No products in the cart.
డిసెంబర్ 01 – త్రోవనడిపించువాడు!
“యెహోవా మాత్రము వాని త్రోవనడిపించెను” (ద్వితీ. 32:12).
“త్రోవనడిపించు శక్తి గల దేవా జీవితము యొక్క నాయకుడా” అని మనము మనసారా ప్రభువును స్తుతించి పాడుచున్నాము. ఆయన మన జీవితము యొక్క ప్రతి ఒక్క నిముషమును త్రోవనడిపించుచున్నాడు. చెయ్యి పట్టి నీతి మార్గములో త్రోవనడిపించుచున్నాడు.
ఒంటరిగా దిగనాడబడిన ప్రతి ఒక్కరిని కూడాను ప్రభువు త్రోవనడిపించుచున్నాడు. ఏలీయాను తేరి చూచుచున్నాడు. ఆయన ఒక ఒంటరియైన మనుష్యుడు. ఆయన యొక్క ఒంటరితనములో ఆయనకు సహాయకరముగా ఒక్కరిను లేరు. అయితే తన యొక్క చిత్తమును ప్రభువు యొక్క హస్తములలో అప్పగించుకొని ప్రభువు తనను త్రోవ నడిపించునట్లుగా దేవుని సముఖములో ఏలీయా కనిపెట్టుకొనియుండెను.
ప్రభువు ఆయనను ఎంత చక్కగా త్రోవనడిపించెను చూడుడి. కరువు కాలమునందు ప్రతి ఒక్క దినమును కాకులు ఆయనకు రొట్టెను మాంసమును తీసుకుని వచ్చెను. కేరూతు వాగు యొక్క నీటిని త్రాగెను. దాని తరువాత ప్రభువు సారెపతు వెధవరాలి ద్వారా ఆయనను అద్భుతముగా పోషించుటకు సంకల్పించెను. ప్రతిదినమును అద్భుతము జరుగుచూనే ఉండెను.
మీ యొక్క హస్తములను ప్రభువు యొక్క హస్తములలో పరిపూర్ణముగా మీరు సమర్పించుకున్నప్పుడు, ఆయన మిమ్ములను మీ యొక్క కుటుంభము అంతటిని బహు చక్కగా త్రోవ నడిపించును. ఆయన నోవాహును ఆయన కుటుంభము అంతటిని వాడలో కాపాడి నాశనము నుండి తప్పించెను గదా?
కొర్నేలీ ఇంటివారు ప్రభువును విశ్వసించిన్నప్పుడు వారందరిని అభిషేకించి, పరలోక సంబంధమైన సకల ఆశీర్వాదములచే నింపెను. మీ కుటుంబము యొక్క బాధ్యతలను ప్రభువు యొక్క హస్తములో అప్పగించి చూడుడి. ఆయన నిశ్చయముగా బహు చక్కగా మిమ్ములను త్రోవ నడిపించును.
ఇశ్రాయేలు జనాంగము అంతటిని, సుమారు ఇరవై లక్షల ప్రజలను ఆయన త్రోవ నడిపించుటకు శక్తిమంతుడైయుండెను. ఐగుప్తు దేశమునందు బానిసలుగా ఉండిన ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనె ప్రవహించు దేశమునకు ఎంత చక్కగా త్రోవ నడిపించుకొని వచ్చెను అను సంగతిని సంఖ్యా. 21 ‘వ అధ్యాయమునందు చూడ వచ్చును.
అందులో ఆరు లక్షలకు పైబడ్డ యుద్ధ పురుషులు ఉండెను. చాలామంది స్త్రీలును, పిల్లలును ఉండిరి. సుమారు ఇరవై లక్షలమందియైనను అరణ్యములో త్రోవ నడిపించబడి ఉండవలెను. వారందరికిని అరణ్యములో ఆహారమును పెట్టుట అను సంగతి సాధారణమైన ఒక మనుష్యునికి బహు గొప్ప సమస్యగా ఉండవచ్చును.
అయితే త్రోవ నడిపించుచున్న శక్తిగల దేవునికి అది ఒక్క సమస్యయే కాదు. ఆయన యొక్క చెయ్యి కృషించిపోలేదు. ఆయన ప్రతిదినమును వారిని మన్నాచే పోషించెను. పురెడు పిట్టలను తీసుకుని వచ్చి పాళయములో రాశులుగా కూర్చునట్లు చేసెను. ఇరవై లక్షల మందిని ఒక్క మనుష్యుడు త్రోవ నడిపించునట్లుగా మేఘస్తంభము ద్వారాను, అగ్నిస్తంభము ద్వారాను బహు చక్కగా త్రోవ నడిపించెను.
దేవుని బిడ్డలారా, మన ప్రభువు మారనివాడు, ఉన్నవాడను అనువాడనై యున్నాను అని చెప్పిన ఆయన, నిశ్చయముగానే మీతో కూడా ఉండి మిమ్ములను త్రోవ నడిపించును.
నేటి ధ్యానమునకై: “నేను నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు చూపించెదను; నీ మీద నా దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తనలు. 32:8).