No products in the cart.
జూలై 13 – ఒప్పిదమునైయున్నది!
“యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము; స్తోత్రముచేయుట ఒప్పిదము” (కీర్తనలు. 147:1).
దేవునికి ఒప్పిదమైనది ఏది అను సంగతిని కీర్తనకారుడు ఇక్కడ చెప్పుచున్నాడు. స్తుతి చెల్లించుటయే దేవునికి తగినదియు, మనకు మనోహరమునైయున్నది. మీరు ప్రభువునకు తగినది ఏది అను సంగతిని ఎరిగియుండవలెను.
ప్రభువు మన యొక్క నాలుకను ఆయనను స్తుతించుట కొరకే అనుగ్రహించియున్నాడు. అవును వెలుగును ఇచ్చుటకు సూర్యుణ్ణి సృష్టించినవాడు, నక్షత్రములను కాలములను సూచించుట కొరకు సృష్టించినవాడు. చెట్లను మంచి ఫలమును ఇచ్చుట కొరకు సృష్టించినవాడు. మన యొక్క నాలుకను ఆయనను స్తుతించుట కొరకే సృష్టించియున్నాడు.
‘సృష్టించెను సృష్టినల్లా మానవునికై; మానవుని సృష్టించెను తన్ను సేవించుటకై’ అనుట ఒక తెలుగు కవి యొక్క పాట. అవును, మనలను ప్రభువు తన్ను ఆరాధించుట కొరకే సృష్టించెను. దాని కొరకే మన యొక్క నోరును, నాలుకను సృష్టించబడియున్నది. అయితే మనుష్యుడు తన యొక్క నాలుకను కొండములాడుటకును, జగడములకును, వ్యర్థమైన మాటలకును ఉపయోగించుచున్నాడు. నాలుక సృష్టించబడి ఉండుటకు గల ఉద్దేశమును ఎరుగక పోవుచున్నాడు. అపో. పౌలు వ్రాయుచున్నాడు, “కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు” (ఎఫెసీ. 5:4). అవును, స్తుతించుటయే తగినది.
కొందరు మాటిమాటికి తమలపాకుతో సున్నమును కలిపి నోటిలో నెమరవేటయుచేత, నాలుకంతయు ఉడికిపోయి ఉండుటను చూచియున్నాము. చివరకు అదే నాలుకలో భయంకరమైన క్యాన్సర్ జబ్బు ఏర్పడి నాలుకనే తీసివేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కన్నీరును విడచి రోదించుచున్నారు. అలాగుననే ఎవరెంతా దుర్భాషలను మాట్లాడటకును, కానీ మాటలను చాటించుటకును, వదంతులను మాట్లాడి ఇతరులను గాయపరచుటకును తమ యొక్క నాలుకను ఉపయోగించుచున్నారే, అంతమునందు వారంతా నాలుకయందు న్యాయ తీర్పు చేయుచున్నప్పుడు, కలతచెందుదురు, వనికిపోవుదురు.
ఒక్క రోజున ప్రవక్తయైన యెషయా దేవుని ప్రసన్నత లోనికి వచ్చినప్పుడు, “అయ్యో! నేను నశించితిని; నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిని” (యెషయా. 6:5) అని కలతచెందెను. ప్రభువు కనికరించి కారుతో తీసిన నిప్పును యెషయా యొక్క నోటికి దాని తగిలించి: “ఇదిగో, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను” (యెషయా. 6:7) అనెను. ఆ దినము మొదలుకొని యెషయా యొక్క నాలుక స్తుతించుటకు వాడబడెను. ప్రభువు యొక్క మాటలను ప్రవచనముగా ప్రవర్తించుటకు వాడబడెను. స్తుతించుట ఒప్పిదమైనది, మనోహరమైనది. మీ యొక్క నాలుక ప్రభువును స్తుతించుటకే వాడుడి.
పలు సమయములయందు మన ఎదుట యెరికో కోట యొక్క ప్రాకారములు వచ్చుచున్నాయి. దేనిని ప్రారంభించినను ఆటంకములు; ముందుకు కొనసాగా లేకపోవుచున్నాము, అట్టి సమయములయందు మనస్సు సొమ్మసిల్లి సణుగుకొనుచు ఉండకూడదు. ప్రభువును స్తుతించి ఆర్భటించి బూరను బేరించవలెను. ఆనాడు ఇరికో కోట యొక్క ప్రాకారములు కూలి పడిపోయినట్లుగా మీయొక్క జీవితమునందుగల సమస్త ఆటంకములును విరిగి పడిపోవును (యెహోషువ. 6:20). దేవుని బిడ్డలారా, స్తుతించుటయే ఒప్పిదము.
నేటి ధ్యానమునకై: “నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను; ఆయన కీర్తి నిత్యము నా నోట నుండును” (కీర్తనలు. 34:1).