Appam, Appam - Telugu

నవంబర్ 04 – యూఫ్రటీసు నది!

“నాలుగవ నది పేరు యూఫ్రటీసు”   (ఆది. 2:14

ఏదేను నందుండిన నాలుగు నదులు నేడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆను  వివరమును, అవి ఏఏ పేర్లతో ఉన్నాయి అను వివరమును తెలియజేయబడలేదు. అయితే బైబిలు గ్రంథమునందు మిగుల అత్యధిక స్థలములయందు చెప్పబడుచు, నేడును ఉనికిలో ఉన్న నది యూఫ్రటీసు నదియైయున్నది

ప్రభువు అబ్రహామునకు స్వాస్థ్యముగా ఒక దేశమును వాగ్దానము చేసినప్పుడు, యూఫ్రటీసు నదిని స్వాస్థ్యపు భూమి యొక్క ఒక సరిహద్దుగా సూచించెను. పూర్వపు దినము నందు ప్రభువు అబ్రహాముతో ఒడంబడికను చేసి, ఐగుప్తునందుగల నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఉన్న ఈ దేశమును ఇచ్చియున్నానని చెప్పెను (ఆది. 15:18). అబ్రహామునకు వాగ్దానము చేయబడినది, కృపను బట్టి మనకును స్వాస్థ్యము కదా?

“యూఫ్రటీసు” అను మాటకు “ఫలమును ఇచ్చుట” అనుటయే అర్థమైయున్నది.  పరిశుద్ధాత్మయైయున్న నది మీలో ప్రవహించు చున్నప్పుడు, అట్టి పరిశుద్ధాత్ముని ద్వారా మీ లోనికి ఆత్మ యొక్క వరములును వచ్చుచున్నది. ఫలమునిచ్చు జీవితమును వచ్చుచున్నది. ఆత్మీయ వరములు గూర్చి ప్రసంగించు అనేకులు, ఫలించేటువంటి జీవితమును గూర్చి మాట్లాడుటలేదు.

ప్రభువు ఒక మనిష్యుని వద్ద వరములను కాంక్షించుటకంటేను, ఫలములను అత్యధికముగా కాంక్షించుచున్నాడు. ఆయన ఫలములను వెతుక్కుంటూ మన యొద్దకు వచ్చుచున్నాడు అని బైబిలు గ్రంథమునందు పలు స్థలములలో చదువుచున్నాము.  పాలమును ఇవ్వని చెట్టును నరికి అగ్నిలో వేయబడును.  అందుచేత మారు మనస్సుకు తగిన ఫలములను ఫలింపవలెనని (మత్తయి.3:7) నందును, (లూకా.3:8) నందును చదువుచున్నాము.  రక్షణ యొక్క నీటి ఊటలు మీలో ఊరుచ్చున్నప్పుడు నిశ్చియముగానే మీరు ప్రభువునకై ఫలమును ఫలించెదరు.

తర్వాతదిగా ప్రభువు మీ వద్ద మంచి ఫలమును ఎదురుచూచున్నాడు. చేదైయిన ఫలమును మీరు ఇచ్చుచున్నప్పుడు ఆయన  యొక్క హృదయము వేదన పడుచున్నది.  మంచి ఫలమును ఫలించుచున్నప్పుడు, మరి ఎక్కువ ఫలమును ఇచ్చునట్లు ప్రభువు శుద్దీకరించును (యోహాను.15: 2). మంచి చెట్టు మంచి ఫలములను ఇచ్చును. చెడ్డదైన చెట్టు దాని ఫలములవలన తెలియజేయబడును (మత్తయి.12: 33). ప్రభువు నందున్న మీరు మంచి ఫలములను ఫలించువారై ఉండుట మిగుల అవశ్యమై ఉన్నది!

మూడోవదిగా, ఏదో ఒకటి లేక రెండు ఫలములను ఫలించి మీరు ఆగిపోకూడదు. ఫలమును ఇవ్వని అంజూరపు చెట్టును ఆయన శపించెను కదా? అదే సమయమునందు మీరు ఫలమును ఫలించుచున్నప్పుడు అత్యధికమైన ఫలములను ఫలించినట్లు మిమ్ములను ఉత్సాహపరచుచున్నాడు. మీరు ఎంతకెంతకు యేసుక్రీస్తునందు నిలచియుందురో అంతకంతకు బహుగా ఫలములను ఫలించెదరు. యేసు సెలవిచ్చెను,   “ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో, వాడు బహుగా ఫలించును”   (యోహాను.15: 5).

మీరు ప్రభువునకు ఇవ్వవలసిన ఇంకా అనేక ఫలములు కలవు. అది నీతిఫలము (ఫిలిప్పీ.1:10). జిహ్వాఫలమునైయున్న స్తోత్రబలి (హెబ్రీ.13:15). మరియు ఆత్మఫలము (గలతీ.5:22). దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మయైయున్న నది మీలో ప్రవహించినట్లయితే మీరు నిశ్చయముగానే ఫలమును ఫలించువారై ఉండెదరు.

 నేటి ధ్యానమునకై: “అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును”   (కీర్తన. 1:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.