No products in the cart.
మార్చి 03 – అత్యధికమైన ప్రేమ!
“దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” (రోమీ. 5:8).
అన్ని ప్రేమలకంటే మిన్నయైన ప్రేమ, ఒక్కడు మరియొకని కొరకు తన యొక్క ప్రాణమును పెట్టుటయే. ప్రేమచేత ధనమును గాని, వస్తువుని గాని, ఆస్తిని గాని ఇచ్చి వేయవచ్చును. అయితే, అమూల్యమైన ప్రాణమును ఒకరు పెట్టుచున్నారంటే అట్టి ప్రేమకు సరి సాటియైన ప్రేమ మరొక్కటి ఉండగలదా?
బైబులు గ్రంథము చెప్పుచున్నది: “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” (యోహాను. 15:13). యేసు క్రీస్తు మన యొక్క యదార్థమైన స్నేహితుడు. ఆయన స్నేహితుని కొరకు మాత్రము గాక, పాపుల కొరకును అయన యొక్క ప్రాణమును పెట్టెను.
ఒక మనుష్యునిపై అతని పాపము యొక్క క్రూరత ఎంత అత్యధికముగా ఉండినను, దానికంటే అత్యధికముగా ప్రభువు యొక్క ప్రేమ అతనిపై ఉన్నది. అయన వలన ప్రేమింపబడలేని క్రూరుడగు పాపి ఒక్కడును లేడు. అందుచేత పాపము విస్తరించు స్థలమునందు ఆయన యొక్క కృపయు విస్తరించుచున్నది.
ఒకసారి మా యొక్క జైలు పరిచర్యయందు, ఒక మూర్ఖుడైన హంతకుడ్ని సంధించవలసిధై వచ్చెను. అతడు తన యొక్క భార్యను అనుమానించి హత్య చేసి జైలుకు వచ్చియుండెను. కల్వరి యొక్క ప్రేమను అతనికి వివరించినప్పుడు అతడు విలపించి ఏడ్చెను. ‘అయ్యో, ఇట్టి ప్రేమను నేను ముందుగా ఎరిగి ఉన్నట్లయితే హంతకుడిగా ఉండియుండే వానిని కానే’ అని బహుగా బాధపడెను. అతని చేతులలో బైబిలు గ్రంధము ఇచ్చినప్పుడు, ఆ తరువాత బైబిలు గ్రంధము అంతటిని చదివి ముగించెను.
అతని యొక్క హృదయమును 51 ‘వ కీర్తన బహులోతుగా అతనిని తాకేను. “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” (కీర్తనలు. 51:17) అని చెప్పి ఏడ్చి ప్రభువు యొక్క ప్రేమ చేత నింపబడెను. చెరసాలలోనే ఒక నీతిమంతునిగాను, పరిశుద్ధునిగాను జీవించెను.
ప్రభువు యొక్క ప్రేమ కఠినమైన హృదయములను విరుచుచున్నది. చట్టాలును, చెరసాల సువ్వలును తీర్చిదిద్దలేని బండ వంటి హృదయములను మైనపు ఒత్తివలె కరుగజేయుచున్నది. పాపమును తొలగించి, పాపిని ప్రేమించి, పరిశుద్ధునిగా మార్చుచున్నది. ఈ లోకములోనికి వచ్చిన ఎట్టి మనుషులనైనను ప్రేమించు నిజమైన ప్రేమ కాదా? ఆయన యొక్క ప్రేమ!
తప్పిపోయిన కుమారుడు ఎంత ఘోరమైన పాపము చేసియున్నప్పటికిని, తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడు తిరిగి వస్తే చాలును అని ఆసక్తితో కనిపెట్టుకొని ఉండెను కదా?
దేవుని బిడ్డలారా, అదేవిధముగా ప్రభువు యొక్క ప్రేమ మారు మనస్సు పొందుచున్న పాపిని ఆసక్తితో ఎదురుచూచు కనిపెట్టుచున్నది. ప్రభువు యొక్క ప్రేమను అత్యధికముగా ధ్యానించుదురుగాక. ఆయన ప్రేమ యొక్క గొప్ప ప్రవాహము చేత నింపబడుదురు గాక. కల్వరి ప్రేమను తలంచి తలంచి ఆయనను కీర్తించుదురుగాక. ఆయనను వాత్సల్యముతో ప్రేమించుదురా?
నేటి ధ్యానమునకై: “మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి, మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసిన ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్” (ప్రకటన. 1:6).
