No products in the cart.
నవంబర్ 11 – దెబోరాయొక్క కీర్తన!
“ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి” (న్యాయా. 5:1).
దెబోరా పాడిన కీర్తన బైబిలు గ్రంథమునందు చోటుచేసుకునియున్నది. ఆ కీర్తనను న్యాయాధిపతుల గ్రంథము యొక్క 5 ‘వ అధ్యాయమునందు చూడవచ్చును. దేబోరా అను మాటకు తేనేటీగ అనుట అర్థము.
ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నవారిలో నాల్గవ న్యాయాధిపతి ఈమె. ఈమె ఒక ప్రవక్త్రిని (న్యాయా. 4:4). ఈమెకు కలిగియున్న జ్ఞాన విశిష్టత నిమిత్తము ఇశ్రాయేలీయులకు తల్లి అను పేరును పొందెను.
దెబోరా యొక్క దినములయందు కనాను రాజైన యాబీను, ఇశ్రాయేలీయులను బహు కఠినముగా బాధపెట్టెను. జనులు తమకంటూ ఒక విడుదల లేదా అని తప్పించి విలపించిరి. అప్పుడు దెబోరా యొక్క ఆత్మను ప్రభువు ప్రేరేపించినందున ఆమె దేవుని ప్రజల కొరకు యుద్ధము చేయుటకు బయలుదేరెను.
ఆమెయు బారాకు అను వీరుడును కలసి కనాను రాజునకు విరోధముగా యుద్ధము చేసిరి. ప్రభువు వారికి గొప్ప విజయమును అనుగ్రహించెను. శత్రువుల యొక్క సేనాధిపతియైన సీసెరా చంపబడెను. జయమును పొందిన దెబోరా, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ప్రభువును స్తుతించి, మహిమపరచి, కీర్తనను పాడి స్తుతించెను.
మీకు జయమును అనుగ్రహించుచున్న దేవుని ఎల్లపాడును స్తుతించి పాడుడి. ఆయనే మీ ఓటమిని విజయముగా మార్చుచున్నవాడు. సముద్రమును గాలిని నిమ్మలపరచినవాడు. పోరాటములను నిమ్మలింప చేయువాడు. మీ యొక్క స్తుతి శబ్దమును విని శత్రువులు జంకుదురు. మీ యొక్క స్తుతి శబ్దము చేత దేవుని ప్రసన్నత మిమ్ములను ఆవరించును.
“మేలుకొనుము, మేలుకొనుము దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము బారాకూ, కీర్తన పాడుము, అబీనోయము కుమారుడా, లెమ్ము నిన్ను చెరపట్టిన వారిని చెరపట్టుము” అని కీర్తన పాడిరి (న్యాయా. 5:12).
మనము ఉదయకాలమున మేల్కొని ప్రభువును పాడి కీర్తన చేయుట మనకు ఆశీర్వాదకరముగా ఉండును. ప్రభువు మన సమీపమున నిలబడి, ‘మేల్కొనుము, మేల్కొనుము దెబోరా కీర్తన పాడుము, బారాకు లెమ్ము; ప్రభువును స్తుతించి పాడుము’ అని చెప్పుచున్నాడు. మనము ప్రభువును ఆరాధించి స్తుతించుచున్నప్పుడు, ఆ దినము అంతయును ప్రభువు యొక్క మధురమైన ప్రసన్నత మనలను బహు చక్కగా ఆవరించును.
ప్రభువును స్తుతించి పాడుటకు వేవేల కొలది కారణములు కలదు. ఆయన మనలను సృష్టించెను, లోకము అను పాపపు బురదలో నుండి కాపాడెను. అభిషేకమును అనుగ్రహించెను. నిత్యా జీవమును అనుగ్రహించెను. దైవీక సంతోషమును, సమాధానమును దయచేసెను మన కొరకు వాదించెను, యుద్ధము చేసెను.
లోక ప్రకారమైన యుద్ధమునందు జెయించినందున దెబోరా అంతగా కీర్తన పాడి స్తుతించుచున్నది అని తలంచుచున్నప్పుడు, సాతాను యొక్క వసములో నుండి మనలను విమోచించి, నిత్యానందమును దయచేసిన ప్రభువును మనము స్తుతించక ఉండగలమా? దేవుని బిడ్డలారా, ప్రభువును పూర్ణ హృదయముతో పాడి స్తుతించుడి.
నేటి ధ్యానమునకై: “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు” (ప్రకటన. 4:11)