No products in the cart.
జూలై 07 – అనుకూలముగా ఉండెను!
“యెహోవా అతనికి తోడుగా ఉండెను; తాను వెళ్లిన చోట నెల్ల (అతడు జయము పొందెను) అతనికి అనుకూలముగా ఉండెను” (2. రాజులు. 18:17).
ఈ లేఖన భాగమునందు హిజ్కియా రాజును గూర్చి చెప్పబడియున్నది. హిజ్కియా రాజా అను మాటకు ‘నా బలము’ అనుట అర్థమునైయున్నది. ఎవరెవరైతే యెహోవాను తమ యొక్క బలముగా ఎన్నుకొనుచున్నారో, “నాకు బలమునైయున్న ప్రభువా నిన్ను ప్రేమించుచున్నాను” అని ఆశ్రయించుచున్నారో, అట్టివారికి ఎల్లప్పుడును ప్రతిచోట సమస్తమును అనుకూలముగా ఉండును.
హిజ్కియా రాజునకు ప్రభువు అనుకూలముగా ఉండుటకు మిగుల ముఖ్యమైన కారణము ఏమిటంటే, హిజ్కియా రాజు ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టెను (2. రాజులు.18:4).
ప్రభువు ద్వేషించుచున్న పాపములలో అతి భయంకరమైన పాపము విగ్రహ ఆరాధన పాపమునైయున్నది. ప్రభువునకు ఇవ్వవలసిన మహిమను విగ్రములకు ఇచ్చుచున్నప్పుడు, ప్రభువు వలన దానిని తట్టుకొనలేడు. “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” (నిర్గమ. 20:3) అని దిట్టముగాను స్పష్టముగాను ప్రభువు చెప్పెను. అదియే సమస్త ఆజ్ఞలన్నిటిలోను మొదటి ప్రాముఖ్యమైన ఆజ్ఞయైయున్నది.
విగ్రహము అంటే మనము కేవలము శిలా నమస్కారము అని మాత్రము తలంచుకొనకూడదు. మనము ప్రభువునకు ఇవ్వవలసిన స్థానమును ఏవేవి ఆక్రమించుచున్నదో, యెఏ అంశములకు దేవుని కంటే అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చుచున్నామో అది అన్నియును విగ్రహము అగుచున్నది.
కొందరు తమ యొక్క విద్యను విగ్రముగా కలిగియుందురు. కొందరు ఉద్యోగము ఉద్యోగము అని ఆదివారము కూడాను ఆలయమునకు వెళ్లకుండా తమ ఉద్యోగమును విగ్రముగా కలిగియుందురు. కొందరికి విశ్రాంతి దినమునందు కూడాను తమ దుకాణములను మూత వేయుటకు మనస్సు రాదు. ఇట్టి ధనాపేక్షయే విగ్రహము అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
మీరు విగ్రహాత్మలన్నిటిని మీయొక్క అంతరంగము నుండియు, కుటుంబము నుండియు వెళ్లగొట్టి, ప్రభువును రాజాధిరాజుగా మీయొక్క హృదయపు సింహాసనమువద్దకు తీసుకొని రండి. అప్పుడు ప్రభువు మీతో కూడా ఉండు. జరుగుచున్న సమస్తమును మీకు అనుకూలముగా ఉండును.
హిజ్కియా రాజు చేసిన మరొక అంశము కలదు. యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటికి మరమత్తు చేసెను (2. దినవృ. 29:3). దేవుని యొక్క ఇంటిని గూర్చిన భక్తి వైరాగ్యము ఆయనకు ఉండెను. కావున, ప్రభువు అనుకూలమైన ద్వారమును తెరచుటతో పాటు, ఆయన చేసిన సమస్తమును వర్ధిల్లచేసెను.
“మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదనియు, మీరు మీ సొత్తు కారనియు మీరెరుగరా?” (1. కోరింథీ. 6:19). అని బైబిలు గ్రంథము అడుగుచున్నది. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క దినము మీయొక్క శరీరమును పాపముచేతగాని, ఇచ్చలచేతగాని మలీన పరచుకొనకుడి.
నేటి ధ్యానమునకై: “అతడు నీటికాలువల యోరను నాటబడినదై, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును” (కీర్తనలు. 1:3).