No products in the cart.
డిసెంబర్ 28 – గురు యొద్దకే!
“క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను” (ఫిలిప్పీ. 3:14).
నేను పలుసార్లు వయస్సు మళ్ళిన వృద్ధుల యొక్క ఇండ్లకు వెళ్లి, వారిని దర్శించియున్నాను. వారికి సాధ్యమైనంత మట్టుకు బహుమానములను తీసుకుని వెళ్లి ఇచ్చియున్నాను. క్రీస్తునందు జీవించుచున్న వయస్సు మళ్ళిన వృద్ధులు మిగుల ఆనందముతో ప్రభువును పాడి స్తుతించుటను చూచుచున్నపుడు, నాకు మిగుల ఆనందముగా ఉండును. గడిచిన కాలమును తలంచి ఆనందించుచున్నరు, రానున్న కాలమును గూర్చి ఆనందముతో ఎదురుచూచుచున్నారు.
ఒకసారి లోకతత్వపు జ్ఞాని ఒకరు, ‘మనము ఖర్చు పెట్టుచున్న ఒక్కొక్క క్షణమును కాలచక్రముతో తిరుగుచూ, మన యొక్క సమాధి వద్దకే పరిగెత్తుచున్నాము’ అని చెప్పెను. ఒక మాసము గడిచెను అంటే, మన యొక్క అంతిమ దినము తట్టునకు ఒక మాసము సమీపించి వచ్చియున్నాము. ఒక సంవత్సరము గడిచిపోయెను అంటే, మనము మరణించి సమాధి చేయబడు సమయము తట్టునకు ఒక సంవత్సరము సమీపించి ఉన్నాము అను సంగతి వాస్తవము అని చెప్పుచున్నాడు. అయితే అది వాస్తవము కాదు.
మనము కర్చు పెట్టుచున్న ప్రతి ఒక్క క్షణమును, దినమును, మాసమును, సంవత్సరమును, యేసుక్రీస్తు యొక్క రాకడ తట్టునకు పరిగెత్తుచూనే ఉన్నాము. క్రీస్తును దర్శించుటయు, క్రీస్తువలే మారుటయే మన యొక్క గురి. ఆయనను దర్శించుచున్నప్పుడు, ఆయన మన కొరకు ఉంచి ఉన్న జీవ కిరీటములను, వాడబారని కిరీటములను, మహిమకరమైన కిరీటములను పొందుకొనేదము. అపో. పౌలు, ఈ సంగతిని సూచించుచున్నప్పుడు, “దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపునకు కలుకు బహుమానమును కొరకు” అని చెప్పుచున్నాడు.
క్రీస్తును అంగీకరించక పాపమునందు జీవించుచున్న ఇతరులు కూడాను సమాధితట్టునకు పరుగెత్తుట లేదు. వారు న్యాయ తీర్పు దినము తట్టునకు పరిగెత్తుచున్నారు. భూమి మీద వారు చేసిన ప్రతి ఒక్క చర్యకును తగిన ఫలమును పొందుకొనుటకు పరిగెత్తుచున్నారు. కొంతమంది పాతాళము తట్టునకు పరిగెత్తుచున్నారు. కొంతమంది నిత్యమైన చీకటి తట్టునకు పరిగెత్తుచున్నారు.
క్రీస్తు కల్వరి సిలువ మరణముము ద్వారా మరణమును జయించు మార్గమును మనకు బోధించుచున్నాడు. కావున, వయస్సు మళ్లిన వృద్ధులను గూర్చి మనము చింతించవలసిన అవసరము లేదు. మోషేకు నూట ఇరువది సంవత్సరముల వయస్సు అయినప్పటికిని, ఆయన వర్ధిల్లుచూనే ఉండెను. తన యొక్క సంతతి స్వతంత్రించుకొన బోవుచున్న పాలును తేనెయు ప్రవహించు కనానును తేరిచూచుటకు అట్టి వృద్ధాప్యపు వయస్సునందును, నెబో కొండయందుయున్న పిస్కా కొండ యొక్క శిఖరమునకు ఎక్కెను. అప్పుడు యెహోవా ఆయనకు దాను వరకు గిలాదు దేశమంతయు, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును, సోయరు వరకు ఈతచెట్లుగల పట్టణమను ఊరు మొదలుకొని, యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను” (ద్వితి. 34:1-3). మరణించుచున్నప్పుడు కూడాను ఆయన యొక్క కన్నులయందు గొప్ప ఔన్నత్యమైన దర్శనము ఉండెను.
దేవుని బిడ్డలారా, మీ కన్నులయందు కూడాను అట్టి దర్శనము ఉండవలెను. దూరమునందున రాజాధి రాజును మీ కన్నులు దర్శించవలెను. పరమ కానాను మీ యొక్క కన్నులు ఎదురుచూచు ఉండవలెను. గురు యొద్దకే పరిగెత్తుదురుగాక.
నేటి ధ్యానమునకై: “మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువు తగ్గలేదు” (ద్వితి. 34:7).