No products in the cart.
ఫిబ్రవరి 23 – యెహోవా మంచివాడు!
“యెహోవా (ఉత్తముడని) మంచివాడని రుచి చూచి తెలిసికొనుడి” (కీర్తనలు. 34:8).
మన ప్రియ ప్రభువును ప్రేమతో తేరి చూచి: “ప్రభువా, నీవు మంచివాడవు, మంచివాడవు” అని కొంతసేపు మనసారా స్తుతించుడి. మంచివాడు, శక్తిమంతుడు, చాలినవాడు అని పాడి కీర్తించుడి. ఆయన మంచివాడై ఉండుట చేత, కొలత లేని మేలులను మనయందు కురిపించుచున్నాడు.
మంచివాడు అని వట్టి మాటలు మాత్రము చెప్పి మనము నిలిచిపోకూడదు. మన జీవితము యొక్క ప్రతి ఒక్క అనుభవమునందును ఆయన మంచివాడు అనుసంగతిని రుచి చూడవలెను. ఒక సాధారణమైన ఆహారమును మనము రుచి చూచి దానిని సిద్ధపరచిన వారిని మెచ్చుకొనుచున్నాము అంటే ప్రభువు మంచివాడు అను సంగతిని రుచిచూచుట ఎంత అత్యవసర మైనదైయున్నది!
దావీదు యవ్వనస్థుడై ఉండినప్పుడు, ప్రభువు మంచివాడు అను సంగతిని రుచి చూచెను. కాపరియైయున్నప్పుడు ప్రభువు మంచివాడు అను సంగతిని రుచిచూచెను. గోలియాతును హతమార్చినపుడు ఆయన మంచివాడు అను సంగతిని రుచిచూచెను. ప్రభువు తల్లివలె తనను ఆదరించి ఓదార్చునప్పుడెల్లను ప్రభువు మంచివాడు అను సంగితిని రుచి చూచెను. ఆయన రుచి చూచి, మనము కూడాను ప్రభువును రుచి చూడవలెను అనుట కొరకు మనలను ప్రేమతో ఆహ్వానించుచున్నాడు.
మంచివాడు అని చెప్పి ఆయనను రుచిచూచున్నప్పుడు, దానితోపాటు అయిన యొక్క కృపను కూడా రుచిచూచుచున్నాము. “ప్రభువా, నీవు మంచివాడు; కృపాతిశయము గలవాడు” అని కీర్తనలు 86:5 నందు చదువుచున్నాము. బైబులు గ్రంథమునందు మరలా మరలా దేవుడు మంచివాడు అని చెప్ప బడుటతో పాటు ఆయన కృప గలవాడు అని 13 స్థలములయందు జతపరిచి చెప్పబడియున్నది.
లోకమునందు అనేక మనుష్యులను చూచుచున్నాము. మంచివారి వలె నటించుచున్నారు, తేనె వంటి మాటలను మాట్లాడుచున్నారు. అట్టి వారిని మన అంతరంగము ఇట్టే నమ్ముచున్నది. అయితే, ఒక దినమున వారి యొక్క నిజస్వరూపము బయలుపరచబడి చెడు గుణము గల నాగుపాము వలె బుసలు కొడుతూ బయటకు వచ్చుచున్నప్పుడు మనము బెదిరిపోవుచున్నాము.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు; గ్రహించువాడెవడును లేడు; దేవుని వెదకువాడెవడును లేడు; అందరును త్రోవ తప్పి, యేకముగా పనికిమాలినవారైరి; మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు” (రోమీ. 3:11). “దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడే” (లూకా. 18:19).
మీ యొక్క జీవితమునందు పలు సమస్యలు దాడి చేయుచున్నప్పుడు ప్రభువు మంచివాడేనా అను సంగతిని సందేహించునట్లు సాతాను పన్నాగమును పన్నుచున్నాడు. ఉదాహరణకు, ఒక చిత్రకారుడు ఒక ఆమ్మోహమైన చిత్రమును గీయుచున్నప్పుడు ప్రారంభమునందు అదేదో అక్కడ ఇక్కడ కొన్ని గీతాలను గీయుచున్నట్టుగా కనబడును. దానిని చూచుచున్నప్పుడు చిత్రము నిండుగా లేదే అని కూడా అనిపించ వచ్చును.
అయితే కనిపెట్టుకొని యుండి చివరిగా చూచుచున్నప్పుడు అందముగా కనబడని ఆ గీతలు కూడాను అందముగా మారిపోవును. దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క కార్యములను మీరు ఓపికతో గమనించినట్లయితే అంతమునందు సమస్తమును మేలునకు సమకూడి చేసెను అను సంగతిని, ఆయన మంచివాడు అను సంగతిని అర్థము చేసుకొందురు.
నేటి ధ్యానమునకై: “అనగా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికిని, దేవుని ప్రేమించువారికిని, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము” (రోమీ. 8:28).
