No products in the cart.
జూలై 21 – సహాయముచేయు మార్గము!
“పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను” (అపో.కా.12:5).
ఆదిమ క్రైస్తవ సంఘస్తులు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను స్పష్టముగా యెరిగియుండెను. “అదే కాలమందు రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని
యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురునుకూడ పట్టుకొనెను” (అపో.కా. 12:1,2,3). అప్పుడు విశ్వాసులు తాము ప్రార్థనచేయనందున అపోస్తులుడైన యాకోబును కోల్పోయాము అనియు, అదేవిధముగా పేతురును కూడా కోల్పోకూడు అను సంగతిని గ్రహించిరి.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అప్పుడు పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.
ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి, త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా, వెంటనే సంకెళ్లు అతని చేతులనుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని, నీ చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత, దూత నీ వస్త్రమును పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను” (అపో.కా. 12:5-8). అతడలాగున చేసి బయలుదేరి దూత వెంబడి వెళ్లినట్లుగా బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము.
పేతురు చెరసాలలో ఉన్నప్పుడు విశ్వాసులు అందరును ఆసక్తితో ప్రార్ధించిరి. ఆసక్తికరమైన ప్రార్థన దేవుని యొక్క దూతను క్రిందకు దిగివచ్చునట్లు చేసెను. చెరసాల కనిపించెను. పేతురును విడిపించి బయటకు తీసుకుని వచ్చెను.
ఒకసారి ఒక ప్రియ సహోదరి, “నా బిడ్డలు పరీక్షలకు వెళ్ళుచున్నప్పుడు, వారు పరీక్షను వ్రాయుటకు ప్రారంభించు సమయమునందు, నేను మోకరించెదను. వారు పరీక్షను వ్రాసి ముగించేంతవరకును మోకాళ్లపైనే నిలబడి వారి కొరకు ప్రార్థించుచు ఉండెదెను” అని చెప్పెను.
అవును, పరీక్షను వ్రాయుచున్న పిల్లలతో మనము పరీక్షను వ్రాయుచున్న గదిలోనికి వెళ్ళలేము. ప్రక్కన నిలబడి ఉత్సాహపరచను లేము. అయితే, మోకరించి ప్రార్ధించినట్లయితే, మనము మన యొక్క ఆత్మలో వారితో కూడా ఉందుము. ప్రభువు వారికి జ్ఞానమును ఇచ్చునట్లు ప్రార్ధించుచున్నందున, దైవ జ్ఞానము వారు పొందుకొనునట్లు చేయుచున్నది. వారిని జయము పొందునట్లు చేయుచున్నాము. దేవుని బిడ్డలారా, ప్రార్ధించుచున్నారా? ప్రార్థన ద్వారా ఇతరులకు సహాయము చేయుదురా?
నేటి ధ్యానమునకై: “ఏలీయా మనవంటి (శ్రమ అనుభవ) స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు” (యాకోబు. 5:17).