No products in the cart.
నవంబర్ 03 – పరిశోధించు తలంపు!
“దేవా, నన్ను పరిశోధించి, నా హృదయమును తెలుసుకొనుము; నన్ను పరీక్షించి నా ఆలోచనలను(తలంపులను) తెలుసుకొనుము” (కీర్తనలు. 139:23)
“నన్ను నేను పరిశోధించు కొనినప్పుడు. ప్రభువా, నీవే నన్ను పరిశోధించి చూడుము, నా యొక్క దృష్టియందు నా యొక్క పొరపాట్లు నాకు తెలియక ఉండవచ్చును. అయితే నీ యొక్క దృష్టియందు అవి మరుగైనది కాదే. నీవు చూచుచున్నట్లుగా నేనును చూచునట్లు నన్ను నాకు చూపించుము” అని దావీదు ప్రార్థించుటను ఈ లేఖన భాగమునందు మనము చూచుచున్నాము.
హృదయమును, మనిష్యుని యొక్క తలంపులను పరిశోధించి గ్రహించినట్లయితేనే వేదనను కలిగించు మార్గములను తొలగించగలము. ఈ దినమునందు ఇట్టి వాటిని గూర్చిన కొన్ని తలంపులను గూర్చి మనము ధ్యానించెదము!
- దుర్మార్గపు తలంపు:- “నా హృదయములో నేను (పాపమును) దుర్మార్గపు తలంపును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును” (కీర్తనలు. 66:18). దుర్మార్గపు తలంపు అనుట, క్రమమునకు మించినది, పద్ధతికి అతీతమైనదైయున్నది. ఇది దేవునికి ప్రీతికరమైనది కాదు. “అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండి” అని యేసు చెప్పుటను గమనించుడి (మత్తయి. 7:23). దుర్మార్గపు తలంపులను మీ వద్ద నుండి తొలగించవలెను.
- శరీరానుసారమైన తలంపు:- “శరీరానుసారులు శరీరవిషయముల మీద (మనస్సు) తలంపునుంతురు” (రోమి. 8:5). శరీరానుసారమైన తలంపు అనగా ఏమిటి? పరిశుద్ధాత్మునికి చోటు ఇవ్వక, తమ స్వయచిత్తము చొప్పున మనస్సును, శరీరమును కోరుకొనుచున్న వాటిని చేయుటయే శరీరము యొక్క క్రియలైయున్నవి. అపో. పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికయందు “మీలో అసూయయు, కలహమును ఉండగా మీరు శరీరసంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?” (1. కోరింథీ. 3:3). శరీర తలంపును మీయొద్ద నుండి తొలగించవలెను.
- అతిశయపు తలంపు :- “(హెచ్చు) అతిశయించు వాటియందు మనస్సును ఉంచక, తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి” (రోమి. 12:16). దేవుడు అసహ్యించుకునేటువంటి మరొక పాపము మనస్సునందు గల గర్వమైయున్నది. గర్విష్టులను దేవుడు ఎదిరించి నిలబడుచున్నాడు. అన్ని పాపములకంటేను భయంకరమైన పాపము ఒకటి కలదు అంటే, అది అహంకారమును, గర్వమునైయున్న పాపమే. ప్రభువు అటువంటి వారిని ఎదిరించి నిలబడు వాడైయున్నందున, మీ యొక్క జీవితమునందు గల గర్వపు తలంపులను పూర్తిగా తొలగించవలెను.
- వ్యర్థపు తలంపు:- “కాబట్టి అన్యజనులు (తమ వ్యర్థపు తలంపులయందు) నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదు” (ఎఫెసీ. 4:17). వ్యర్థపు తలంపు అని చెప్పుచున్నప్పుడు, అది పనికిరాని తలంపును సూచించుచున్నది. అది మనస్సునందు కట్టుకొనుచున్న గాలి మేడలను, నెరవేర్చలేని ఆలోచనలను, చెరుపును కలుగజేసి మలిన పరచు తలంపులను సూచించుచున్నది.
అవును అనేకులు ఇటువంటి వ్యర్ధపు మరియు చెడు తలంపులకు చోటునిచ్చి పనికిమాలిన వారిగా మారిపోవుచున్నారు. దేవుని బిడ్డలారా, పైన చెప్పబడియున్న తలంపులన్నిటిని మీ మనస్సులో నుండి తొలగించి, దైవతలంపునకు మీ హృదయమునందు చోటును ఇచ్చుదురుగాక
నేటి ధ్యానమునకై: “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు, మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” (రోమి. 12:2).