bandar togel situs toto togel bo togel situs toto musimtogel toto slot
Appam, Appam - Bengali

నవంబర్ 08 – పగలును రాత్రియు

“యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును” (కీర్తనలు. 121:5).

ఎంతటి దిట్టమైన, స్థిరమైన, దృఢమైన వాగ్దానమును ప్రభువు మనకు ఇచ్చుచున్నాడు! రాత్రియైనను, పగలుయైనను, మధ్యాహ్నముయైనను, మధ్యరాత్రియైనను, ఎట్టి సమయమైనను మనలను కాపాడుటకు మన ప్రభువు మిగుల శ్రద్ధ గలవాడైయున్నాడు.

ఇశ్రాయేలు ప్రజలను ప్రభువు ఐగుప్తునుండి విడిపించి తీసుకొని వచ్చినప్పుడు, వారు అతిపెద్ద అరణ్యమును దాటవలసినదై ఉండెను. వృక్షము, చెట్టు, తీగలు లేని అట్టి ఎడారియందు తట్టుకోలేని వేడిమి ఉండి ఉండవచ్చును. చిన్న బిడ్డలకును, బాలురకును అట్టి ఎండ యొక్క వేడిమిని తట్టుకోలేక అవస్థపడి ఉండవచ్చును.

కావున వారికి నీడగా ఉండునట్లు ప్రభువు పగటివేలయందు మేఘస్తంభములను ఆజ్ఞాపించెను. ఆ మేఘములు తమపై సూర్యుని ఉష్ణోగ్రతను నిలిపి, చల్లపరచి క్రిందకు నీడను దయచేసెను. ఇశ్రాయేలు ప్రజలకు అది ఎంతటి సంతోషకరముగా ఉండి ఉండవచ్చును. చల్లని పరిస్థితియందు ఉత్సాహముగాను, సంతోషముగాను నడిచి ఉందురు.

మా యొక్క తండ్రిగారు, “నేను విజయవాడ అను ప్రాంతమునందు కూటములను నడిపించినప్పుడు, అక్కడ ఉన్న వేడిమిని తట్టుకోలేక విలవిల్లాడిపోయాను. అక్కడ ఉన్న ఎండలు ఘోరముగా ఉండెను. అగ్ని నక్షత్రము యొక్క కాలము అది. గుడిసెఇండ్లకు కూడాను అకస్మాత్తుగా ఉన్నపణముగా మంటలు అంటుకొనును. నేను అక్కడ కన్వెన్షన్ కూటములు జరిపించిన దినములు అన్నియును పగలంతయు నీళ్లను ఒంటిపై పోసుకుంటూ, ఎప్పుడు సాయంత్రము వచ్చును అని కనిపెట్టుకొని ఉందును” అని ఒకసారి ఆయన చెప్పగా వినియున్నాను.

ఇశ్రాయేలు ప్రజలను పగటివేల కాపాడుటకు మేఘస్తంభమును, రాత్రివేళ కాపాడుటకు అగ్నిస్తంభమును ప్రభువు ఆజ్ఞాపించెను. పగటివేల మాత్రము కాదు, ప్రభువు యొక్క కాపుదల రాత్రివేళ కూడాను మనకు నిశ్చయముగా కలదు.

అరణ్యమునందు ఇశ్రాయేలు ప్రజలు నివాసము ఉన్నప్పుడు, రాత్రి సమయములయందు అక్కడ తాపకరమైన సర్పములు వారిని కరిచేటువంటి అవకాశములు ఉండెను. తేళ్లు కాటు వేసేటువంటి హేతువుగల పరిస్థితి ఉండెను. అట్టి ఎడారిలో క్రూరమైన తోడేళ్లు సంచరించుచుండవచ్చును.

అయితే అగ్నిస్తంభములు ఇశ్రాయేలీయులకు కాపుదలగా వచ్చినప్పుడు, మొట్టమొదటిగా అది వెలుగును ఇచ్చెను, రెండవదిగా విషపు పురుగులను తరిమి వేసెను, మూడవదిగా, శీతలమును తీసివేసి వెచ్చదనమును కలిగించెను.

రాత్రివేళ ప్రకాశించు చంద్రకాంతికి అనారోగ్యమును, వ్యాధియును కలుగజేయవచ్చును. తరచుగా ఒక మనుష్యుడు వెన్నెలకాంతిలో పండుకున్నట్లయితే వాతము కలిగేటువంటి అవకాశము ఉన్నది. కొందరికి కాలు చేతులు పడిపోవచ్చును. నరాల బలహీనతయు కలుగవచ్చును.

ఎవరెవరైతే ప్రభువును ఆశ్రయముగా కలిగియున్నారో, అట్టివారికి ఎట్టి హానియు కలుగుటలేదు. దేవుని బిడ్డలారా, ప్రభువు మిమ్ములను కాపాడువాడు.

నేటి ధ్యానమునకై: “రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు” (కీర్తనలు. 91:5,6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.