No products in the cart.
డిసెంబర్ 09 – ధన్యురాలు!
“ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు” (సామెతలు. 31:28).
ధన్యుడు అను పదము బైబిలు గ్రంథము నందు నలభై ఒకటి చోట్లలో స్థానము కలిగియుంది. అయితే, ధన్యురాలు అను పదము ఐదు చోట్ల మాత్రమే చోటు చేసుకుంది పాత నిబంధనలో లేయా తనను ధన్యురాలని చెప్పుకొనుచున్నది (ఆది.కా. 30:13). క్రొత్తనిబంధనలో మరియను మనము ధన్యురాలుగా చూచుచున్నాము (లూకా. 1:48).
మరియ ధన్యురాలు అని చెప్పబడుటకు మూడు ప్రధానమైన కారణములు కలదు. 1. మరియ యొక్క తగ్గింపు, 2. మరియ యొక్క విశ్వాసము, 3. మరియ క్రీస్తును గర్భము ధరించెను. దేవుని బిడ్డలారా, మరియ యొక్క స్వభావము మనలో రూపించబడినట్లైతే మనము కూడాను ధన్యడుగాను, ధన్యురాలుగాను కనబడుదుము.
“ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను; ఇది మొదలుకొని అన్ని తరములవారును నన్ను ధన్యురాలు అనియందురు” (లూకా. 1:47,49). బైబిలు గ్రంథము అంతటను మరియ యొక్క తగ్గింపు మనలను విభ్రాంతి పరుచుచున్నది. యేసు క్రీస్తు అద్భుతములను చేయుచున్నప్పుడు, నా కుమారుని ద్వారా జరిగిన అద్భుతములని ఆమె అతిశయించలేదు. దేవాది దేవుని గర్భము ధరించాను అని మనస్సునందు గర్వము ఆమెకు లేదు. వాటిని గూర్చి చెప్పబడిన ప్రవచనములను గూర్చిన అతిశయము ఆమెకు లేకుండెను.
మరియ తనను దాసురాలను అని చెప్పుకొనుటను చూడుడి. దాసురాలి యొక్క దీనస్థితిని ప్రభువు కటాక్షించెను అని చెప్పి ప్రభువును స్తుతించెను. అందుచేత ఆమె ధన్యురాలు అని పిలువబడెను. “ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక, (నమ్మిన) విశ్వసించిన ఆమె ధన్యురాలనెను” (లూకా. 1:45).
మరియ యొక్క జీవితమును చదువుచున్నప్పుడు, ఆమెకు ప్రభువు చేత సెలవివ్వబడియున్న ప్రతి విషయమును విశ్వసించెను. అందుచేత, విశ్వసించిన ఆమె ధన్యురాలు అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. దేవుని బిడ్డలారా, ప్రభువు మీకు ఒక వాగ్దానమును ఇచ్చినట్లయితే, ప్రభువు మీతో మాట్లాడి ఒక సంగతిని చెప్పినట్లయితే, ఆ సంగతిని దృఢముగా పట్టుకొనుడి. భూమియు ఆకాశమును గతించి పోయినను ఆయన యొక్క మాటలు గతించిపోదు.
ఒకసారి యేసుక్రీస్తును ఒక స్త్రీ చూచి: నిన్ను మోసిన గర్భము ధన్యతగలది అని గొప్ప స్వరముతో చెప్పెను. అవును, వాస్తవమునకు మరియ ధన్యురాళైయున్నది. అట్టి ధన్యత మరియకు మాత్రమే వచ్చునా? లేదు. ఆత్మలయందు క్రీస్తు యొక్క స్వరూప్యము రూపింపబడునట్లుగా గర్భవేధన పడుచున్న ప్రతి ఒక్కరును ధన్యత గలవారుగా ఉందురు. అపోస్తులుడైన పౌలు గలతీయులకు వ్రాయుచున్నప్పుడు, ‘క్రీస్తు స్వరూప్యము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది అని సూచించుచున్నాడు (గలతీ. 4:19).
దేవుని బిడ్డలారా, ఆత్మల కొరకు, గ్రామాల కొరకు, పట్టణాల కొరకు, యవనస్థుల కొరకు ప్రసవ వేదనతో ప్రార్ధించెదరా? క్రీస్తు ప్రతి ఒక్కరి యొక్క అంతరంగము నందును రూపింపబడవలెను అనుటయు, ప్రతి ఒక్కరును క్రీస్తు యొక్క పోలికలో పరిపూర్ణత చెందవలెను అనుటయు మీయొక్క ప్రార్థనలోని ఉద్దేశముగా ఉండవలెను.
నేటి ధ్యానమునకై: “నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు” (అది.కా. 30:13).