No products in the cart.
నవంబర్ 13 – నోటికి తగిలించి!
“బలిపీఠము మీదనుండి, కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నాయొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి” (యెషయా. 6:6).
ప్రభువు యెషయా యొక్క నోటిని ముట్టెను. అవును, ఆ నోరు ప్రభువునకు కావలసినదైయుండెను! ఆయన గొప్ప ప్రవచనములను ప్రవర్తించుటకును, లేచి ప్రకాశించుటకును, ఆయన యొక్క నోటిని ప్రభువు బలిపీఠము యొక్క నిప్పుతోను, రక్తముతోను ముట్టవలసినది అవశ్యమైయుండెను.
ఆ బలిపీఠము కల్వరి శిలువయే కదా? ఆ అగ్ని అనునది పరిశుద్ధ ఆత్మ యొక్క అగ్ని కదా? దేవుని బిడ్డలారా, మీరు నేడు దేవునికి కావలసినవారుగా ఉన్నారు. ఆయన మిమ్ములను తన రక్తము చేత కడిగి పరిశుద్ధ ఆత్మ యొక్క అగ్నిచేత అభిషేకించుటకు కోరుచున్నాడు.
ప్రభువు యెషయాను మాత్రము కాదు, యిర్మియాను కూడా మొట్టెను. ఆయన వ్రాయుచున్నాడు, “యెహోవా తన చేయి చాపి, నా నోరుముట్టి యీలాగు సెలవిచ్చెను: ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. …. ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. అని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయెను” (యిర్మీయా. 1:9,10).
మీ యొక్క నోటిని ప్రభువు కొరకు ప్రతిష్టించుకొనుడి. వ్యర్ధపు మాటలను రానీయ్యక, ‘ప్రభువా నీ అగ్నిని నా పెదవులను ముట్టవలెను. నేను నీ కొరకు లేచి ప్రకాశించుటకు కోరుచున్నాను’ అని చెప్పవలెను.
బైబిలు గ్రంథమునందు ప్రభువు అనేకమందిని ముట్టినట్లుగా మనము చూచుచున్నాము. యాకోబు యొక్క తొడతుంటి నరమును ఆయన ముట్టెను. తొడ అనుట, మనుష్యుని యొక్క స్వభావమును సూచించుచున్నది. తన బలము చేత మనస్సుకు నచ్చినట్లు తిరుగు మనుష్యుడు ప్రభువు చేత ముట్టబడుచున్నప్పుడు తిన్నని మార్గమునకు తిరుగుచున్నాడు.
పేతురుని చూచి ప్రభువు: “నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు; వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవును” అని చెప్పెను (యోహాను. 21:18). పరిశుద్ధాత్ముడైన దేవుడు మనలను నడుమును కట్టి త్రోవ నడిపించినట్లు నేడు ఆయన మనలను ముట్టునట్లుగా మనము సమర్పించు కొందుమా?
సౌలును పౌలుగా మార్చిన దేవుడు అతని కన్నులను మొట్టవలసినదై ఉండెను. కొన్ని నిమిషాల సమయము అతని కండ్లు కానరానివాడై తడవులాడుచుండెను. ప్రభువు మరల అతని కన్నులను తరిచెను. ఆ! ఆ కన్నులు ప్రవచనములను చూచు కన్నులుగా మారెను. ఆత్మీయ సత్యములను పొదిగించబడిన కన్నులుగా మారెను. క్రీస్తును దర్శించేటువంటి గొప్ప ఔత్యమైన కన్నులుగా ప్రభువు అట్టి కన్నులను హెచ్చించెను.
ఆనాడు ప్రభువు వ్యాధిగ్రస్తులను ముట్టెను. అనేకులు యొక్క మనస్సును ముట్టెను. కుష్ఠ రోగులను అసహ్యించుకొనక ముట్టెను. నాయిను విధవరాళ్ల యొక్క కుమారుణ్ణి ముట్టి సజీవముగా లేపెను. నేడు ప్రభువు మిమ్ములను ముట్టుటకు కోరుచున్నాడు.
దేవుని బిడ్డలారా, క్రీస్తు ముట్టినందున అద్భుతములు చోటుచేసుకొనెను. నేడు ఆయన మిమ్ములను ముట్టుటకు చోటిచ్చెదరా? మిమ్ములను పూర్తిగా రూపాంతరపరచుటకు క్రీస్తు హస్తములోనికి సమర్పించుకుందురా?
నేటి ధ్యానమునకై: “దేవుని హస్తము నన్ను మొత్తియున్నది నామీద జాలిపడుడి, నా స్నేహితులారా నామీద జాలిపడుడి” (యోబు. 19:21)..