలమునందు చక్కగా చేయును. ఎన్నడును ముందుగాను చెయ్యడు ఆలస్యముగాను చేయడు.
కొన్ని ఆలస్యములు మన యొక్క మేలుకొరకే మారుచున్నాయి. ‘దేవుని ప్రేమించువారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి’ అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది కదా? (రోమీ. 8:28). మనము చెయ్య వలసినదంతయు కంగారుపడకూడదు, తొందరపడకూడదు అనుటైయున్నది. ప్రభువు యొక్క ఆలస్యమునందు అనేకులు సొమ్మసిల్లి పోవుచున్నారు. కొందరు సణుగుకొనుచున్నారు. మరి కొందరైతే అడ్డదారులను వెతుకుచున్నారు.
“మోషే కొండ దిగకుండా ఆలస్యముచేయుటను ప్రజలు చూచినప్పుడు” అని, నిర్గమ. 32:1 ‘వ నందు చదువుచున్నాము. ఎంతటి బుద్ధిహీనతగల అంశమును వారు చేయుటకు తెగించిరి! అట్టి ఆలస్యమును తట్టుకొనలేక బంగారపు దూడపిల్లను కలుగజేసుకొని విగ్ర ఆరాధనలోనికి వెళ్ళిపోయిరి. ఇందువలన ఇశ్రాయేలీలలో పలు రకములైన గోరకృత్యములు జరిగెను. పలు వేదనకరమైన సంహారములు కలిగెను.
ఆలస్యము వలన మీ యొక్క ఓర్పు పరీక్షింప బడుచున్నప్పుడు, ఎన్నడను అడ్డదారులను వెదకి ఓటమి పాలు కాకుండుడి. సౌలు కర్ణపిశాచము గెలదానిని శకునముచెప్పు దానిని వెతికినట్లుగా, అనేకులు ఇటువంటి ఆలస్యపు సమయములయందు, మాంత్రికులను, సోదిచెప్పు వారిని వెతుకుచూ వెళ్ళుచున్నారు. ఇట్టివారు పరీక్షకు నిలబడినివారు. అట్టివారు క్రీస్తు తమలో ఉన్నాడు అను సంగతిని ఎరగని వారు అని అపో. పౌలు సూచించుచున్నాడు (2. కొరింథీ. 13:5).
“యెహోవా మీద నీ భారమును మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును; నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” (కీర్తనలు. 55:22) అని కీర్తనకారుడును “ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి” (1. పేతురు. 5:7) అని అపో. పేతురును మనకు ఆలోచనను చెప్పుచున్నారు. దేవుని బిడ్డలారా, కనిపెట్టుకొని ఉండేటువంటి అనుభవములో మీ యొక్క మనస్సును తొందరపడుటకు చోటు ఇవ్వకుడి. “విశ్వసించువాడు కలవరపడడు” (యెషయా. 28:16).
నేటి ధ్యానమునకై: “ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును; సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును” (హబక్కూకు. 2:3).
