SLOT GACOR HARI INI BANDAR TOTO bandar togel bo togel situs toto musimtogel toto slot
Appam, Appam - Telugu

డిసెంబర్ 11 – శిక్ష!

“ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు; అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును” (హెబ్రీ. 12:11).

శిక్షను ఎవరు కోరుకొనరు. అయితే, ఒక మనుష్యుడు బాగుపడుటకు శిక్ష అవస్యమైయున్నది. దేవుని యొక్క శిక్ష అనునది ఒకవేళ ఆ సమయమునందు బాధాకరముగా ఉండవచ్చును. అయితే, రానున్న కాలమునందు అది మనకు ఆశీర్వాదకరమైనదిగా మారుటను చూచెదము.

మనము మన పిల్లలను బెత్తము చేత శిక్షించుచున్నాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఆ పిల్లల యొక్క మేలులకే. అదే సమయమునందు పెద్దలను ఎలాగు శిక్షించుట? ప్రభుత్వము దానికి సంబంధించిన పలు విధముల అపరాధములను, దండనలను, చెరసాలలను ఉంచియున్నది. అయినను, అంతరంగమునందు చేయుచున్న పాపములును, ప్రభుత్వము యొక్క కన్నులను కప్పి చేయుచున్న రహస్య చర్యలును విస్తారముగా ఉన్నాయి. వాటి నుండి ఒక విశ్వాసిని త్రిప్పుటకు గల మార్గము ఏమిటి.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి” (హెబ్రీ. 12:6).

ప్రభువు మనలను ఖండించుచున్నప్పుడు, మనపై ఆయన ప్రేమను ఉంచియున్నాడు అను సంగతిని మనము మర్చిపోకూడదు. అట్టి ప్రేమ కారణము చేతనే, ఆయన మనపై అక్కరగలవాడై శిక్షలను, శ్రమలను, కష్టములను మన యొక్క జీవితములోనికి పంపించి మనలను సన్మార్గులుగా చేయుచున్నాడు.

*బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?

కుమాళ్లయిన వారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుండిరి. వారియందు భయభక్తులు కలిగియుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా?” (హెబ్రీ. 12:7-9).*

ప్రారంభమునందు ఇవ్వబడిన వచనములో చోటుచేసుకునియున్న అభ్యాసము కలిగినవారికి అను మాటను ఆలోచించి చూడుడి. అవును, శిక్ష ద్వారా ప్రభువు మనలను అభ్యాసము చేయుంచుచున్నాడు. పరిశుద్ధమైన మార్గములో నడుచుటకు మనకు బోధించుచున్నాడు. ఆలోచనకర్తయైయున్న దేవుడు శిక్ష ద్వారా మనకు నేర్పించుచున్న మంచి పాఠము కలదు. అట్టి పాఠములను మనము ప్రారంభమునందే గైకొనినట్లయితే, అది నిత్య రాజ్యమునకు మనము వెళ్లి చేరేంతవరకును మనకు చాలిన కాపుదలను దయచేయను.

దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క శిక్షను అల్పముగా తలంచకుడి. ఆయన తన శిక్ష యొక్క ముగింపులో మిమ్ములను గొప్ప ఔనత్యముతో హెచ్చించును కలతచెందకుడి.

నేటి ధ్యానమునకై: “విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు; వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” (కీర్తనలు. 34:18,19).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.