No products in the cart.
ఫిబ్రవరి 09 – స్థిరపరచుము!
“నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు. నా దేవా,నేను నీకు మొఱ్ఱపెట్టు కొనియున్నాను, నీవు నాకుత్తరమిచ్చెదవు; నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము” (కీర్తనలు. 17:5,6).
మన యొక్క ఆత్మీయ స్థితియందు మనలను దేవుడు స్థిరపరచుచున్నాడు. దృఢపరుచుచున్నాడు. నీతిమంతులుగా చేయుచున్నాడు అనుట దేవుని సముఖమునకు కొచ్చి మనము కూర్చుండున్నప్పుడు, ప్రార్ధన మనయందు చేయుచున్న గొప్ప ఔన్నత్యమైన అంశమైయున్నది. అంతరంగ పురుషునియందు ఆయన ధైర్యమును, బలమును దయచేయుచున్నాడు. మరియు పరిశుద్ధతలో నుండి అత్యధిక పరిశుద్ధతను పొందుకొనుటకు సహాయము చేయుచున్నాడు.
యేసు క్రీస్తుని పై మనము ఉంచుచున్న విశ్వాసము ద్వారా రక్షణను పొందుకొనుచున్నాము. యేసు యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపములన్నియును కడగబడుచున్నది. అయితే రక్షింపబడిన తరువాత మన యొక్క జీవితమునందు శుధ్దీకరించబడి స్థిరపరచబడవలసినది చాలా చాలా అవస్యము. ఎంతకెంతకు దేవుని సముఖమునందు మనలను మనము తగ్గించుకొని ప్రార్ధించి సమర్పించు కొనుచున్నామో అంతకంతకు మన యొక్క జీవితము స్థిరపరచబడును.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించి, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక” (ప్రకటన. 1:6).
మనము చేయుచున్న చిన్న చిన్న పాపములు వెంటనే సరి చేసుకొనక, నిర్లక్ష్యము చేసినట్లయితే అకస్మాత్తుగా ఒక గొప్ప తొట్టిల్లు పాటు లోనికి అది మనలను పడద్రోసివేయును. మన యొక్క శరీర కార్యమునుండి శుద్దీకరించబడవలసినది అవశ్యము. అనవసరపు మాటల నుండి శుధ్ధీకరించబడవలసినది అవశ్యము. వ్యామోహముతో నిండిన చూపుల నుండి శుద్ధీకరించబడవలసినది అవశ్యము.
అపవిత్రమైన లోకములోనే మనము జీవించుచున్నాము. మనుష్యుల యొక్క ఉద్దేశములు, క్రియలు తలంపులు అవి అన్నియును అపవిత్రముగానే ఉన్నాయి. వీటి మధ్యలో మనము పరిశుద్ధతను కాపాడు కొనవలెను అంటే, ఎంతగా దేవుని సముఖమునందు మనలను మనము తగ్గించుకొని శుద్ధికరించబడుటకు సమర్పించుకొనవలసిన వారమైయున్నాము! ప్రభువునందు ఆనుకుని పరిశుద్ధాత్ముని యొక్క సహాయమును కోరవలసినది మిగుల అవశ్యము.
కావున ప్రార్ధించుడి. మన యొక్క కొరతలను, కొదువులను మనుష్యుల ఎదుట దాచి పెట్టవచ్చును. అయితే ప్రభువు వద్ద ఎట్లు దాచిపెట్టగలము? పరిశుద్ధాత్మునికి తెలియకుండా ఎట్లు కప్పి పెట్టగలము? దావీదు చెప్పుచున్నాడు: “తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము” (కీర్తనలు. 19:12).
దేవుని బిడ్డలారా, శుద్ధీకరించబడి, పుటము వేయబడిన స్వర్ణముగా మీరు ఉండవలెను. జారి జారి పడిపోకుండా, స్థిరముగా ప్రభువును వెంబడించవలెను. మీరు ప్రార్థనా యోధులుగా ఉండినట్లయితే, వ్యక్తిగత ప్రార్థన మిమ్ములను దృఢపరచుట మాత్రము గాక, మిమ్ములను స్థిరపరచును.
నేటి ధ్యానమునకై: “యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు. నీకు అపాయమేమియు రాదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును” (కీర్తనలు. 91:9,10,11).
