No products in the cart.
మార్చి 04 – ప్రేమచేత విజయము!
“క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరవైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా?” (రోమీ. 8:35)
“ప్రేమ” దేవుని వలన ఇవ్వబడియున్న ఒక బలమైన ఆయుధము. అది ఎంతటి మూర్ఖతగల శత్రువునైనను, లోబడునట్లు చేయును. మీ యొక్క హృదయమునందు దైవిక ప్రేమను తీసుకొని వచ్చినట్లయితే, మీ యొక్క ఓటమిని జయముగా మార్చుటకు అది సహాయపడను. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది, “వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు” (కీర్తన. 84:6).
ఒక కుటుంబమునందు జరిగిన వాస్తవ సంఘటన నా తలంపునకు వచ్చుచున్నది. భర్త సైన్యమునందు ఉద్యోగమును చేయుచున్నందున వివాహమైన తర్వాత మరి కొన్ని దినములలోగా ఉత్తర భారతదేశమునకు వెళ్ళవలసినదైయుండెను. భార్య అత్యధికముగా భర్తను ప్రేమించుచున్నదై ఉండెను. భర్త సంవత్సరమునకు రెండు, లేక మూడు దినములు మాత్రమే, వచ్చి తన భార్యతో కలిసి ఉండుట అలవాటైయుండెను. పదిహేను సంవత్సరముల తరువాత, ఆయన సైన్యము నుండి విరామము పొంది ఇంటికి తిరిగి వచ్చుచున్నప్పుడు, భార్యకు మిగుల సంతోషముగా ఉండెను. మిగుల ప్రేమతో రైలు నిలయమునకు స్వాగతము పలుకుటకు వెళ్ళినప్పుడు, అతడు పూర్తి తాగుబోతుగా మారి ఉండుటను చూచెను.
అతడు ప్రతి దినమును అత్యధికమైన సమయమును మత్తు పానీయ దుకాణముల యందును స్నేహితులయందే గడుపుచుండెను. పేకాటయందు అత్యధిక ప్రియముగలవాడై మారియుండెను. ఏడ్చుటయందైనను, కోపపడుటయందైనను ఎట్టి ప్రయోజనము లేనందున చివరకు ఆమె, తన భర్తను మనసారా ద్వేషించుటకు ప్రారంభించెను. చేదును, క్రోధమును ఆమె మనస్సునందు చోటుచేసుకునెను. కుటుంబ బాధ్యత లేకుండా, ఇలా విచ్చలవిడితనముగా ఉండే భర్తను విడిచి పెట్టి వెళ్లిపోవాలని తీర్మానముతో, దైవజనుని వద్దకు ప్రార్థించుకొనుటకు వెళ్లెను. దైవజనుడు “ఈరోజు సాయంత్రము మీ భర్త తాగి వచ్చినను, చిరునవ్వుతో ఎదురు వెళ్లి, కాఫీను ఇచ్చి పలకరించుడి. మిమ్ములను ప్రేమించుచున్నాను అని చెప్పుడి” అని ఆలోచనను చెప్పెను. ఆమె అలాగునె మిగులు కష్టపడి, చిరునవ్వును తన ముఖముపై తెచ్చుకొని చెప్పిచూచెను. అయితే అతని యందు ఎట్టి మార్పును లేదు. ఒక నెల గడిచి పోయెను.
దైవజనుడు, “ఈ దినము మొదలుకొని ఆయన ఇంటికి వచ్చుచున్నప్పుడు, మిగుల రుచికరమైన వంటను చేసి, ఆయన చెంతన ఉండి వడ్డించుడి” అని ఆలోచనను చెప్పి, ఆయన కూడాను వారి కుటుంబము యొక్క ఐక్యత కొరకు ప్రార్థన చేయునట్లు చెప్పెను. భార్య యొక్క వంతుగా తగ్గింపును, పరామర్శించుటయును, దైవజనుని వంతుగా ప్రార్థనయు, విజ్ఞాపనయును ఆ భర్తను ఒక నూతన మనిషిగా మార్చివేసేను. అతడు రక్షింపబడెను. పరిచర్యను చేయుటకు బయలుదేరెను.
మీరు కూడాను మీయొక్క చేతులయందు, “ప్రేమ” అనేటువంటి యుద్ధోపకరణమును చేతపట్టుకున్నట్లయితే, ఎట్టి శత్రువైనను మీ ఎదుట పరాజయము పొంది తిరుగగొట్టబడును. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది, “మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము” (రోమీ. 8:37). యేసుక్రీస్తు లోకమునకు వచ్చుటకు గల కారణము ఏమిటి? మనుష్యునితో పోరాడుటకు గాని, యుద్ధము చేయుటకు గాని ఆయన రాలేదు. తన యొక్క ప్రేమను చూపించటకే వచ్చెను. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను” (యోహాను. 3:16) అని బైబులు గ్రంథమునందు చదువుచున్నాము. దేవుని బిడ్డలారా, “ప్రేమ” అనేటువంటి ఆయుధమును వాడుకొనుడి. ప్రేమ సమస్తమును తాలును, జయించును.
నేటి ధ్యానమునకై: 📖”కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే” (1. కోరింథీ. 13:13).