No products in the cart.
నవంబర్ 15 – ఆ పత్రిక!
“హిజ్కియా దూతలచేతిలో నుండి ఆ (ఉత్తరము) పత్రికను తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచియుంచెను” (యెషయా. 37:14).
పత్రిక అంటేనే ఉత్తరము అని అర్థము. ఒక మనుష్యుకి వ్యక్తిగతముగా ఒక వ్యక్తి వ్యక్తిగతముగా వ్రాయుచున్న దానిని ఉత్తరము అని చెప్పుచున్నాము. అయితే ఒక సంఘమునకు లేక ఒక దేశమునకు బహిర్గతముగా వ్రాయబడినది అయితే దానిని పత్రిక అని పిలచుచున్నాము. పత్రిక అందరికీ తెలియజేయ బడవలసిన ఒక సమాచారము. అయితే ఉత్తరము, వ్యక్తిగతముగా ఒకరి యొద్ద నుండి ఒకరు తెలుసుకొనవలసిన సమాచారమై ఉన్నది.
మన యొక్క జీవితమునందు కొన్ని ఉత్తరములను చదువుచున్నప్పుడు, మనస్సునందు ఆనందమును, ఉత్సాహమును కలుగుచున్నది. అంతరంగమును దృఢపరచుచున్నది. అయితే కొన్ని ఉత్తరములు, దూషించి వ్రాయబడి మనలను భయాందోళనకు గురిచేసి కలతచెందునట్లు చేయుచున్నది. కొన్ని ఉత్తరములు ఎవరు వ్రాశారు అను సంగతి తెలియకుండా వచ్చుచున్న ఆకాశ రామయ్య ఉత్తరములుగా ఉన్నాయి. అత్యధికమైన ఉత్తరములు మన యొక్క జవాబును ఆసక్తితో ఎదురు చూచి వ్రాయబడుచున్నాయి.
నేను ప్రభువు యొక్క సేవకునిగా, మహోన్నతుని యొక్క పరిచర్యను చేయుచున్నందున, సలహాలను అడిగి వచ్చుచున్న ఉత్తరములు అనేకములు కలవు. సాధ్యమైనంత మట్టుకు ప్రార్థించి ప్రభువు యొక్క ఆలోచనలను పుచ్చుకొని జవాబు వ్రాయుట కలదు. అయితే కొన్ని ఉత్తరములు, అబద్ధపు నెరారోపణలును, దూషణలను మోసుకుని వచ్చి మనస్సునందుగల నెమ్మదిని సమాధానమును చెరిపివేయుచున్నాయి.
మీకు కూడాను పలురకాల ఉత్తరములు రావచ్చును. పలు వ్యక్తుల నుండి బెదిరింపులు రావచ్చును. హిజ్కియా తనకు వచ్చిన పత్రికను మందిరములోనికి తీసుకొని వెళ్లి విప్పి పరచి ఉంచి, “యెహోవా, నీచెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, నీకన్నులు తెరచి దృష్టించుము, నీవే దీనికి జవాబును దయచేయవలెను” అని రోధించెను కదా? అలాగునే మీరు కూడాను ప్రభువు యొక్క పాదములయందు మీ యొక్క హృదయమును కుమ్మరించి, సర్వశక్తిమంతునికి తెలియజేయుడి. ప్రభువు యొక్క ఆలయమునకు వెళ్లి బలిపీఠమునందు పడియుండి ప్రభువు ఎదుట పరచి ఉంచి గోజాడుడి.
కొన్ని ఉత్తరములను దయ్యముల యొక్క ఉత్తరములు అని పిలువవచ్చును. రాత్రింపగలు దేవుని ప్రజలను నేరము మోపుచున్న సాతాను పాతాళము నుండి తన యొక్క తలంపులను మనుష్యులకు ఇచ్చి వారి ద్వారా వ్రాయబడునట్లు చేయుచున్న ఉత్తరములు. కొందరు వ్యక్తిగత ఉత్తరములుగా వ్రాయక వార్తపత్రికలయందు శీర్షికలుగా వ్రాసి, ప్రభువు యొక్క బిడ్డలపై లోపములను నేరములను లోకమంతటా చాటించుచున్నారు. ఇందువలన ప్రభువు యొక్క నామము దూషింప బడుచున్నది, దేవుని యొక్క పరిచర్య అడ్డగింప బడుచున్నది.
దేవుని బిడ్డలారా, ఉత్తరమును వ్రాయుచున్నప్పుడు జాగ్రత్తను కలిగియున్నవారై ఉండుడి. మీ యొక్క ఉత్తరములయందును, వ్రాతలయందును కల్వరి ప్రేమ ఉండవలెను. క్రీస్తు యొక్క ప్రేమను వ్రాయుడి, కనికరమును వ్రాయుడి. అది గాయము నొందిన అంతరంగములకు ఆదరణయు, సమాధానమును ఉత్సాహమును తీసుకొని వచ్చును. ప్రభువు యొక్క రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచుచున్న బాధ్యతను ప్రభువు మనవద్ద అప్పగించి ఉన్నాడు కదా?
నేటి ధ్యానమునకై: “మా హృదయముల మీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా?” (2. కోరింథీ. 3:2).