No products in the cart.
ఫిబ్రవరి 12 – ఓపికతో పరుగెత్తుడి!
“ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించి యున్నందున, మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కుల బెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” (హెబ్రీ. 12:1).
ఎందుకో కొందరు దిగ్భ్రాంతులై పరుగెత్తెదురు. కొందరు భావోద్వేకులై పరుగెత్తెదురు. కొందరు కుందేలు వలె పరుగెత్తి మార్గమధ్యములోనే నిద్రించుచున్నారు. కొందరు మెరుపువలె పరుగెత్తి చిరునామా లేకుండా మరుగైపోవుచున్నారు.
అపో. పౌలు ఓపికతో పరుగెత్తవలెను అని మనకు ఆలోచనను చెప్పుచున్నాడు. నిదానముగా స్వస్థబుద్ధి గలవారై ఓపికతో పరుగెత్తుడి అని ఆయన చెప్పుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు” (లూకా. 21:19).
ఓపిక అంటే ఏమిటి? ఓపిక అను పదమునకు అనేక అర్థములు కలదు! ఇతరులు కోపమును రేపుచున్నప్పుడు, ఆయాస పరుచుచున్నప్పుడు సాత్వికముతో నడుచుకొనుటయే ఓపిక. శ్రమలును, నిందలును, అవమానములును సంతోషముతో ఎదుర్కొనుటయే ఓపిక. మనకును ఇతలకు గల సంబంధము దెబ్బతినిన్పప్పటికిని ప్రేమతో నడుచుకొనుటయే ఓపిక.
క్రీస్తు యొక్క దైవిక స్వభావములలో ఓపిక కూడాను ఒకటైయున్నది. క్రీస్తు యొక్క జీవితములో నుండి మనము ఓపికను నేర్చుకొనుచున్నాము. శిష్యుల పట్ల అయన ఎంత ఓపికతో ఉండెను! ఆయన యొక్క శిష్యులు ఆయనతో ఉండి కూడాను ఆయనను ఎరుగక ఉండెను, ఆయన ఉపమానముల యొక్క భావమును గ్రహింపకుండాను మంద బుద్ధిగలవారై ఉండు సంగతిని ఆయన ఓపికతో సహించెను.
శిష్యుల యొక్క తలంపులన్నియును లోక ప్రకారముగా ఉండుటను చూచి, యేసు ఓపికతో సహించెను (మార్కు. 9:35-40). శిష్యులు ఆయన యొక్క శ్రమల సమయమునందు పారిపోయినప్పుడు కూడా యేసు ఓపికతో సహించి మరలా వారిని తనతో చేర్చుకొనెను (మత్తయి. 21:15).
అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క ఓపికను శిలువ యొక్క అంచులయందు మనము చూచి నివ్వరపోవుచున్నాము. మత్తయి. 26:59-68, మత్తయి. 27:29-50 మరియు 1. పేతురు. 2:21-25 మొదలగు లేఖన భాగములను మనము చదువుతున్నప్పుడు ఎంతగా శ్రమలను, నిందలను, అవమానములను ప్రభువు ఓపికతో సహించుకొనిన సంగతిని మనము గ్రహించుకొన గలుగుచున్నాము. ఈ రీతిగా ఆయన మనకు మాదిరిని ఉంచి వెళ్ళెను. అని బైబిలు గ్రంథమునందు చూచుచున్నాము.
దేవుని బిడ్డలారా, మన యొక్క ఓపిక మనము దేవుని బిడ్డలము అను సంగతిని లోకమునకు తెలియజేయును (ఎఫేసి. 4:1-3). మన యొక్క ఓపిక అనునది మన యొక్క ప్రేమ గల స్వభావనందును, ప్రేమగల సహవాసము నందును ప్రేమతో సహించుటయందు ఉండును (1. కొరింథీ. 13:4). మన యొక్క ఓపిక మనము ఇతరులను ఉత్సాహ పరచుటయుందును, ప్రోత్సాహ పరచుటయందును వెన్ను తట్టి ముందుకు నడిపించుట యందును ఉండవలెను.
నేటి ధ్యానమునకై: “సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగియుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము, ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా. ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచు కొనుడి” (యాకోబు. 5:7,8).
