No products in the cart.
డిసెంబర్ 29 – పాపులను రక్షించుటకు….!
“పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను” (1. తిమోతి. 1.15)
మనలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని చెప్పబడుట మనకు ఎంత గొప్ప ఆదరణకరమైనది! ఎంతటి వాగ్దానముతో కూడినది! సంతోషముకు గల సారాంశమే ఈ వాక్యమునందే ఇమిడియున్నది.
పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను అని అపోస్తులుడైన పౌలు సెలవిచ్చుచున్నప్పుడు, ఆ మాటలను మిగుల ప్రేమతోను వాత్సల్యముతోను సెలవిచ్చుచున్నాడు. అతనిని రక్షించుటకు వచ్చిన దైవీక ప్రేమను ఆయన బయలుపరచుచున్నాడు. పాపులలో ప్రధాన పాపిని నేనే అని ఆయన, తనని కూడా కలుపుకొని చెప్పుటను చదువగలము.
వీధులలో ప్రసంగించుచున్న వారిని పలువురు గెలిచేయుట కలదు. “ఓ,.. పాపులారా! అని పిలిచేటువంటి పుణ్యాత్ములు వచ్చారండి. వీరందరును గొప్ప పరిశుద్ధులట; మేము అందరమును పాపులట” అని మరికొందరు తమ అజ్ఞానమును బట్టి హేళన చేయుట కలదు.
ఒక ప్రసంగీకుడు క్రీస్తు కొరకు బహు బలముగాను, వైరాగ్యముతోను పరిచర్యను చేయుచుండెను. ఆయన వీధులలో ప్రసంగము చేయుటయందు ఆయనకు సాటియైన వారు లేరు. ఆయనకు బహుగా నచ్చిన వాక్యము, ‘పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను’ అనుటయే. ఆయన ఒకసారి వీధి ప్రసంగము చేయుచున్నప్పుడు ఒకడు కోపము తెచ్చుకుని, ఆయనను పట్టి గోనె సంచిలో ఒక మూటగా కట్టెను. రాత్రి వచ్చినప్పుడు ఆ మూటను పడవలోకెక్కించి సముద్రములో ముంచి వేయవలెను, అని అనుకుని ఎత్తుకొని నడిచెను.
ఆ ప్రసంగీకునికి తన మరణ సమయము వచ్చెను అని తెలిసెను. సరే, చివరి వరకు ప్రసంగించుచూనే మరణించుట మంచిది అని తీర్మానమునకు వచ్చెను. ఆయన గోనెసంచి మూటలోనుండి, “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను” అని గొప్ప శబ్దముతో కొనసాగించి చెప్పుటకు ప్రారంభించెను. రాత్రిపూట ఆ వైపునకు వచ్చిన కొందరు గోనె సంచి మూటలోనుండి శబ్దము వచ్చుటను విని, గోనెసంచెను మోసుకొని వెళ్ళుచున్న వానిని ఆపి గోనె మూటను తెరచిరి. గోనె సంచిలో నుండి ప్రసంగీకుడు దూకి బయటకు వచ్చెను.
ప్రసంగీకుడు లేచి నిలబడి, ‘చూడుడి, నన్ను మూటగా కట్టి సముద్రములో ముంచివేయుటకు అతడు బయలుదేరి వచ్చెను. అయితే మీరు నన్ను కాపాడితిరి. అదేవిధముగా సాతాను పాపములు చేయుచున్న మనుష్యుని మూటగట్టి పాతాళము యొక్క అగ్ని గంధకములో ముంచి వేయుటకు వెళ్ళుచున్నాడు. అయితే, పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను’ అని ప్రసంగించెను. ఆ ప్రసంగమును వారు మిగుల ఉత్సాహముతో గమనించిరి. రక్షణను ప్రకటించుటకు అది ఒక అవకాశముగా మారెను.
సువార్తను ప్రకటించు వారిని లోకము చులకనగా చూడవచ్చును. అయితే ప్రభువు గొప్ప ఔనత్యముతో చూచుచున్నాడు. బైబిలు గ్రంధము సెలవిచ్చుచున్నది, “సమాధానము చాటించుచు, సత్క్రియలను సువర్తమానముగా ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రసిద్ధి చేయువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములైయున్నవి” (యెషయా. 52:7). దేవుని బిడ్డలారా, మీ యొక్క పాదములను సుందరముగా చూచుచున్న ప్రభువు యొక్క సువార్తను వైరాగ్యముతో మోసుకుని వెళ్లెదరా?
నేటి ధ్యానమునకై: “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు” (అపో.కా. 16:31).