No products in the cart.
మార్చి 11 – కోతకాలపు వర్షము!
“సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించి, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రిహించును” (యోవేలు. 2:23).
ఇశ్రాయేలు దేశమునందు రెండు రకములైన రుతుపవనాల వర్షాలు కలదు. ఒక వర్షము తొలకరి వర్షము అని పిలవబడుచున్నది. తరువాతి వర్షము కడవరి వర్షము అని పిలవబడుచున్నది.
సహజముగా, విత్తుచున్న కాలము వచ్చినప్పుడు మొదటి వర్షముగా తొలకరి వర్షము కురియును. రైతులు అందరును నాగటిని తీసుకొని దున్నుటకు ప్రారంభించుదురు. దున్నని భూములను దున్నుదురు. దాని తర్వాత కొన్ని దినములలో వర్షము కోరుచున్నప్పుడు విత్తనమును విత్తుదురు, నారును నాటుదురు. తొలకరిగా కురిసిన వర్షము వలన పైరులు చక్కగా ఎదుగును.
దానిని కొనసాగించి కొన్ని మాసములకు తర్వాత కడవరి వర్షము కురియుటకు ప్రారంభించును. ఆ వర్షము వలన ఎదిగిన పైరులు మంచి ఫలితమును ఇచ్చి కోతకు సిద్ధముగా ఉండును. ఎంతకెంతకు కడవరి వర్షము కురియుచున్నదో అంతకంతకు చక్కగా ముదిరిన మంచి ధాన్యమును నూర్పిడినందు పొందుకొందురు. వారు విత్తిన దానిని ముప్పదంతులుగాను, అరవదంతులుగాను, నూరంతులుగా అమోఘముగా ఫలితమును ఇచ్చును.
అట్టి కడవరి వర్షము లేకున్నట్లయితే ఒడ్డు, గోధుమ, పరిగె వంటి పైరులు అన్నియు పొట్టుతో నిండియుండును. అక్కడ ధాన్యపు గింజలు కనబడకుండును. అత్యధిక శాతమైన పైరులు ఎండిపోవును. ప్రభువు తన యొక్క ప్రజలను ప్రేమించి ఇశ్రాయేలీయులపై క్రమమైన తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆజ్ఞాపించుచూ వచ్చెను.
అదేవిధముగానే సంఘము యొక్క చరిత్రలోను తొలకరి వర్షమును కడవరి వర్షమును కలదు. ఆది అపోస్తులుల యొక్క దినములయందు తొలకరి వర్షము కురిసెను. సంఘములు స్థాపించబడెను, మిషనరీ ప్రయాణములు ప్రారంభమాయెను. గొప్ప ఉజ్జీవము కలిగెను. దాని తరువాత లోకము యొక్క అంతమైయున్న ఇట్టి చివరి దినములయందు కడవరి వర్షము కురుయుటకు ప్రారంభించబడియున్నది. కడవరి వర్షము కురియుచున్నదంటే మనము లోకము యొక్క కోత కాలమునకు సమీపించియున్నాము అనుటయే దాని యొక్క అర్థము.
యేసు చెప్పెను: “కోత విస్తారముగా ఉన్నది, గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపునట్లుగా వేడుకొనుడి. మీరు బయలుదేరి వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱె పిల్లలను పంపునట్టు నేను మిమ్మును పంపుచున్నాను” (లూకా. 10:2,3).
1947 ‘వ సంవత్సరమున స్మిత్ విఖిల్స్సువర్త్ అను భక్తుడు ప్రవచనాత్మకముగా: “దేవుని యొక్క ఒక అల్లాడింపు రాబోవుచున్నది, పరిశుద్ధాత్ముడు బహు బలమైన కడవరి వర్షముతో దేవుని ప్రజలను దర్శించుటకు వచ్చును’ అని ముందుగా ప్రవర్చించెను. ఆయన ప్రకటించిన ప్రవచనము మన యొక్క దినములలో నెరవేర్చబడుచూనే ఉన్నది.
ప్రభువు దేశమంతా గొప్ప నూర్పిడిని ఆజ్ఞాపించుచున్నాడు. అతి గొప్ప కడవరి వర్షము కుమ్మరించబడుచునే ఉన్నది. దేవుని బిడ్డలారా, మనము రాకడ కొరకు సిద్ధపడవలసిన చివరి గడియ యొక్క నిమిషములో నిలబడుచున్నాము.
నేటి ధ్యానమునకై: “పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు; వాటిని విత్తిన శత్రువు అపవాది? కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు. కావున, గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో, ఆలాగే యుగ సమాప్తియందు జరుగును” (మత్తయి. 13:38-40).
