Appam, Appam - Telugu

జూలై 22 – శారీరక స్వస్థత!

“పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది” (రోమీ. 12:1).

దేవుని యొక్క ప్రసన్నతను మన యొక్క జీవితములోనికి తీసుకొని వచ్చుటకు మన యొక్క శరీరము సహకరించవలెను. శరీరమునందు మంచి స్వస్థత, ఆరోగ్యమును ఉండవలెను. మన యొక్క శరీరమును సరిగ్గా పరామర్శింపక శరీరము యొక్క ఆరోగ్యమును చెరుపుకొని అశ్రద్ధను చూపినట్లయితే, తద్వారా మన ప్రాణము యొక్క మనుగడకు కూడాను హాని కలుగును.

మన యొక్క శరీరమునందే ప్రాణము నివాసము చేయుచున్నది. శరీరమును ప్రాణమును ఒకదానితో ఒకటి ఏకమైయున్నదే. అయితే ఒకదానికొకటి హాని కలిగించుకునేదే. పలు శతాబ్దాలుగా ఇండియాలో ఉన్న మునీశ్వరులును, సన్యాసులును తమ యొక్క శరీరమును ఆత్మ యొక్క బద్ధ శత్రువుగా తలంచుచున్నారు.

అయితే, క్రైస్తవ మార్గమునందు మన యొక్క శరీరమును సజీవ బలిగా సమర్పించు కొనవలెనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు కొరకు శ్రమ పడుటకును, కుటుంబము యొక్క అవసరతలను దర్శించుటకును మన శరీరమునకు జీవము అవసరము. యేసుక్రీస్తు సెలవిచ్చెను: “జీవము కలుగుటకును, అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని” (యోహాను. 10:10).

మన యొక్క శరీరము ద్వారానే దేవుని యొక్క ప్రసన్నత బయలుపరచబడును. మనలను చూచుచున్నవారు మనయందు క్రీస్తును చూచునట్లుగా మన యొక్క శరీరము ద్వారాను క్రీస్తును మహిమ పరచవలెను. మన యొక్క శరీరమునందే క్రీస్తు మహిమగల నిరీక్షణగా నివాసము చేయుచున్నాడు.

ఈ మట్టి ఘటమునందే మనము మహిమగల పరిశుద్ధాత్మను పొందుకొనియున్నాము. ఏ మనుష్యుడైతే తన యొక్క శరీరము దేవుడు నివసించు ఆలయము అనుసంగతిని గ్రహించుచున్నాడో, అతడు నిశ్చయముగానే తన యొక్క శరీరమును చక్కగా పరామర్శించి సంరక్షించుచున్నాడు.

యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చుటకు ఆయనకు ఒక శరీరము కావలసినదాయెను. కావున తండ్రియైన దేవుడు ఆయనకు ఒక శరీరమును సిద్ధపరచెను. “కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు, ఈలాగు చెప్పుచున్నాడు: బలియు అర్పణయు నీవు కోరుట లేదుగాని, నాకొక శరీరమును అమర్చితివి” (హెబ్రీ. 10:5) అని చెప్పెను. ఆయన యొక్క శరీరము భూమిమీద పరిచర్య చేయుటకును, కనికరముతో అవసరతగల జనుల తట్టునకు వెళ్ళుటకును ఆయనకు మిగుల ప్రయోజనకరముగా ఉండెను. చివరకు, అట్టి శరీరమును పాప పరిహార్ధబలిగా మన విమోచన కొరకు అర్పించెను.

మీ యొక్క శరీరమును పరామర్శించుడి. మీకు కావలసిన విశ్రాంతి కావలెను. అయితే, అది గాఢనిద్ర ఆత్మచేత దాడి చేయబడకూడదు. మీకు మంచి ఆహారము కావలెను. అయితే, అది తిండిపోతు తనముగా ఉండకూడదు. మీ యొక్క శరీరమునకు చక్కని శారీరిక వ్యాయామము కావలెను. అయితే, దాని కొరకు పలు గంటల సమయమును వ్యర్థపరచకూడదు. దేవుని బిడ్డలారా, శరీరము పట్ల శ్రద్ధవహించుడి.

నేటి ధ్యానమునకై: “క్రీస్తు నా శరీరమము మూలముగా మహిమ పరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా… పరిణమించునని నేనెరుగుదును” (ఫిలిప్పీ. 1:19,20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

Login

Register

terms & conditions