No products in the cart.
డిసెంబర్ 03 – దాసుని గృహము!
“ఇప్పుడు, నీ దాసుడనైన నా గృహము (కుటుంబము) నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము” (2.సమూ. 7:29).
దేవుని బిడ్డల యొక్క గృహము ఆశీర్వాదకరమైనదిగా ఉండును. ఎందుకంటే అక్కడ దేవుడైన ప్రభువు నివాసము చేయుచున్నాడు. అక్కడ దేవుని యొక్క బిడ్డలు ప్రభువును పాడి స్తుతించుచున్నారు. అవును, నీతిమంతుల యొక్క గుడాహారములలో రక్షణ సునాదము వినబడును.
“యాత్రికుడనైన నేను బసచేయు నా గృహమునందు నీ కట్టడలు నేను పాటలు పాడుటకు హేతువులాయెను” (కీర్తనలు. 119:54) అను వచనము నా హృదయమును తాకినదైయున్నది. మనము మన ఇంట పరదేశులమువలె బసచేసినను ప్రభువు యొక్క కట్టడలు మనతో ఉన్నందున, దేవుని యొక్క ఆశీర్వాదములు మనలను నింపుచున్నాయి. ప్రభువు కూడాను మనతో నివాసము చేయుచున్నాడు.
ఆరు లక్షలకు అత్యధికమైన ప్రజలను ప్రవక్తయైన మోషే అరణ్యమునందు త్రోవ నడిపించినప్పుడు, వారి మధ్యన నివాసము ఉండునట్లుగా ప్రభువు తన కొరకు ఒక గుడారమును అమర్చునట్లుగా చెప్పెను. అదియే ప్రత్యక్షపు గుడారము. ఆ గుడారమునందు ప్రభువు నివాసముండి, గుడారమును తన యొక్క షెకీణా మహిమ చేత నింపెను.
అదేవిధమూగా, సొలోమోను ఆలయమును కట్టినప్పుడు, అక్కడ నివాసము ఉండునట్లుగా దేవుడు దిగివచ్చెను. యేసుక్రీస్తు కూడాను, శిష్యులును యమ్మా ఊరునకు వెళ్ళినప్పుడు క్రీస్తు వారితో కూడా నడుచుట మాత్రము గాక, వారి యొక్క ఇండ్లకు కూడాను వెళ్ళెను. అట్టి ప్రభువు నిశ్చయముగానే మీయొక్క ఇంటికి వచ్చి మీతో కూడా నివాసము ఉండును. అంత మాత్రమే కాదు, ఆయన మీ గృహమునందుగల ఆహారమును, పానీయమును ఆశీర్వదించును. వ్యాధిని మీనుండి తొలగించును. అట్టి చక్కటి ప్రభువు మీయొక్క గృహము సామర్ధ్యతగలదిగా నడిపించుటకును, నీ చేతి ప్రయాసలన్నిటిని ఆశీర్వదించుటకును మిమ్ములను కటాక్షించును.
మీయొక్క గృహము నిత్యమును ఆశీర్వదింపబడుట కొరకు: “నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు, నీ గొఱ్ఱె మేకలమందలు దీవింపబడును; నీ గంపయు పిండి పిసుకు నీతొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు” (ద్వితి. 28:4-6).
ప్రభువు మీయొక్క గృహమును కొనసాగించి ఆశీర్వదించవలెను అంటే, ప్రభువు యొక్క గృహమును గూర్చి మీరు భక్తి వైరాగ్యము గలవారైయుండవలెను. దావీదు యొక్క గృహము తరతరములుగా ఆశీర్వదింపబడుటకు గల ముఖ్య కారణము దావీదు ప్రభువు యొక్క ఇంటిపై కొలత లేనంతగా వాంఛయు దాహమును కలిగియుటయే. ప్రభువు యొక్క ఆలయము కట్టబడుటకు విస్తారమైన బంగారమును, వెండిని, దేవదావృక్షములను అతడు సమకూర్చి పెట్టెను.
దేవుని బిడ్డలారా, మీ యొక్క అంతరంగము ప్రభువు పైనను, ప్రభువు యొక్క ఆలయము మీదను, పరిచర్య మీదను వాంఛ కలిగియుండవలెను. అప్పుడు జీవించు దినములన్నిట కృపా క్షేమములు మిమ్ములను వెంబడించును. మీరు ప్రభువు యొక్క ఇంట చిరకాలము నిలచియుందురు!
నేటి ధ్యానమునకై: “ఇదిగో, యెహోవాయందు భయభక్తులుగలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును” (కీర్తనలు. 128:4,5).