No products in the cart.
జూలై 11 – ఆత్మమూలముగా బలము
“నా జనులను (ఓదార్చుడి) ఆదరించుడి, ఓదార్చుడి ( యెషయా. 40:1).
మన యొక్క దేవుడు మనలను ఆదరించి ఓదార్చువాడు. మనలను బలపరచువాడు, ఆయన ఇంతవరకు మనలను బలపరచి త్రోవ నడిపించినందున నేడును మనము తాలుకుని నిలబడుచున్నాము. నేడును సజీవుల దేశమునందు కాపాడబడుచున్నాము. ఆయన దయచేయుచున్న శక్తిచేతను, బలముచేతను మనము ఉత్సాహపరచ బడుచున్నాము.
ప్రభువు ఎల్లప్పుడును మనము బలపరచ బడినవారై ఉండవలెను అనుటకై, పరిశుద్ధాత్మును మనకు దయచేసియున్నాడు. బలపరచి ఆదరించుట చేతనే ఆయన ‘ఆదరణకర్త” అని పిలువబడుచున్నాడు. ఆయన ఎల్లప్పుడును మనలోనే నివాసముండి మన యొక్క అంతరంగము సొమ్మసిల్లి పోవుచున్నప్పుడల్లా మనలను ఆదరించి ఓదార్చి ఉత్సాహపరచి జీవింపజేయుచునే ఉన్నాడు.
బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది, “మీయొద్ద ఎల్లప్పుడును ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును” (యోహాను. 14:16). ఆయనే ఆదరణకర్త. ఆయనే నిత్యానిత్యము మనతో కూడా ఉండువాడు. ఆయనే నిత్యా నిత్యము మనతో కూడా ఉండుట ఎంతటి శక్తి కలిగినది! ఎంతటి బలమైనది!
మిమ్ములను బలపరచుచున్న అట్టి పరిశుద్ధాత్ముడు, క్రీస్తు యొక్క మాటలను, వాగ్దానములను ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుచునే ఉన్నాడు. క్రీస్తును గూర్చిన సాక్ష్యమును ఇచ్చుచునే ఉన్నాడు.
యేసు సెలవిచ్చెను, “తండ్రియొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును” (యోహాను. 15:26).
అట్టి ఆదరణకర్త, మిమ్ములను బలపరచుట మాత్రము గాక, కొనసాగించి మీరు ప్రభువునందు నిలిచి ఉండునట్లు మీలో ఒక బలమైన పరిచర్యను చేయుచు వచ్చుచున్నాడు. అది ఎటువంటి పరిచర్య? పాపమును గూర్చియు నీతిని గూర్చియు న్యాయ తీర్పును గూర్చియు లోకమును ఖండించి ఒప్పింప చేయుచున్నాడు. పాపములు తొలగించబడితేనే గాని ప్రభువు నందు మీరు బలమును పొంది నిలిచి ఉండగలరు.
అంత మాత్రమే కాదు, ఇట్టి ఆదరణ కర్త మిమ్ములను సర్వసత్యములోనికి త్రోవ నడిపించుచున్నవాడై ఉన్నాడు. యేసు చెప్పెను, “సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును” (యోహను. 16:13).
ఆత్మలో నింపబడి ప్రార్థించుటయు, అన్యభాషలతో మాట్లాడి ఆనందించుటయు మీలో భక్తియందు ఒక క్షేమాభివృద్ధిని తీసుకొని వచ్చుటతో పాటు, బలమును, ధైర్యమును కూడా తీసుకొని వచ్చుచున్నది. మెండైన పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము మీలోనికి వచ్చుచున్నప్పుడు, మీ యొక్క కొదువలు, బలహీనతలు అన్నియు తొలగి ధైర్యమును పొందుకొందురు, బలమును పొందుకొందురు.
నేటి ధ్యానమునకై: “యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు; ఆయన….దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు; ఆనంద సంతోషములును, కృతజ్ఞతాస్తుతియు, సంగీతగానమును దానిలో వినబడును” (యెషయా. 51:3).