No products in the cart.
మార్చి 12 – తండ్రి వంటి ప్రేమ!”
“తండ్రి పసిపిల్లను మోయునట్లు” (సంఖ్యా. 11:12).
మన ప్రియ ప్రభువు మనకు ఒక ప్రేమ గల చక్కని తండ్రిగా ఉన్నాడు. నిరంతరమును ఆయన మన యొక్క తండ్రిగా ఉండుట చేత ఆయన మన యొక్క నిత్యుడగు తండ్రి అని పిలవబడుచున్నాడు (యెషయా. 9:6).
నిత్యుడగు తండ్రి అంటే అర్థము ఏమిటి? నిన్న నేడు నిరంతరమును తండ్రి అనియే అర్థము. నిత్యా నిత్యముగా ఆయనే మనకు తండ్రిగా ఉండును. ఆయనను మన యొక్క గుండెలలో దైవముగా కలిగియుండుట మనకు ఎంతటి గొప్ప ధన్యత! ఆయన మనలను మోయుచున్న తండ్రి (సంఖ్యా. 11:12).
మొదటిగా, తండ్రి తన పిల్లలను భుజముపై ఎత్తుకొని మోయును. ఆ పిల్లలు తమ రెండు కాళ్ళను తండ్రి యొక్క చాతిపై వేసుకుని ఆయన భుజముపై గంభీరముగా కూర్చుండి తండ్రి తల వెంట్రుకలను దృఢముగా పట్టుకొందురు. తండ్రి వారిని మోసుకొని నడుచును. పిల్లలు ఏనుగు పై ఊరేగింపు వచ్చుచున్నట్లు తండ్రి యొక్క భుజముపై ప్రేమతో ఊరేగుతూ వచ్చెదరు. మన ప్రియ ప్రభువు మనలను నడిపించుకుని తీసుకొని వెళ్లేవాడు కాదు; మోసుకొని వెళ్లేవాడు!
రెండోవదిగా, తండ్రి తన యొక్క పిల్లలకు ఆలోచన చెప్పును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా, మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, మీలో ప్రతివాని యెడల మేము నడుచుకొంటి మని మీకు తెలియును” (1. థెస్స. 2:12). అవును, దేవుడు తన యొక్క సేవకుల ద్వారా మనకు ఆలోచనను ఇచ్చుచున్నాడు. లేఖన వాక్యముల ద్వారా ఆలోచన ఇచ్చుచున్నాడు. మన యొక్క ఔనత్యమే తన యొక్క ఉద్దేశమును కలిగియున్న ఆయన యొక్క ఆలోచనలు అన్నియును మధురమైనవి, అమోఘమైనవి, బహు చక్కనైనవి.
మూడోవది, తండ్రి తన యొక్క బిడ్డలను సరిదిద్దుచున్నాడు. పిల్లల యొక్క హృదయమునందు బుద్ధిహీనత హత్తుకొని ఉండును. దానిని బెత్తముతో సరిదిద్ద వలసినది తండ్రి యొక్క బాధ్యత. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును” (సామెతలు. 3:12).
“మన శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా? వారు కొన్నిదినముల మట్టుకు తమ కిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి; గాని ఈయన మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే శిక్షించుచున్నాడు” (హెబ్రీ. 12:9,10).
నాలుగోవది, తండ్రి తన పిల్లలపై అక్కర గలవాడైయుండును (యోబు. 31:18). లోక ప్రకారమైన తండ్రి తమ పిల్లల యొక్క క్షేమమునకే అత్యధిక అక్కర గలవారిగాను, వారి యొక్క అవసరాలన్నిటిని తీర్చువారిగాను ఉందురు. దేవుని బిడ్డలారా, మనపై వాత్సల్యతగల పరలోకపు తండ్రి అత్యధికముగా మనపై అక్కర గలవాడై ఉన్నాడు. ప్రభువును నిత్యుడగు తండ్రిగా కలిగియుండుట ఎంతటి గొప్ప ధన్యత!
నేటి ధ్యానమునకై: “తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లుగా, యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును” (కీర్తనలు. 103:13).
