No products in the cart.
జూలై 14 – మేలు చేయుడి!
“మేలుచేయుట నీ చేతనైనప్పుడు; దాని పొందదగిన వారికి చేయకుండ వెనుకతియ్యకుము” (సామెతలు. 3:27).
మేలు చేయుటకు త్రానిని ఇచ్చుచున్నవాడు ప్రభువు. పేద ప్రజలను పరామర్శించేటువంటి సందర్భములు లభించుచున్నప్పుడు అట్టి సందర్భములను ఉపయోగించుకుని వారికి సహాయము చేయవలెను అని ప్రభువు కాంక్షించుచున్నాడు.
ఒక యవ్వనస్థుడు నా వద్దకు ప్రార్థించుకొనుటకు వచ్చెను. ఆయన యొక్క హస్తములు నిశ్చలనమై వేలాడుతూ ఉండెను. తన యొక్క హస్తములను ఉపయోగించి అతని వలన భోజనము కూడా తినలేని పరిస్థితి.
ఆయన చెప్పెను: “కొన్ని సంవత్సరములకు పూర్వము అందమైన చిత్రలేఖనములను గీసేటువంటి తలాంతులును, సామర్థ్యములును నా హస్తములకు ఉండెను. మిగుల చక్కని హస్తములను కలిగినవాడనై పలు వ్యాసములను వ్రాసి లోకము కొరకు నా కరములను ఉపయోగించితిని. ప్రభువునకై వాడబడేటువంటి పలు సందర్భములు లభించినప్పటికీని నేను ఆయన కొరకు నా చేతులను ఉపయోగించలేదు. నా తలాంతును పాతిపెట్టి ఉంచితిని. నేడు నా యొక్క రెండు కరములును నిచ్చలనమై పోయెను. నా కొరకు ప్రార్థించెదరా? ప్రభువు నాకు స్వస్థతను ఇచ్చినట్లయితే నా తలాంతులను, నా సామర్థ్యతను సంపూర్ణముగా ప్రభువు కొరకు అర్పించెదను” అని చెప్పెను.
ప్రభువు మిమ్ములను అనేకులకు మేలు చేయుటయందు హెచ్చించి ఉంచియున్నాడు అంటే, మీ యొక్క పనులను మాత్రమే గమనించుకొనుచు, మౌనముగా స్వార్థముతో ఉండిపోకుడి. మీ యొక్క ఫలములను వెదకి వచ్చుచున్న వేలకొలది పక్షులకు ఉత్సాహముగా ఫలమును దయచేయుడి. నీటి ఊటయైయున్న మిమ్ములను వెదకి వచ్చుచున్న జనుల యొక్క దప్పికను తీర్చుడి. యేసు మేలను చేయుచున్నవాడై సంచరించినట్లుగా మీ యొక్క జీవితము ద్వారాను సంచరించుచు ఇతరులకు సహాయమును చేయుడి.
ప్రార్థించుట మేలుకరణమైనది. కావున సమయము దొరుకుచున్నప్పుడల్లా ఇతరుల కొరకు ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా మేళ్లను చేయుడి. సమయము అనుకూలించినను, అనుకూలించక పోయినను లేఖన వాక్యములను బహు జాగ్రత్తగా ప్రసంగించి ప్రాణములను పాతాళము యొక్క పట్టులో నుండి విడిపించి మేళ్లను చేయుడి. “ఆకలిగల వారికిని, వ్యాధిగ్రస్తులకును, సహాయము చేతుము” అను గీతమును కేవలము నోటితో మాత్రము పాడక, నిజమైన భావముతో పాడెదము గాక! అప్పుడే దాసులకు ఈ ధరణి సొంతమగును.
“కాబట్టి ఒక్కడు మేలైనదిచేయ ఎరిగియుండియు ఆలాగున చేయని వానికి పాపము కలుగును” (యాకోబు. 4:17) అని బైబిలు గ్రంథము హెచ్చరించుచున్నది. మనము ఆరాధించుచున్న మన యొక్క దేవుడే మనకు మేళ్లను చేయుచున్నవాడు. మేలుకరమైన సమస్త ఈవులును ఆయన వద్ద నుండి మాత్రమే మనకు వచ్చుచున్నది. సృష్టియందు ఆయన మన కొరకు సమస్తమును సృష్టించియున్నాడు. ఆయన భూమిపైయున్న దినములయందు జనులకు మేలులనే చేసెను. అటువంటి ప్రేమ గల ప్రభువు యొక్క మేళ్లను చేయు పయనమును మనము కూడాను అనుసరించవద్దా?
దేవుని బిడ్డలారా, మీకుస్తోమత ఉన్నప్పుడు మీ వలన ఎంతటి మేళ్లను ఇతరులకు చేయగలరో దానిని ఆనాడు చేసి ముగించుడి. పరలోకమునందు మీయొక్క ప్రతిఫలము అత్యధిముగా ఉండను.
నేటి ధ్యానమునకై: “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము; దేశమందు నివసించి సత్యము ననుసరించుము” (కీర్తనలు. 37:3).