No products in the cart.
నవంబర్ 12 – షారోను రోజాపుష్పము!
“నేను షారోను పొలములో పూయు (రోజా) పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మమువంటిదానను” (ప.గీ. 2:1).
మన ప్రియ ప్రభువు షారోనులోని రోజా పుష్పముగాను, లోయలోని వల్లి పద్మముగాను, ఏన్గెదీలోని కర్పూరపు పూగుత్తుగాను ఉన్నాడు. ఆయన అంతటి మధురమైనవాడు. మన యొక్క హృదయమును అంతగా ఆకర్షించినవాడు.
భారతదేశము యొక్క మొదటి ప్రధానమంత్రియైన జవహర్లాల్ నెహ్రూ గారికి రోజా పుష్పము అంటే చాలా చాలా ఇష్టము. ప్రతి రోజును ఉదయమున లేచిన వెంటనే తనకి ఇష్టమైన రోజా పుష్పమును ఒక దానిని తుంచి తన యొక్క కోటునకు గుచ్చి పెట్టుకొనేవారు. షారోను అని చెప్పబడుట ఒక కొండ ప్రాంతమునందు గల మెట్ట ప్రదేశము. మిగుల పచ్చదనముతో కూడిన ప్రదేశము. అందులో పూయుచున్న ఎర్రటి రోజా పుష్పమును అన్ని దిశలయందుగల ప్రజలు చూడవచ్చును. అట్టి రకమైన రోజా పుష్పము చాలా పెద్దది, అందమైనది, సువాసన గలది. అట్టి రకము చాలా ఖరీదైనది కూడాను.
“అతడు అతికాంక్షణీయుడు; ఇతడే నా ప్రియుడు; యెరూషలేము కూమార్తెలారా! ఇతడే నా స్నేహితుడు” (ప.గీ. 5:16). అని మనము ఆయనను పొగడి మాట్లాడునట్లు యేసు తానే ప్రత్యేకమైన వాడు, అమూల్యమైన వాడు. రోజా పుష్పము యొక్క ప్రతి రేకును ప్రత్యేకమైనది. ప్రతి ఒక్క రేకును సువాసన గలది. అదేవిధముగా మన ప్రియ ప్రభువు యొక్క ప్రతి ఒక్క గుణాతిశయమును అంతటి మాధుర్యమైనదిగా ఉంటుంది.
అయినను, షారోను వణములోని మెట్టయందు గల ఎర్రటి రంగు గల పుష్పము యొక్క రేకులు కల్వరి మెట్టపై చిందించబడిన యేసు యొక్క రక్తమునే మనకు జ్ఞాపకము చేయుచున్నది. చరిత్ర యొక్క ఏ భాగమునందును మనము నిలబడి చూచినట్లయితే, యేసు యొక్క ప్రేమయు, త్యాగమును మన యొక్క హృదయమును పొడిచి వేయుచున్నది. నా కొరకు తన రక్తమంతయును చిందించి ఇంతగా నన్ను ప్రేమించాడే, అని కన్నీటితో ఆయనను స్తుతించుటకు పూరికొల్పి లేపుచున్నది.
లోయలోని వల్లి పద్మమును చూడుడి. దాని యొక్క రంగు తెల్లగా ఉండును. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధతను మనకు గ్రహింపజేసి చూపించుచున్నది. ఆయన పరిపూర్ణముగా పరిశుద్ధత గలవాడు.
ఆయన యొక్క ఆత్మ, ప్రాణము, శరీరము అని అన్నియును పరిశుద్ధమైనదియే. ఆయన యొక్క తలంపులు, ఆలోచనలు, క్రియలు అన్నియును పరిశుద్ధమైనది. అట్టి తెల్లటి రంగు గల వల్లి పద్మము మనలను కూడా పరిశుద్ధ జీవితము కొరకు కేక పెట్టి పిలచుచూనే ఉన్నది.
అట్టి వల్లిపద్మమును, రోజా పుష్పమును ఎల్లప్పుడును ముండ్ల మధ్యనే ఉన్నవి. యేసుక్రీస్తు పరిసయ్యులు, సదుకయ్యులు అను ముండ్ల మధ్యనే జీవించెను. ఎటువైపు చూచినా లోపాలు చెప్పేటువంటి గుంపును, నిరారోపణ చేసేటువంటి మనుష్యులే ఉండెను.
నేడు ఒకవేళ మీరు కూడాను ముండ్ల మధ్యనే ఉండవచ్చును. దుష్టులైన మనుష్యుల మధ్యలో, అనవసరముగా బాధను కలిగించేటువంటి జనుల మధ్యలో నిలబడవచ్చును. అప్పుడు సారోను వనములోని రోజా పుష్పమును, ముండ్ల మధ్యలో నిలబడియున్న వల్లిపద్మమును తేరి చూడుడి. వాటి మధ్యలోను ఆ పుష్పములు సువాసనను వెదజల్లు చున్నట్లుగా, దేవుని బిడ్డలారా, మీరు కూడాను క్రీస్తు కొరకు సుగంధ సువాసనను వెదజల్లుదురు.
నేటి ధ్యానమునకై: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి; నేను లోకమును జయించి యున్నాననెను” (యోహాను. 16:33).