No products in the cart.
నవంబర్ 18 – గాయములను మాన్పెదను!
“నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను” (యిర్మీయా. 30:17).
అనేక వ్యాధులు మనస్సునందుగల బాధలువలనను, మానసిక ఒత్తిడివలనను, నిద్రలేమి వలనను వచ్చుచున్నాయి. మిగతావారు తమకు ఏర్పడిన అన్యాయములను క్రూరత్వములను తట్టుకోలేక అంతరంగమునందు గాయపరచబడుచున్న వారికి శరీరము దబ్బతినుచున్నది. వైద్యులు బాహ్యముగా ఎంతగానో వైద్యము చేసినను, అంతరంగ గాయములు మాన్పబడేంతవరకు బాహ్యముందు కనబడుచున్న రుగ్మతములు మానవు. మనస్సునందు ఓదార్పు లేకుండుటయే దీనికి గల కారణము.
ప్రభువు మన యొక్క శరీరమునకు మాత్రము కాదు, మన యొక్క ఆత్మ, ప్రాణమునకు కూడాను ఆరోగ్యమును తీసుకొని వచ్చువాడు. ఆయన మనస్సునందు గల గాయములను మాన్పువాడు.
మదర్ తెరిసా నిర్వహించిన ఆశ్రమము యొక్క మొట్టమొదటి ప్రాముఖ్యమైన ఉద్దేశము మనస్సునకు ఆదరణను తీసుకొచ్చుటయే. యేసుని దైవీక ప్రేమను చూపించగా, చూపించగా ప్రతి ఒక్కరి యొక్క మనస్సునందుగల గాయములు మాన్పబడుచున్నది. గాయములను కలిగించు వారిని క్షమించేటువంటి స్వభావము రూపించబడుచున్నది. ఆ తరువాత యేసును స్వీకరించుచున్నప్పుడు రక్షణ యొక్క సంతోషము చేత వారి యొక్క ఆత్మ, ప్రాణము శరీరము అన్నియును స్వస్థపరచబడుచున్నది.
సేవకులు కూడాను స్వస్థపరచుచున్న పరిచర్యలో నిమగ్నులవ్వుచున్నారు. వైద్యులు కూడాను స్వస్థపరచుచున్న పనిలో నిమగ్నులవ్వుచున్నారు. సేవకులు బైబులు గ్రంథమును చదివి లేఖనానుసారముగా ధైవీక స్వస్థతను తీసుకొని వచ్చుచున్నారు. వైద్యుల అయితే వైద్యశాస్త్రమును చదివి దాని ద్వారా స్వస్థతను తీసుకుని వచ్చుచున్నారు. అయితే, వీటి రెండిటికి గొప్ప వ్యత్యాసము కలదు.
దేవుని యొక్క సేవకులు మొదటిగా ఒక మనుష్యుని యొక్క ప్రాణమునందు శ్రద్ధను చూపుచున్నారు. ప్రాణమునందు దైవీక సంతోషమును, సమాధానమును వచ్చిన తరువాతనే శారీరక స్వస్థతకు ప్రాముఖ్యతను ఇవ్వబడుచున్నది. ఈ సంగతిని గూర్చియే అపో. యోహాను, “ప్రియుడా, నీ (ఆత్మ) ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను” అని నొక్కి వక్కాణించుచు చెప్పుచున్నాడు (3. యోహాను. 1:2). అవును మొట్టమొదటిగా, మీయొక్క ప్రాణము వర్ధిల్లవలెను.
ప్రాణము వర్ధిల్లవలెను అంటే, ప్రాణమునందు గల పాపము తొలగింపబడవలెను. కల్వరి యొక్క రక్తము చేత కడుగబడి శుద్ధీకరింపబడవలెను. కావున దావీదు రాజు కూడాను మొట్టమొదటిగా, ‘ఆయన నీ, దోషములన్నిటిని క్షమించి’ అని చెప్పిన, తరువాతనే ‘నీ సంకటములన్నిటిని కుదిర్చి, నీ ప్రాణమును నాశనము నుండి తప్పించి విమోచించును’ అని చెప్పుచున్నాడు (కీర్తనలు. 103:3,4).
మీ ప్రాణము యొక్క నిజస్థితిని ప్రభువు వద్ద చెప్పుడి. మీ యొక్క అంతరంగ గాయములు మాన్పబడునట్లు గాయపరచుచున్న వారిని మనసారా క్షమించి సమాధానపడుడి. అప్పుడు మీ యొక్క శరీర రోగము తనకు తానుగా స్వస్థత పొందును. మీకు దైవీక ఆరోగ్యము కలుగును.
దేవుని బిడ్డలారా, నేడు ప్రభువు మీకు ఒక వాక్కును ఇచ్చుచున్నాడు: “నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే” (నిగ్గమా. 15:26) అనుటయే అది.
నేటి ధ్యానమునకై: “ఆయనే మన బలహీనతలను వహించుకొని, మన రోగములను భరించెను” (మత్తయి. 8:17).