No products in the cart.
నవంబర్ 06 – నమ్మిక వ్యర్ధముకాదు!
“మా పితరులు నీయందు నమ్మికయుంచిరి; వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి; నీయందు నమ్మికయుంచి సిగ్గుపడక పోయిరి” (కీర్తనలు. 22:4,5).
రాజైన దావీదు మూలపితరుల యొక్క జీవితమునంతటిని ధ్యానించి చూచెను. వారు ప్రభువుపై ఉంచిన నమ్మికయందు ఏ ఒక్కటియు వ్యర్ధము కాలేదు. నమ్మికయుంచిన వారిని విడిపించెను! అవును, మన ప్రియ ప్రభువు పైన మనము ఉంచుచున్న నమ్మిక ఎన్నడును వ్యర్ధము కాదు.
భక్తుడైన యోబు, ప్రభువుపై నమ్మికను ఉంచెను. ఎంతటి దృఢమైన నమ్మిక అది! ప్రభువు నన్ను చంపివేసినను సరే, నేను ఆయన మీదనే నమ్మిక ఉంచుచున్నాను అని చెప్పెను యోబు (యోబు.13:15).
శరీరము వ్యాధి బారిన పడినను, భార్య దూషించినప్పుడును, స్నేహితులు పరిహాసము చేసినప్పుడును యోబు యొక్క నమ్మిక అయితే, ప్రభువు మీదనే దృఢముగా ఉండెను. ప్రభువును నమ్మిన వారు వర్ధిల్లదురు అని లేఖన వాక్యము చొప్పున యోబు యొక్క తర్వాతి కాలము సమృద్ధిగా ఉండెను.
అబ్రహాము యొక్క నమ్మిక వ్యర్థమైపోయెనా? లేదు. తనకు ఆశీర్వాదకరమైన ఒక సంతతి వచ్చును అని అబ్రహాము ఇరవైఐదు సంవత్సరములుగా కొనసాగించి నమ్మితో కనిపెట్టుకొని యుండెను. ఆయన యొక్క శరీరము మృత తుల్యమైన స్థితికి వచ్చినప్పటికిని అతని యొక్క నమ్మిక క్షీణించి పోలేదు.
ఆయన యొక్క భార్యకు రుతుక్రమము నిలిచిపోయినప్పటికీని ప్రకృతి విధి చొప్పున వారికి పిల్లలు పుట్టుటకు ఎట్టి అనుకూలత లేకపోయినప్పటికీని అబ్రహము అయితే ప్రభువు మీదనే నమ్మికను ఉంచెను.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దేవుని మహిమపరచి, విశ్వాసము వలన బలమునొందెను” (రోమీ. 4:20,21). ఆయన యొక్క విశ్వాసము వ్యర్థము కాలేదు. నవ్వు అను అర్థమునిచ్చు ఇస్సాకును కనెను. ఇస్సాకు ద్వారానే ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము ఉద్భవించెను గదా?
యోసేపు యొక్క జీవితమును చదివి చూడుడి. యోసేపునకు ఒక నమ్మిక ఉండెను. ప్రభువు ఒక దినమున ఇశ్రాయేలు జనులను ఐగుప్తులో నుండి కణానులోనికి తీసుకుని వెళ్ళును అనుచున్న నమ్మిక అది. అట్టి నమ్మిక తోనే తన ఎముకలను కనాను లోనికి తీసుకొని వెళ్ళమని కోరుకొనెను. (ఆది.కా. 50:24,25).
అట్టి నమ్మిక వ్యర్థముకాలేదు. సుమారు నాలుగు వందల ముఫ్ఫై సంవత్సరములు తరువాత యోసేపు యొక్క ఎముకలను తీసుకొని నలభై సంవత్సరములు మోసుకుని కణానులోనికి తీసుకుని వెళ్లి అక్కడ సమాధి చేసిరి. యోసేపు యొక్క నమ్మిక వ్యర్థము కాలేదు.
అగ్నిగుండమునకు ఎదురుగా నిలబడినప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నగోల యొక్క నమ్మిక వ్యర్థమై పోయెనా? లేదు. ప్రభువు తట్టు తేరిచూచి మరలా మరలా మొలపెట్టిన పుట్టు గ్రుడ్డివాడైన బర్తిమయి యొక్క నమ్మిక వ్యర్థమైపోయెనా? లేదు. ప్రభువు చూపును దయచేసెను కదా? దేవుని బిడ్డలారా, మీ యొక్క నమ్మిక వ్యర్థము కాదు!
నేటి ధ్యానమునకై: “యెహోవాయందు నేను నమ్మిక యుంచియున్నాను, కావున నేను కదల్చబడను” (కీర్తనలు. 26:1).