bandar togel situs toto togel bo togel situs toto musimtogel toto slot
Appam, Appam - Telugu

నవంబర్ 11 – తేలిన ఫలితము

“ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి” (ప్రసంగి. 12:13).

సొలోమోను జ్ఞాని వలె జ్ఞానవంతుడు ఎవరును లేకుండెను. నాకు జ్ఞానము కావలెను ప్రభువా అని తన్ను తాను తగ్గించుకుని ప్రభువు వద్ద అడిగినప్పుడు, ప్రభువు సలోమోనునకు శ్రేష్టమైన జ్ఞానమును దయచేసెను (యాకోబు. 1:5). నేడు ప్రభువు మనకు జ్ఞానమును దయచేయుచున్నాడు.

సామెతలు, పరమగీతము, ప్రసంగి మొదలగు గ్రంథములను వ్రాసిన సొలోమోను జ్ఞాని, లోకమునందుగల సమస్త వివేకమును, ఆత్మీయ అంశములన్నిటిని పరిశీలించి పరిశోధించి చూచిన తరువాత, చివరిగా అన్నిటియందు తేలిన ఫలితార్థమును విందుముగాక అని చెప్పుచున్నాడు. అది ఏమిటి? మనలోని ప్రతి ఒక్కరు దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టలను అనుసరించి నడచుచుండవలెను అనుటయే.

భయము అనుటను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఒకటి మనుష్యునికి భయపడు భయము. తరువాతది, ప్రభువునకు భయపడు భయము. మనుష్యునికి భయపడు భయము ఉరిని తీసుకొని వచ్చును (సామెతలు. 29:25). కొంతమంది మరణమునకు భయపడుదురు. కొంతమంది బంధువులకు భయపడుదురు. కొంతమంది దెయ్యములకు భయపడుదురు. ఇట్టి భయములన్నియును ఒక మనిషిని బానిసగా చేసి అంతమునందు అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందునట్లు చేయును (ప్రకటన. 21:8).

అయితే ప్రభువునకు భయపడుచున్న భయము మనలను పాపమునుండి కాపాడి పరిశుద్ధతలో నిలబెట్టుచున్నది. చెడుతనము నసహ్యించుకొనుటయే ప్రభువునకు భయపడుచున్న భయము అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది కదా? (సామెతలు. 8:23). యోసేపు పాపము నుండి తప్పించుకొని పారిపోవుటకు గల రహస్యము ఏమిటి? దేవునికి భయపడుచున్న భయమే కదా? (ఆది.కా. 39:9). నన్ను చూచుచున్న దేవుడు ఒక్కడు కలడు. ఆయన నాపై ప్రేమా అసల్యతను గలవాడు. నన్ను దీనస్థితియందు జ్ఞాపకము చేసుకున్నవాడు ఆయనను దుఃఖపరిచి నేను పాపమును చేయనే చేయను అనుట యోసేపు యొక్క తీర్మానమైయుండెను.

యోసేపు దేవునికి భయపడినందున అతనికి లభించిన ఆశీర్వాదము ఏమిటి? ఐగుప్తునందు ఆయన బహుగా హెచ్చింపబడి గొప్ప ఔన్నత్యము చేయబడెను. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము” (సామెతలు. 10:27). ప్రభువునకు భయపడుచున్న ఒక మనుష్యుడు, హృదయమునందు దృఢత్వముగలవాడై ఉండును. సింహమువలె ధైర్యవంతుడైయుండును. అతడు అల్పమైన లోక మనుష్యులను చూచి భయపడుతూ ఉండడు.

దానియేలును చూడుడి ఆయన దేవునికి భయపడుచున్నవాడై ఉండెను. అయితే ఆయనపై నేరము కనుగొనవలెనని బహుమంది ప్రధానులు ప్రయత్నించుచూనే ఉండిరి. ప్రార్థించకూడదు అను శాసనమును జారీ చేసిరి. అయితే దానియేలు, రాజు యొక్క శాసనమును చూచి భయపడలేదు. సింహపు గుహను చూచి కలత చెందలేదు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యమును పుట్టించును; అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణ పాశములలో నుండి విడిపించును” (సామెతలు. 14:26,27). దేవుని బిడ్డలారా, ప్రభువునకు భయపడుచున్నవాడే నిరంతరమును నిలిచియుండును.

నేటి ధ్యానమునకై: “పాపాత్ములు నూరు మారులు దుష్కార్యమును చేసి దీర్ఘాయుష్మంతులైనను? దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు ఎరిగియున్నాను” (ప్రసంగి. 8:12).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.