No products in the cart.
మార్చి 12 – వర్షమువలె వచ్చును!
“యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి; ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును” (హోషేయా. 6:3).
ప్రభువు మన యొద్దకు వచ్చును, ఎలాగు వచ్చును? చల్లటి వర్షమువలె తాజాతనమును ఇచ్చు కడవరి వర్షమువలె మన యొద్దకు వచ్చును. ఎంతటి చక్కని వాగ్దానము! మనకు ఎంతటి మహిమ కరమైన కాంక్షయైయున్నది!
ఆయన పరలోకమునందు ఉన్నాడు. మనము భూలోకమునందు ఉన్నాము. పరలోకము నుండి దిగి వచ్చుచున్న వర్షమువలె ఆయన భూమికి దిగి వచ్చును. ఆకాశ మహాకాశము నుండి భూమిపై జీవించుచున్న ఆయన యొక్క బిడ్డలమైయున్న మన తట్టునకు దిగివచ్చెను. ఎంతటి సంతోషము!
వర్షము దిగి వచ్చుచున్నప్పుడు ఎండియున్న కోనేరులన్నియును నిండి కాలువలుగా ప్రవహించుటకు ప్రారంభించును. ఆయన సమస్తమును అన్నిటి చేత నింపుచున్నవాడైనందున, ఏరులన్నియును నిండి ఆనకట్టుల ద్వారా నీరు బయలుదేరి వచ్చి దేశమును సశ్యశ్యామలముగా ఉంచును.
ఎక్కడో ఉన్న ఆకాశములో నుండి భూమికి వచ్చి చేర్చున్న వర్షము భూమిలోని మన్నుతో ఏకముగా కలసి నీళ్లుగా ప్రవహించుచున్నది. అలాగుననే పరలోకమునందు జీవించుచున్న యేసు మన కొరకు భూమి మీదకు దిగివచ్చెను. కల్వరి సిలువలో మన కొరకు నలుగగొట్టబడి పిండబడెను. రక్తము నంతటిని చిందించి ఇచ్చెను. ఆయన యొక్క రక్తము అంతయును కల్వరి గుట్టపై కుమ్మరించబడి ఎర్రగా మన కొరకు ప్రవహించుచూనే ఉన్నది. అది మన యొక్క పాపములను, శాపములను, రోగముల నంతటిని తొలగించి మనలను శుద్ధికరించుచున్నది.
వర్షము అనుట కల్వరి రక్తమునుకు మాత్రము గాక, పరిశుద్ధాత్మునికి కూడాను సాదృశ్యమైనది. ఇట్టి చివరి దినములయందు ప్రభువు తన యొక్క ఆత్మను కడవరి వర్షమువలె కుమ్మరించుచూనే ఉన్నాడు. సర్వ శరీరుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను అనుట ప్రభువు యొక్క వాగ్దానము కదా?
సంఘభేదము లేకుండా ప్రభువు తన అభిషేకమును కుమ్మరించుచూనే ఉన్నాడు. ప్రభువు యొక్క రాకడకు ముందుగా ఒక గొప్ప కడవరి వర్షము కుమ్మరించబడి తీరుతుంది. ఎవరెవరు అట్టి వర్షము కొరకు దప్పికతో కనిపెట్టుకొనియున్నారో అట్టి వారిపైన ఆయన తొలకరి కడవరి వర్షమువలె వచ్చును.
ఒక మనుష్యుని యొక్క ఆత్మీయ జీవితమును సమృద్ధిగా ఉంచుట ఏది? విశ్వాసుల యొక్క జీవితమునందు మహిమకరమైన ఫలములను తీసుకొని వచ్చుచున్నది ఏది? అవును, అది పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమే. పరిశుద్ధాత్ముడే లేఖన గ్రంథము యొక్క లోతులను మనకు బోధించి ప్రాణమును సమృద్ధిపరచును.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క అభిషేకము కొరకు దప్పిక గొందుముగాక! వాంఛతో ఆయనను తేరిచూచి, ‘ప్రభువా, నీవు వాగ్దానము చేసినట్లుగా వర్షము వలె మా పైకి రమ్ము. మా యొక్క అంతరంగమునందు గొప్ప ఉజ్జీవమును ఆజ్ఞాపించుము. రమ్ము ప్రభువా’ అని పిలిచెదమా?
నేటి ధ్యానమునకై: “గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను, భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును” (కీర్తనలు. 72:6,7).
