No products in the cart.
జూలై 16 – పరాక్రమశూరుడైన దేవుడు!
“పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు” (యిర్మియా. 20:11).
ప్రభువు పరాక్రమగలశూరుడు. ప్రవక్తయైన యిర్మియా ఆయనను భయంకరమైన పరాక్రమవంతుడు అని సూచించుచున్నాడు. అవును, మన నిమిత్తము ఆయన ప్రేమగలవాడై ఉండినప్పటికిని, మన యొక్క విరోధులకు విరోధముగా ఆయన యుద్ధము చేయుచున్నప్పుడు బలమైన పరాక్రమశాలియైయున్నాడు. కావున, మనలను హింసించుచున్నవారు గెలువలేరు.
ప్రభువు ఎల్లప్పుడును మన పక్షమునందు మనతో ఉన్నాడు. నేడు ప్రభువు మనలను చూచి. ‘కుమారుడా, ఇంతవరకు నిన్ను హింసించిన వారు ఇకమీదట నిన్ను హింసించుచూనే ఉండలేరు. నేను బలమైన పరాక్రమశాలినై నీతో కూడా ఉన్నాను’ అని చెప్పుచున్నాడు.
నాకు ఒక సహోదరుడు తెలియును. ఆయన విదేశాలయందు పనిచేసి, గొప్ప ధనవంతునిగా ఇండియాలోని తన సొంత ఊరునకు తిరిగి వచ్చెను. ఆయన ధనవంతుడై ఉండినందున, ఆయనను అకారణముగా అనేకులు ద్వేషించిరి. ఆయన నూతనముగా కట్టుకున్న ఇంటిలో కాపురము ఉండకుండునట్లు చేతబడి శక్తుల ప్రయోగము చేసిరి. అయితే, ఆయన ప్రభువును గట్టిగా పట్టుకొనియుండెను. చేతబడి శక్తుల ప్రయోగము చేసిన వారు మరలా మరలా ప్రయత్నించి ఏమియు ఫలించనందున మనస్సునందు సోమ్మసిల్లిరి. అంత మాత్రమే కాదు, వారు ప్రయోగించిన చేతబడి శక్తులు వారిపైనే తిరిగి దాడిచేసెను.
“మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు” (జెకర్యా. 2:8) అని బైబిలు గ్రంథము చెప్పుట ఎంతటి వాస్తవము! ఆయన ప్రేమా స్వరూపియే, గొర్రె పిల్లయైనవాడే, అదే సమయములో యూదా గోత్రపు రాజసింహముగా ఉన్నాడు.
ఆయన సైన్యములకు అధిపతియైనవాడు. బలమైన పరాక్రమశాలి, “నీకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధమైనను వర్ధిల్లకపోవును” అని చెప్పుచున్న ప్రభువు, మీకు విరోధముగా ఉన్న సమస్త ఆయుధములను నశింపజేయుటకు వైరాగ్యము గలవాడైయున్నాడు.
బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఆయన హృదయమునందు మహావివేకి, బలమునందు అధిక బలసంపన్నుడు; ఆయనకు విరోధముగా పోరాడ తెగించి హాని నొందనివాడెవడు?” (యోబు. 9:4). ప్రభువు ఒక బండ వంటివాడు. ఆయనను గుద్దుకొనువాడు నలిగిపోతాడే గాని, బండ వంటి ఆయనకు ఎట్టి హానియు ఏర్పడదు.
మీకు విరోధముగా దుర్మార్గులైన మనుష్యులు లేచున్నప్పుడు, దానిని తలంచి బాధపడకుండా, బలమైన పరాక్రమశాలియైన ప్రభువునే ఆనుకొని ఉండుడి. పరాక్రమశాలియైన ప్రభువు తానే మీ కొరకు వాధించి, యుద్ధము చేసి మీకు న్యాయమును జరిగించును. అన్యాయస్తులు కొనసాగించి మీకు అన్యాయము చేయుటను ఆయన ఓర్చుకొనుడు. దేవుని బిడ్డలారా, అట్టి పరాక్రమశాలియైన ప్రభువు మీతో కూడా ఉన్నప్పుడు మీరు ఎందుకుని భయపడవలెను?
నేటి ధ్యానమునకై: “యెహోవా శూరునివలె బయలుదేరును, యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును, ఆయన హుంకరించుచు, తన శత్రువులను ఎదిరించును” (యెషయా. 42:13).