No products in the cart.
జూలై 23 – వెంటాడుడి!
“ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరమును అపేక్షించుడి” (1. కోరింథీ.14:1).
మనము వేటిని వెంటాడవలెను, వేటిని కోరుకొనవలెను, వేటిని వాంఛించవలెను, అను సంగతిని గూర్చి అపో. పౌలు ఈ భాగమునందు వ్రాయుచున్నాడు.
ఒక దుఖాణమునకు చీరను కొనుటకు వచ్చుచున్న స్త్రీ ముందట దుఖానుదారుడు వందల కొలది చీరలను తీసి వేయుచున్నాడు. ఆ స్త్రీ అందులో దేనిని తీసుకొనుట అని తెలియక తడబడుచున్నప్పుడు, ఆ దుకాణమునందు పనిచేయుచున్న ఒకరు ఒక మంచి చీరను తీసి చూపించి ‘దీనిని తీసుకొనుడి ఇది మీకు చాలా అందముగా ఉండును, వచ్చుచున్న వారంతా దీనిని కొనుక్కొని వెళ్ళుచున్నారు. చివరగా ఒకటి రెండు చీరలు మాత్రమే మిగిలియున్నాయి’ అని దీనిని గూర్చి చెప్పి మనస్సును వెంటాడునట్లు చేయును.
అదేవిధముగా అపో. పౌలు క్రీస్తు అనుగ్రహించిన పలు విధములైన ఆశీర్వాదములను, ఆత్మీయ వరములను, ఆత్మీయ ఫలములను చూపించి చివరిగా, ‘ప్రేమను వెంటాడుడి; ఆత్మ సంబంధమైన కృపావరములను ఆపేక్షించుడి’ అని ప్రేమతో మనకు ఆలోచనను చెప్పుచున్నాడు. అలాగునే ఆయన 1. కొరింథీ. 12 ‘వ అధ్యాయమును ముగించుచున్నప్పుడు, “కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను” (1. కోరింథీ. 12:31). అని చెప్పుటను ధ్యానించి చూడుడి.
అపో. పౌలు, అనుభవముగల, వయసస్సునందు పెద్దయైయున్న ఒక భక్తిపరుడు. ఆయన యొక్క పత్రికలన్నిటిలో ఆయన చెప్పుచున్న ఆలోచనలను వెంబడించినట్లయితే అది మనకు ఆశీర్వాదముగా ఉండును.
ప్రతి ఒక్కరి యొక్క కోరికయు, వాంఛయు, అన్వేషణయు వ్యత్యాసముగానే ఉన్నాయి. వివాహమునకు ఒక చిన్నదాని చూచుచున్నప్పుడు కొందరు ఆమె యొక్క ఆస్తులపైనను, కొందరు ఆమె యొక్క సంపాద్యముపైనను, కొందరు ఆమె యొక్క కులము గోత్రముపైనను, కొందరు ఆమె యొక్క అందచందాల పైనను తమ ప్రాముఖ్యతను ఉంచెదరు. అయితే బైబిలు గ్రంథము: “గుణవతియైన భార్యను కనుగొనువాడు ఎవ్వడు? అట్టిది ముత్యము కంటె అమూల్యమైనది” (సామెతలు. 31:10) అని చెప్పుచున్నది.
“మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుటకు వెంటాడుడి” (రోమీ. 12:17) అనియు, “అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి” (హెబ్రీ. 12:14) అనియు మనము వెంటాడవలసిన దానిని గూర్చి బైబులు గ్రంథము చెప్పుచున్నది.
అపో. పౌలు వెంటాడిన ఒక అంశము కలదు. సువార్తను ప్రకటించుటయే అట్టి అంశమునైయున్నది. ప్రకటించబడిన స్థలమునందు ప్రకటించక క్రొత్త స్థలములయందు ప్రకటించునట్లు వెంటాడిన తన యొక్క వాంఛను ఆయన వ్రాయుచున్నప్పుడు, “నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము …. క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైయుండి వెంటాడుచున్నాను” అని చెప్పెను (రోమీ. 15:21). దేవుని బిడ్డలారా, మీరు వేటిని వెంటాడుచున్నారు?
నేటి ధ్యానమునకై: “మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటి మీదనేగాని, భూసంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి” (కొలస్సీ. 3:1,2).