No products in the cart.
మార్చి 07 – రెండు పుష్పములు!
“నేను షారోను పొలములో పూయు రోజా పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు వల్లిపద్మము వంటిదానను” (ప.గీ. 2:1).
ప్రగటివేళ వికసించు పుష్పములు కలవు, రాత్రివేళ వికసించు పుష్పములు కలవు. గట్టునందుగల రోజా పుష్పము పగటి కాలమునందు వికసించుచున్నది. అది పగలంతయు చాలా చక్కగా వికసించి సువాసనను పరిమళించుచున్నది. అదే సమయమునందు, రాత్రి సమయములో వికసించుచున్న వల్లిపద్మము మరియు మళ్లీపుష్పము మొదలగు పుష్పములు రాత్రి సమయములయందును తమ యొక్క మాధృర్యమైన సువాసనను వీచుచున్నాయి. రెండు సమయములయందును ఈ పుష్పములు మనస్సునందు ఆనందింపచేటువంటి సమయముగా మార్చి వేయిస్తున్నాయి.
“పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు” (యోహాను. 9:4) అని చెప్పెను యేసు.
పగలు కాలము అనుట కృప యొక్క కాలము. దేశమునందు సువార్త యొక్క గుమ్మములు తెరవబడియుండు కాలము! అలాగునే ఆయనకు ఇవ్వబడియున్న కృప గల కాలమునందు యేసు గ్రామముల గ్రామముల గుండా, పట్టణాల పట్టణాల గుండా వెళ్లి సువార్తను ప్రకటించెను. మేలు చేయునట్లు సంచరించెను. మనము కూడాను, ఈ లోకము యొక్క పరుగు పంద్యము ముగించుకొనుటకు ముందుగా సమయము అనుకూలించినను అనుకూలించక పోయినను లేఖన వాక్యమును జాగ్రత్తగా ప్రసంగించవలెను కదా? ప్రభువు కొరకు క్రియను చేయవలెను కదా?
రెండు రకాల పుష్పము వలె, పరిచర్యను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఒకటి, బాహ్యముగా చూడదగిన సువార్త పరిచర్య, రెండోవది, ఎవరూ చూడని రీతిలో మరుగైన వల్లిపద్మము వలె ప్రార్థించు పరిచర్య. రహస్యమందు చూచుచున్న తండ్రిని తేరి చూచి హృదయమును చించుకొని పోరాడి గోజాడి విజ్ఞాపన చేయు పరిచర్య.
పగటి కాలమునందు పూయుచున్న పుష్పములన్నిటికిని రారాజు రోజా పుష్పము. రాత్రి కాలమునందు పూయుచున్న పుష్పములన్నిటికిని వల్లిపద్మమే రాణి. పుష్పములను రాత్రిపూట పూయు పుష్పములనియు, పగటిపూట పూయు పుష్పాములనియు రెండుగా విభజించుచున్నట్లు యేసు క్రీస్తు యొక్క శిష్యులను కూడాను అంతరంగీకమైన శిష్యులు, భాహ్య ప్రకారమైన శిష్యులు అని రెండు రకములుగా విభజింపవచ్చును. యేసునకు బాహ్యప్రకారమైన పండ్రెండు శిష్యులు ఉండినప్పటికిని అంతరంగీకమైన శిష్యులు కూడాను ఉండెను. నికొదేమును (యోహాను. 3:9), అరిమతయి ఊరివాడగు యోసేపును (యోహాను. 19:38) అంతరంగీకమైన మరియు రహస్యమైన శిష్యులైయుండిరి.
గొర్రెలను కూడా యేసు రెండుగా విభజించెను. ఒకటి దొడ్డిలో ఉన్నవి, మిగతావి దొడ్డిలోనివి కానివి. “ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును” (యోహాను. 10:16) అని యేసు చెప్పెను.
వ్యక్తిగతముగా ఒక క్రైస్తవుని యొక్క జీవితమునందు కూడాను, బాహ్యప్రకారమైన జీవితమును కలదు. అదే సమయమునందు, మనుష్యులు చూడనటువంటి అంతరంగీక జీవితమును కలదు. తలంపులయందు జీవించు అంతరంగిక రహస్య జీవితమును కలదు. దేవుని బిడ్డలారా, బాహ్యముగా రోజా పుష్పముగా కనబడుచున్న మనము, అంతరంగముగా రహస్య జీవితమునందు కూడాను పరిశుద్ధముగానుండు వల్లిపద్మము పుష్పము వలె కనబడవలెను.
నేటి ధ్యానమునకై: “ఇదిగో,నీవు అంతరంగములో సత్యముండుటకు కోరుచున్నావు; ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు” (కీర్తనలు. 51:6).
